కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనబై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో […]పూర్తి వివరాలు ...
Tags :కథానిక
‘జీవితంలో చూసి ఉపేక్షించే విషయాలనే యీ కథలలో చదివి షాక్ తింటాం.’ అని నా కథల గురించి కుటుంబరావు అన్నారు. షాక్ (దిమ్మరపాటు) మాట యేమైనా పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్ర వేయాలనే ఉద్దేశంతోనే నేనీ కథానికలు రాసినాను. కథానికను గురించే కాదు. మొత్తం సాహిత్యం గురించే నా అవగాహన అది. అనుభూతి లేకుండా సాహిత్యమనేదే లేదు. సమస్త సాహిత్యమూ హృదయ వ్యాపారమే. అంటే అనుభూతి వ్యంజకమే. అయితే, అనుభూతి అనేది వెగటు కలిగించే […]పూర్తి వివరాలు ...