ముఖ్యమంత్రికి రాసిన బహిరంగలేఖలో కడప జిల్లా కాంగ్రెస్ కడప: కడప జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యాన్ని, జిల్లాపైన తెదేపా కొనసాగిస్తున్న వివక్షను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాసింది. ఈమేరకు ఇందిరాభవన్‌లో బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ఆ లేఖను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా చూస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కడప జిల్లాపై వివక్ష కొనసాగిస్తూనే ఉన్నారని ఆరోపించారు. ‘మీరు […]పూర్తి వివరాలు ...
Tags :కాంగ్రెస్
జిల్లాపై వివక్ష కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కడప : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాపై వివక్ష కొనసాగిస్తున్నాడని , ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఇతర జిల్లాకు తరలించడమే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్అహ్మద్ ఆరోపించారు. స్థానిక ఇందిరాభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ, ఒంటిమిట్ట ఉత్సవాలు, పెద్దదర్గా అభివృద్ధి, ఫుడ్‌పార్క్ మొదలైన వాటిపై శాసనసభలో ప్రకటన చేశారని.. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. ఉర్దూ […]పూర్తి వివరాలు ...
మొత్తానికి కడప జిల్లాకు చెందిన నాయకులు జిల్లా అభివృద్ది కోసం సమాలోచనలు సాగించడానికి సిద్ధమయ్యారు. ఈ దిశగా అఖిలపక్షం గురువారం కడపలో సమావేశం నిర్వహించింది. జిల్లా అభివృద్ది కోసము పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులూ, రైతు సంఘాల నాయకులూ నొక్కి చెప్పారు. ఇది ఒక ముందడుగు… ఈ అడుగులు గమ్యం చేరే వరకు ఇలాగే సాగాలని జిల్లా ప్రజానీకం ఆకాంక్షిస్తోంది! కడప: రాయలసీమలో వెనుకబడిన కడప జిల్లాను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే వివక్ష చూపుతోన్ననేపధ్యంలో […]పూర్తి వివరాలు ...
కడప: రాష్ట్ర మంత్రులకు కడప జిల్లా విహార కేంద్రంగా మారినట్లుందని.. ప్రైవేటు కార్యక్రమాలకు, మేమున్నామన్నట్లు ప్రెస్‌మీట్‌ల కోసం వస్తున్నారే కానీ అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని డీసీసీ అధ్యక్షుడు నజీర్అహ్మద్ ఆరోపించారు. స్థానిక ఇందిరాభవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర మంత్రి పీతల సుజాతకు రాష్ట్రవిభజన గురించి సరిగా తెలిసినట్లులేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రవిభజనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని ఆమె మరచినట్లుందన్నారు. […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లా పట్ల వివక్ష చూపుతున్న ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలను ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేపడితే సహించేదిలేదని, ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలను కచ్చితంగా ఒంటిమిట్టలోనే నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భద్రాచలంలోని శ్రీరామచంద్రమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు, పీతాంబరాలు సమర్పించేదని, ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భద్రాచలం తెలంగాణ ప్రభుత్వంలోకి వెళ్లిందన్నారు. ఈ నేపథ్యంలో […]పూర్తి వివరాలు ...
జిల్లా అభివృద్ధిపై ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో కడప : దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నాడని, కడప జిల్లాను పూర్తిగా మరిచారని శాసనమండలిలో ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లా అభివృద్ధిపై ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థంకాలేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కింద సుమారు రూ. 80వేల కోట్లు […]పూర్తి వివరాలు ...
కడప: రాష్ట్రంలో అశాంతి పెరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని , దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడప ఇందిరా భవన్‌లో నియోజకవర్గ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఇటీవల విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘మీరు ముక్కుసూటిగా […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో మొత్తం పది శాసనభ నియోజకవర్గాలున్నాయి. ఈ పది నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన వైకాపా, కాంగ్రెస్, తెదేపా+భాజపా మరియు జైసపాల తరపున బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు.పూర్తి వివరాలు ...
శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పరిస్థితి కడప జిల్లాలో దయనీయంగా మారింది. ఈనెల 30న జరిగే పురపాలక పోరులో ఆ పార్టీ తరపున నామినేషన్ వేసే నాధుడే కరవయ్యారు. జిల్లాలోని ఏడు మున్సిపాల్టీల్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్య రెండంకెలకు మించలేదు. ముఖ్యంగా మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాల్టీల్లో ఆ పార్టీ తరపున నామినేషన్ వేసే అభ్యర్థి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం పార్టీ పరిస్థితికి అద్దంపడుతోంది. కడప కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు […]పూర్తి వివరాలు ...