ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని కడప జిల్లా కొత్త కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. సోమవారం జాయింట్ కలెక్టర్ రామారావు నుంచి ఆయన కడప జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2003 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్ రమణకు జాయింట్ […]పూర్తి వివరాలు ...
Tags :కోన శశిధర్
కడపను క్రీడల ఖిల్లాగా తయారు చేస్తామని కలెక్టర్ కోన శశిధర్ ప్రకటిం చారు. ఇక్కడి వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో అఖిల భారత బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ ర్యాంకింగ్ పోటీలను శుక్రవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. కడపలో తొలిసారి ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు మంచి సూచనలు ఇస్తే రాబోయే కాలంలో మరింత పకడ్బందీగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానని […]పూర్తి వివరాలు ...