Tags :కడప జిల్లా

    ప్రత్యేక వార్తలు

    వాన జాడ లేదు – సేద్యానికి దిక్కు లేదు

    18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్‌ పంటకు అను వైన జూన్‌, జులై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు నెలల్లో 393.5 మిల్లి మీటర్ల వర్షపాతం జి ల్లాలో నమోదు కావాల్సి ఉండగా 180.6 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది. వాస్తవికంగా 54 […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం రాజకీయాలు

    ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

    రాష్ట్ర రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తూ ఇచ్చిన ప్రకటనలో కడప జిల్లాకు విదిల్చిన ముష్టిలోని మెతుకులేమిటో ఒకసారి చూద్దాం: 1. స్టీల్ ప్లాంట్: ఇది కొత్తగా కడుతున్నదేమీ కాదు. ఏడేళ్ల కిందట ప్రారంభించి, మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని ఇప్పుడు కొనసాగించి పూర్తిచేస్తారు, అంతే. ఐతే దీన్ని సాకుగా చూపి, కేంద్ర ప్రభుత్వ విద్య, పరిశోధనా సంస్థలేవీ కడప జిల్లా ఛాయలకు రాకుండా చేశారు. కానీ కేవలం 11 పరిశ్రమలున్న కడప జిల్లాలో(Src:www.apind.gov.in/library/district/kadapa.pdf) పన్నెండో పరిశ్రమ నిర్మిస్తున్నందుకే ఇంకేమీ లేకుండా […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ఈ రోజు కడపకు శివరామక్రిష్ణన్

    ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నేడు కడప జిల్లాలో పర్యటించనుంది. ఉదయం 10.30 గంటలకు కడపలోని సభా భవనంలో జిల్లా అధికారులతో కమిటీ సమావేశం కానుంది. కొత్త రాజధాని ఏర్పాటుపై అభిప్రాయాలు, వినతలు స్వీకరించనుంది. ఇప్పటికే ఒకసారి ఆయా ప్రాంతాలలో పర్యటించి పర్యటనలు పూర్తైనట్లు ప్రకటించిన శివరామకృష్ణన్ కమిటీ ఇప్పుడు మళ్ళీ పర్యటిస్తుండడం వెనుక మతలబు ఏమిటో? ఒక పక్క కమిటీ ఇలా పర్యటనలు చేస్తోంటే రాష్ట్ర మంత్రులూ, ముఖ్యమంత్రీ రాజధాని, […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యం

    ప్రొద్దుటూరు: రాష్ట్ర విభజనానంతరం కడప జిల్లా అభివృద్ధి పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని జవివే  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తవ్వా సురేష్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు రమణయ్య శుక్రవారం డిప్యూటీ తహశీల్దార్ మహబూబ్‌బాషాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వంపై వత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. శివరామకృష్ణన్ కమిటీ జిల్లాను ఇంకా సందర్శించలేదన్నారు. ప్రభుత్వం కేంద్ర విద్యా సంస్థ ను ప్రకటించలేదని, రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని పేర్కొన్నారు. […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    అందులోనూ వివక్షే!

    కడప జిల్లా పర్యాటక రంగానికి మరోసారి అన్యాయం జరిగింది. కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీవద్ యశో నారాయణ మంగళవారం పార్లమెంటులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యాటకాభివృద్ధికి చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను లిఖిత పూర్వకంగా వివరించారు. మన రాష్ట్రానికి సాధారణ సర్క్యూట్ విభాగంలో పది ప్రాజెక్టులను కేటాయించారు. సాధరణంగా రాష్ట్ర ప్రభుత్వం పంపే నివేదికలకు అనుగుణంగా కేంద్రం ఇటువంటి ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేస్తుంది.. అందులో గుంటూరుకు మూడు కేటాయించి పశ్చిమ గోదావరికి రెండు, చిత్తూరు (శ్రీకాళహస్తి)కు […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    27న కడప జిల్లా భవిష్యత్ పై సదస్సు

    నగరంలోని సీపీ బ్రౌన్ లైబ్రరీలో జులై 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ‘కడప జిల్లా భవిష్యత్? ‘ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నామని జనవిజ్ఞానవేదిక (జవివే) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక సీపీ బ్రౌన్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, డాక్టర్ గేయానంద్‌లు సదస్సుకు ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు. ఉపన్యాసకులుగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గోపాల్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ఔను..వీళ్ళు కూడా అంతే!

    కడప జిల్లా అంటే అదేదో వినకూడని పేరైనట్లు ప్రభుత్వ పెద్దలు చిన్నచూపు చూస్తుంటే తాజాగా రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ తానేమీ తక్కువ తినలేదని నిరూపించింది.రాయలసీమలోని మూడు జిల్లాలను పరిశీలించిన సదరు కమిటీ సభ్యులు ఒక్క కడప జిల్లాను మాత్రం విస్మరించారు. ఎంచేత? ప్రభుత్వ పెద్దలూ, కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్యులూ అంతా కమిటీతో సంబంధం లేకుండా తమ సామాజికవర్గం, ధనికుల ప్రాబల్యం అధికంగా ఉండే గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించేశారు. […]పూర్తి వివరాలు ...

    చరిత్ర

    కడప జిల్లా శాసనాలు 2

    స్మారక శిలలు, వీరగల్లులు … శాసన భేదాల్లో స్మారక శిలలు, వీరగల్లులను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం ఉంది. యుద్ధంలో మరణించిన వీరులకు, దైవానుగ్రహం కోసం ఆత్మబలి చేసుకున్న భక్తులకు స్మారక శిలలను ప్రతిష్ఠించే ఆచారం ఉండేది. బృహచ్ఛిలాయుగం నాటి సమాధులు, చారిత్రక యుగం నాటి ఛాయాస్తంభాలు, బౌద్ధస్తూపాలు కూడా స్మారక చిహ్నాలేనని చరిత్రకారుల అభిప్రాయం. రాజులు, రాణులు, మత గురువులు మరణించినప్పుడు వారి స్మృత్యర్థం ఛాయాస్తంభాలను నిలిపేవాళ్లు మరణించినవారి ఛాయ ఈ స్తంభంలో ఉంటుందని ఆనాటి […]పూర్తి వివరాలు ...

    చరిత్ర

    కడప జిల్లా శాసనాలు 1

    తెలుగు శాసనాలను గురించి మాట్లాడేటప్పుడు తెలుగు భాషకు తొలి అక్షరార్చన కడప జిల్లాలో జరిగిందనే విషయాన్ని తప్పనిసరిగా స్మరించుకోవలసి ఉంటుంది. ఇప్పటివరకు లభించిన తెలుగు శాసనాల్లో రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శాసనం మొట్టమొదటిది. ఈ రాజుదే ఇంకొక శాసనం ఎర్రగుడిపాడులో కూడా లభించింది. శాస్త్రాన్ని బట్టి ఈ శాసనాలు క్రీ.శ.575 ప్రాంతానికి చెందినవిగా నిర్ణయించబడ్డాయి. ప్రాచీన తెలుగు శాసనాల్లో ఎక్కువభాగం రేనాటి చోళులవే కావడం వల్ల ప్రాచీనాంధ్ర భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ శాసనాలే […]పూర్తి వివరాలు ...