కోడూరు: ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంగా ఉన్న విశాఖపట్టణంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంతో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు సాధించిందని అదేస్థాయిలో కడపలోనూ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి జిల్లా స్వరూపాన్నే మార్చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పథకరచన చేస్తున్నట్లు జిల్లాకు ఇంచార్జిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన గత పాలకులు కడప జిల్లాతో పాటు రాష్ట్రాన్ని కూడా భ్రష్టుపట్టించారన్నారు. […]పూర్తి వివరాలు ...
Tags :కడప జిల్లా
హైదరాబాద్: ప్రభుత్వ మాజీ సలహాదారు, సినీ నిర్మాత, విసు సంస్థల అధినేత సీసీరెడ్డి (చవ్వా చంద్రశేఖర్‌రెడ్డి, 76) సోమవారం రాత్రి 7.10 గంటలకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయనకు డయాలసిస్ చేస్తున్న సమయంలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కక్కడికక్కడే మృతి చెందినట్లు కేర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సీసీ రెడ్డి కడప జిల్లా పులివెందుల సమీపంలోని చినకుంట్ల గ్రామంలో 1938 […]పూర్తి వివరాలు ...
జన్మభూమి గ్రామసభల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 12, 13వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. ఆదివారం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామసభల్లో కడప జిల్లాపై వరాలజల్లును కురిపిస్తారని మంత్రి చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, టెక్స్‌టైల్ పార్కు, గాలేరు-నగిరి ప్రాజెక్టు, రైల్వేలైన్ల నిర్మాణం చేపడతామన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో కడప జిల్లా ముఖచిత్రమే మారిపోనుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లను అందిస్తామన్నారు. 27 వేల పెన్షన్లపై […]పూర్తి వివరాలు ...
గొడ్రాండ్రు దిగంబరులై భజనలు, నాట్యం చేస్తూ పార్శ్వనాథుని ఆలింగనం చేసుకునేవారు. రానురాను ఇది సభ్య ప్రపంచంలో అశ్లీలమై బూతు తిరునాళ్లుగా మారింది. తరువాత బ్రిటిష్ పాలకుల కాలం నాటికి కడప జిల్లా కలెక్టరు సర్ థామస్ మన్రో 1800- 1807 ప్రాంతంలో అశ్లీలతతో కూడిన ఆరాధనోత్సవాలను నిలిపేశారు. మరి కొంత కాలానికి మరింత జుగుప్సాకరంగా తిరునాళ్ల కొనసాగింది. 1918లో జిల్లా కలెక్టరు గారైన హెచ్.హెచ్. బర్‌కిట్...పూర్తి వివరాలు ...
కడప: కడప జిల్లా పట్ల ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యింది. సీమలో ఉక్కు పరిశ్రమ, నిరకజలాల సాధనకు ప్రాణ త్యాగాలు చేయడానికైనా వెనుకాడమని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు స్పష్టం చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందగా మూసి బంద్‌కు మద్దతు తెలిపారు. కొన్ని చోట్ల సంస్థలను సమాఖ్య ప్రతినిధులు మూయించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగాసురేష్, నగర అధ్యక్షుడు అంకుశం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు […]పూర్తి వివరాలు ...
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 11 జాతీయ స్థాయి సంస్థల్లో ఒక్కటి కూడా కడపకు ఇవ్వలేదు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై మౌనమేల? అరకొర నిధులతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయా? ఎర్రగుంట్ల – నద్యాల రైల్వే లైను వెంటనే పూర్తి చెయ్యాలి నీటి సరఫరాను ప్రయివేటు పరం చేసే ప్రయత్నం డీఆర్‌డీవో ప్రాజెక్టును చిత్తూరుకు తరలించారు మంత్రుల పర్యటనలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం కడప: జిల్లా అభివృద్ధినపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే సహించబోమని తక్షణమే అభివృద్ది పనులు […]పూర్తి వివరాలు ...
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు. సోమవారం కడపలో విలేఖర్లతో మాట్లాడిన ఆయన జిల్లాలో రాజకీయంగా బలం లేదనే కారణంతో ఈ ప్రాంతంపై వివక్ష చూపుతున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదన్న నెపంతో వారిపై కక్ష కట్టడం సబబు కాదని ఆయన అన్నారు. సీఎం పథకాలు మంత్రులకే అర్ధం కావడం లేదని ఆయన విమర్శించారు. మంత్రులకే అర్ధంకాని పథకాలను ప్రజల వద్దకు ఎలా చేరుతాయని రామచంద్రయ్య […]పూర్తి వివరాలు ...
కడప: కడప జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివక్ష చూపుతున్నాడని రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన రాయచోటిలోని వైకాపా పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ…. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించి కోస్తా- ఆంధ్రలో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. కడప జిల్లాకు రావాల్సిన డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాన్ని ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు కేటాయించుకోవడం అన్యాయమన్నారు. దీనిపై తెదేపా జిల్లా నేతలు కూడా నోరు మొదపలేదన్నారు. కడపలో విమానాశ్రయం పూర్తయినా ఇంత వరకు ప్రారంభించలేదన్నారు. […]పూర్తి వివరాలు ...
కమలాపురం: కడప జిల్లా పై ప్రభత్వ వివక్షకు నిరసనగా మరియు జిల్లా సమగ్రాభివృద్ధిని కోరుతూ.. ఈ నెల 22, 23, 24 తేదీల్లో అన్ని మండల కార్యాలయాల ఎదుట సీపీఐ, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని, ప్రజలు కూడా పాల్గొని ఆయా కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. వనరుల ఆధారంగా సమగ్రంగా అభివృద్ధి చేయకపోతే.. జిల్లా శాశ్వత ఏడారిగా మారే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించకుండానే జిల్లాను […]పూర్తి వివరాలు ...