వర్గం : కోలాటం పాట బళ్ళారి జిల్లరా … బళ్ళారి జిల్లరా ఆదోని తాలూకురా రాసెట్టి వీరన్న కొడుకే రాయల వాడే రామయ్య రామా రామా కోదండరామా భై రామా రామా కోదండరామా రాసెట్టి వీరన్నకయితే ఎంతమంది కొడుకుల్లు ఒగరి పేరు రామయ్య ఒగరి పేరు సుబ్బయ్య అందరికంటే చిన్నావాడు అందగాడూ విశ్వనాధు పన్నెండామడ గడ్డలోన పేరుగల్ల రామయ్య ||రామా|| రామయ్య నేస్తులైన ఎంతమంది ఉన్నారు కొంగనపల్లి కిష్టరావు కోసిగానుమప్ప రా ||రామా|| బుద్ధిశాలి రామయ్య బూమ్మింద […]పూర్తి వివరాలు ...
Tags :కర్నూలు
ఎన్నికల్లో సహాయపడిన వారిని కోటీశ్వరులను చేసేందుకే సీఎం చంద్రబాబు విజయవాడను రాజధానిగా ప్రకటించారని కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా శాసనసభ్యులు ఎస్వీ మోహన్‌రెడ్డి , గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీలు విమర్శించారు.. వచ్చే ఎన్నికల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసుకోవడంలో భాగంగానే రాజధానిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారన్నారు. నలభై ఐదు అంతస్థుల భవనాలు నిర్మించడం ప్రమాదం కావచ్చని వారు హెచ్చరించారు.కర్నూలుకు అన్ని అర్హతలు ఉన్నా చర్చకు కూడా అవకాశం ఇవ్వలేదని మోహన్ రెడ్డి విమర్శించారు. […]పూర్తి వివరాలు ...
కర్నూలు: రాజధాని సీమ ప్రజల హక్కుఅని, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రమే అంతిమ లక్ష్యమని రాయలసీమ ప్రజాసమితి అధ్యక్షుడు క్రిష్ణయ్య, ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంరాష్ట్ర కో-కన్వీనర్ శ్రీనివాసులు గౌడ్, బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్స్‌ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘంజిల్లా కార్యదర్శి సుంకన్నలు స్పష్టం చేశారు. కర్నూలు నగరంలోని జార్జిరెడ్డి భవనంలో శనివారం కర్నూలు రాజధాని, రాయలసీమ రాష్ట్ర ఉద్యమ కార్యాచరణ కర పత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు […]పూర్తి వివరాలు ...
స్వార్థ ప్రయోజనాలతో, అధికార దాహంతో తెలుగుజాతిని చీల్చిన ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు రాజధాని కోసం ప్రజల ప్రయోజనాలు గాలికి వదిలి కోట్లకు పడగలెత్తిన రియల్‌ఎస్టేట్ వ్యాపారులకూ, వారి ప్రయోజనాలను కాపాడే అవినీతి రాజకీయ బేహారుల కోసం గాలింపులు సాగిస్తున్నారు. అశాతవాహన, కాకతీయ, రాయల విజయనగర యుగాలు తెలుగుజాతి సమైక్యతకూ, శతాబ్దాల తరబడి భాషా, సాంస్కృతిక వైభవ ప్రాభవాలకూ మూలవిరాట్టులుగా, కొండగుర్తులుగా నిలిచాయి. ఆనాటి సామంతరాజులైన మండల పాలకుల స్థానిక […]పూర్తి వివరాలు ...
జూన్ 2న కడప కలెక్టరేట్ వద్ద ధర్నా రాయలసీమలో రాజధానిని ఏర్పాటుచేయాలని కోరుతూ రాయలసీమ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదిన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఫ్రంట్ కమిటీ పేర్కొంది. బుధవారం స్థానిక వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కమిటీ నాయకులు, రాష్టబ్రిసి మహాసభ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, డిపిపి అధ్యక్షుడు సంగటి మనోహర్, ఎస్సీ,ఎస్టీ రైట్స్ ఫోరం అధ్యక్షుడు జెవి రమణ, సంపత్‌కుమార్, కళాధర్, సత్తార్‌లు మాట్లాడుతూ రాయలసీమలో ఉన్న రాజధానిని కోల్పోయి […]పూర్తి వివరాలు ...
‘దేవుని కడప’లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం కడప జిల్లాలోని ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. కడప నగరంలోని ఉన్న ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకోవటానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. నిర్మాణ శైలి : విజయనగర ప్రత్యేకతలు : ఏటా ఉగాది పర్వదినాన దేవుని కడప ఆలయాన్ని ముస్లింలు దర్శించుకుని స్వామి వారికి భత్యం సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం ఈ గుడిలో అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. సమీపంలోని దేవుని కడప చెరువులో పడవ విహారం […]పూర్తి వివరాలు ...
విభజన జరిగితే ప్రత్యేక రాయలసీమ ప్రకటించాల్సిందే తెలంగాణలో కలిపేందుకు కర్నూలు జిల్లా ఎవరి అబ్బ సొత్తు అని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన కల్లూరులోని స్వగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లాను తెలంగాణలో కలిపేందుకు డీల్లీ కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసిందన్నారు. ఇలాంటి కోతి చేష్టలు ఇప్పటికైనా మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలు బట్టలు విప్పి […]పూర్తి వివరాలు ...
విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి. సాహితీ సమరాంగణ చక్రవర్తిగా చరిత్రకెక్కిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ప్రస్తుత కడప ప్రాంతం రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రధాన భూమికను పోషించింది. కడప ప్రాంతంలో లభించిన […]పూర్తి వివరాలు ...