Tags :కడప

    ప్రత్యేక వార్తలు

    పెద్దదర్గాలో నారా రోహిత్

    కడప: ఆదివారం ఉదయం కడప నగరంలోని అమీన్‌పీర్(పెద్ద) దర్గాను సినిమా కథానాయకుడు నారా రోహిత్ దర్శించి గురువులకు పూలచాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఆలోచన తనకు లేదన్నారు.రాష్ట్ర ప్రజలందరికి మేలు జరగాలని పెద్దదర్గాలో ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. నారా రోహిత్ అం.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడైన రామ్మూర్తి నాయుడు కుమారుడు. ఈయన బాణం, సోలో, సారోచ్చారు, ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో మొదలైన చలనచిత్రాలలో కథానాయకుడిగా నటించారు.పూర్తి వివరాలు ...

    అభిప్రాయం రాజకీయాలు

    నోరెత్తని మేధావులు

    1980, 90 దశకాలలో రాయలసీమ జిల్లాలలో ఎక్కడ ఓ మోస్తరు దొంగతనం జరిగినా మరుసటి నాటి దినపత్రికలలో పోలీసుల ప్రకటన ఇలా ఉండేది. ‘దొంగతనం జరిగిన తీరును చూస్తోంటే ఇది స్టూవర్టుపురం ముఠాల పని అయి ఉంటుందని పోలీసులు ప్రాధమిక విచారణలో తేలింది’ అనేది ఆ ప్రకటనల సారాంశం. సదరు వార్తలు చదివిన వారికి స్టూవర్టుపురం దొంగల వెర్రితనం ఆశ్చర్యం కలిగించేది. ఎందుకంటే ఒకప్పుడు గుంటూరు జిల్లాలో భాగంగా ఉండిన చీరాలకు దగ్గరలో ఉన్న స్టూవర్టుపురం అనే […]పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు వార్తలు

    కిటకిటలాడిన దేవునికడప

    వైకుంఠ ఏకాదశి(ముక్కోటి దేవతలు వేచి దర్శనం పొంది స్వామి అనుగ్రహం పొందిన రోజు)ని పురస్కరించుకుని గురువారం దేవునికడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి కావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకే స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. గోవిందనామస్మరణల నడుమ కడపరాయుడిని ఉత్తరద్వారం వద్ద దర్శించి తరించారు. ఆలయప్రధాన అర్చకులు శేషాచార్యులు పూజలు చేసిన అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించినారు. వైకుంఠ ఏకాదశి అంటే? ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    రాచపాలెం చంద్రశేఖరరెడ్డికి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు

    ప్రముఖ సాహితీ విమర్శకులు, సాహితీవేత్త ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఈ ఏడాది కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన “మన నవలలు, మన కథలు” అనే విమర్శనా గ్రంథానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రకటించింది. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ప్రస్తుతం కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనాకేంద్రం భాద్యులుగా వ్యవహరిస్తూ ఇక్కడి యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో గౌరవ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని కుంట్రపాకం(తిరుపతి సమీప గ్రామం)లో జన్మించిన […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    జిల్లాలో 48 కరువు మండలాలు

    కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, చక్రాయపేట, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడు, వీరబల్లి, జమ్మలమడుగు, కడప, తొండూరు, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, అట్లూరు, వేంపల్లె, బద్వేలు, గోపవరం, చిన్నమండెం, రాయచోటి, పులివెందుల, […]పూర్తి వివరాలు ...

    సమాచారం

    కడప మీదుగా శబరిమలకు వెళ్ళే ప్రత్యేకరైళ్లు

    కడప మీదుగా శబరిమలకు మొత్తం మూడు ప్రత్యేకరైళ్లు, ఒక రోజువారీ రైలు నడుస్తున్నాయి. ఆ రైల్ల వివరాలు…. అకోల జంక్షన్ – కొల్లాంల మధ్య నడిచే 07505 నంబరు గల ప్రత్యెక రైలు అకోల నుంచి ప్రతి శనివరం బయలుదేరి కడపకు ఆదివారం ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. ఆదిలాబాద్ – కొల్లాంల మధ్య నడిచే 07509 నంబరు గల ప్రత్యేక రైలు కడప మీదుగా వెళుతుంది. ప్రతి శనివారం ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    అలా ఆపగలగడం సాధ్యమా?

    కడప: నగరంలో ఈ నెల 12న జరుగనున్న హిందూ శంఖారావం సభలో వీహెచ్‌పీ నేత ముస్లిం, మైనార్టీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా చూఒడాలని కోరుతూ ముస్లిం మైనార్టీల ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించినారు. ఈ సందర్భంగా వారు హిందూ శంఖారావం పేరుతో జరుగు సమావేశానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ముస్లింలను వ్యతిరేకించే విధంగా తొగాడియా వ్యాఖ్యలు చేయకుండా ఆపాలని వారు విజ్ఞప్తి చేశారు. భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ పెద్దలు […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    జిల్లాలో భాజపాను బలోపేతం చేస్తాం

    కడప: జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని ఆ పార్టీ నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కడపకు వచ్చిన ఆయన సోమవారం బీజేపీ నాయకుడు ప్రభాకర్‌ నివాసగృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనను చూస్తున్న ప్రజలు బీజేపీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ ప్రశ్నిస్తుందని, వ్యక్తిగత విమర్శలకు […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    రిమ్స్‌లో 10 పడకలతో కార్డియాలజీ విభాగం…త్వరలో

    కడప: రాజీవ్ గాంధీ వైద్య విద్యాలయం(రిమ్స్)లో త్వరలో 10 పడకలతో కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెరైక్టర్ అరుణకుమారి తెలిపారు.శుక్రవారం రిమ్స్ సంచాలకుని కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడిన ఆమె ఈ మేరకు వెల్లడించారు.అలాగే చిన్న పిల్లల వైద్యానికి సంబంధించి మరో విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. అరుణకుమారి శుక్రవారం రిమ్స్‌లోని పలు వార్డులను పరిశీలించారు. అనంతరం ఓపీ విభాగానికి వచ్చి అక్కడ మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలలో తన […]పూర్తి వివరాలు ...