కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం). విహారప్రాంతాలు: గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, …
పూర్తి వివరాలుతలకోనకు మూడురెట్లున్న గుంజన జలపాతం
నూరు ఏనుగు తొండాలతో కుమ్మరించినట్టు జలధార పైనుంచి భూమిలోకి దిగగోట్టినట్లు పడుతుంటుంది. అక్కడున్న ఒళ్ళు గగుర్పొడిచే గుండం, అర్ధముఖాకృతి నుంచి చిప్పిల్లే నీటి తుంపరలు పారవశ్యం కలిగిస్తున్నట్లుంది. ఓ పావురాల గుంపు పదేపదే అక్కడ చక్కర్లు కొడుతోంది. పాకుడు పట్టిన రాళ్ళ మధ్య పొడుచుకు వచ్చిన ఫెర్న్ మొక్కలు పాము పడగలల్లే...
పూర్తి వివరాలు