Tags :కడప

రాజకీయాలు

వైకాపా ధర్నా విజయవంతం

కడప: ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని.. లేదంటే ప్రభుత్వ మెడలు వంచి చేయిస్తామని వైకాపా నేతలు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కడప కలెక్టరేట్ ఎదుట వైకాపా నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీరుపైన విమర్శలు గుప్పించారు. సొంతమామనే వెన్నుపోటు పొడిచిన బాబుకు రైతుల్ని, మహిళల్ని నిలువునా ముంచడం పెద్ద విశేషమేమి కాదని పలువురు శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. నగర మేయర్ సురేష్‌బాబు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు వార్తలు

నగరంలో ట్రాఫిక్‌పై ఆంక్షలు… పోలీసు బలగాల పహారా

కడప: నగరంలో నేడు వైకాపా ధర్నా కార్యక్రమానికి వచ్చే నేతలు, రైతులు, పార్టీ కార్యకర్తల వాహనాల రాకపోకలకు సంబంధించి కడప డీఎస్పీ అశోక్‌కుమార్‌ ఆంక్షలు విధించారు. మైదుకూరు, కమలాపురం, పులివెందుల రోడ్డు మార్గంలో వచ్చే వాహనాలను మోచంపేట వద్ద ఉన్న మరాఠీ మఠం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. బద్వేలు, రాజంపేట, రాయచోటి మార్గం నుంచి వచ్చే వాహనాలకు రాజారెడ్డివీధిలోని సీఎస్‌ఐ చర్చి వెనుక ఖాళీ స్థలాల్లో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు […]పూర్తి వివరాలు ...

వార్తలు

హైకోర్టును కడపలో ఏర్పాటు చేయాల

కడప: హైకోర్టును కడపలో ఏర్పాటు చేయాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగరాజు శాసనమండలి ఉప సభాపతి సతీష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కడపలో హైకోర్టు ఏర్పాటుకు నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ వసతులు ఉన్నాయన్నారు. హైకోర్టును కడపలో ఏర్పాటు చేస్తే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అన్ని జిల్లాల కక్షిదారులకు కడప కేంద్రంగా ఉంటుందన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హెల్త్‌కార్డులు న్యాయవాదులకు మంజూరు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

విమానాశ్రయ డైరెక్టరు గారి వద్ద సమాచారం లేదు

ప్రారంభానికి సర్వమూ సిద్దమై చివరి నిమిషంలో ఆగిపోయిన (ప్రారంభం వాయిదా పడ్డ)  కడప విమానాశ్రయం గురించి డైరెక్టరుగారు ఇచ్చిన సమచారమిది… ప్రశ్న: కడప విమానాశ్రయ ప్రస్తుత పరిస్తితి ఏమిటి? సమాధానం: విమానాశ్రయానికి సంబంధించిన రన్ వే, టెర్మినల్ భవనం, ఏటిసి (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) స్తూపాల నిర్మాణం పూర్తయింది. ప్రశ్న: కడప విమానాశ్రయం ఎప్పటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది? సమాధానం: సమాచారం అందుబాటులో లేదు ప్రశ్న: కడప విమానాశ్రయం ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

గైర్హాజరుపై వైకాపా నేతల వివరణ

కడప: గురువారం కడపలో కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగితే కొంతమంది కీలక నేతలు పార్టీ మారే ఆలోచనతోనే సమావేశానికి రాలేదని మీడియాలో వచ్చిన  కథనాలను వైకాపా నేతలు ఖండించారు.శుక్రవారం రాత్రి స్థానిక వైకాపా కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కుమారుడు నాగిరెడ్డి సమక్షంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి విలేకరులతో […]పూర్తి వివరాలు ...

వార్తలు

విభజనోద్యమం తప్పదు

కడప: సీమహక్కులను కాలరాస్తే మరో విభజనోద్యమానికి నాందిపలుకుతాం… శ్రీశైలంలో 854 అడుగుల నీటినిల్వకై పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమం సాగిస్తామంటూ పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, రైతుసంఘాల నాయకులు, మేధావులు, ప్రముఖులు ఉద్ఘాటించారు. స్ధానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో గురువారం 107 జీవో ఉల్లంఘనపై అఖిలపక్ష, ప్రజాసంఘాల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నీలం సంజీవరెడ్డి రీసెర్చ్‌సెంటర్‌ పూర్వసంచాలకులు లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాలకుల వివక్ష కారణంగా ఒకనాటి రతనాల రాయలసీమ […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

సమావేశానికి రాని వైకాపా నేతలు

కడప: గురువారం కడపలో జరిగిన వైకాపా జిల్లా సర్వసభ్య సమావేశానికి కొంతమంది నేతలు హాజరు కాలేదు. దీంతో ఆయా నేతలు వైకాపాకు దూరంగా జరుగుతున్నారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.  రాజంపేట పార్లమెంటు సభ్యడు మిథున్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు కూడా హాజరు కాలేదు. ఇలా ముఖ్య నేతలు ముందస్తు సమాచారం […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

‘కడప జిల్లాను పూర్తిగా మరిచారు’

జిల్లా అభివృద్ధిపై ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో కడప : దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నాడని, కడప జిల్లాను పూర్తిగా మరిచారని శాసనమండలిలో ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లా అభివృద్ధిపై ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థంకాలేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కింద సుమారు రూ. 80వేల కోట్లు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడప విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆగింది ఇందుకా?

కడప విమానాశ్రయం ఈ నెల 14న ప్రారంభమవుతుందని ప్రకటించి  చివర్లో ఆ కార్యక్రమం వాయిదా పడినట్లు మీడియాకు లీకులిచ్చారు. ఎందుకు వాయిదా పడింది అనే అంశంపై అటు ఏఏఐ అధికారులు కాని, ఇటు జిల్లా అధికారులు ఇంతవరకూ వివరణ ఇవ్వలేదు. ఎయిర్‌పోర్టులో రన్‌వే  8 సీటర్‌ విమానం దిగేందుకు అవసరమైన స్థాయిలోనే నిర్మించారని అందువల్లే విమానాశ్రయం ప్రారంభం వాయిదా పడిందని ఎంపిక చేసిన పత్రికల్లో కథనాలు వచ్చాయి. వెంటనే మంత్రి కిశోర్ బాబు మరో మూడు నెలలలో […]పూర్తి వివరాలు ...