2013లో కడప జిల్లాలో IPC (Indian Penal Code) కింద నమోదైన నేరాల రేటు 222.4గా ఉంది. నేరాల రేటును లక్ష మంది జనాభాను ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తారు. అదే సంవత్సరం ఆం.ప్ర రాష్ట్రంలో సగటు నేరాల రేటు 244.5గా ఉంది. 2013వ సంవత్సరంలో కృష్ణా (254.1), గుంటూరు అర్బన్ (388.1), నెల్లూరు (232.6), విశాఖపట్నం (297.3), చిత్తూరు (తిరుపతితో కూడిన) (281), రాజమండ్రి నగరం(239.4), విజయవాడ నగరం (416.2), రంగారెడ్డి (469.6), నిజామాబాద్ (269.6), నల్గొండ […]పూర్తి వివరాలు ...
Tags :కడప జిల్లా
కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ తిరిగి శ్రమకోర్చి సమాచారం సేకరించి ‘కడప జిల్లా సాహితీ మూర్తులు’ అనే పుస్తకం రాశారు. వేరొకరు ముందుకొచ్చి ఖర్చులు భరించి దాన్ని ప్రచురించారు. బహుశా అదే సమయంలో తెలంగాణకు చెందిన మౌనశ్రీ మల్లిక్ రాసిన ‘కడప జిల్లా చైతన్యమూర్తులు’ అనే పుస్తకం కూడా వచ్చింది. అది ఆంధ్రజ్యోతి అనే పత్రికకు ఎంత భరించరానిదైందంటే ఆ రెంటిని […]పూర్తి వివరాలు ...
వివిధ సందర్భాలలో తెదేపా అధినేత చంద్రబాబు కడప జిల్లాకు గుప్పించిన హామీలు… తేదీ: 30 అక్టోబర్ 2018, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో ధర్మ పోరాట దీక్ష ప్రదేశం: ప్రొద్దుటూరు, కడప జిల్లా [divider style=”normal” top=”10″ bottom=”10″] ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు : కేంద్రం ముందుకు రానందున మేమే ముందుకు వచ్చి నెలరోజుల్లో కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తాం పులివెందులలో చీనీ చెట్లు ఎండకుండా కాపాడిన ఘనత మాది 677 కోట్లు వ్యయం చేసి గండికోటను పూర్తిచేసి 12 […]పూర్తి వివరాలు ...
ఆహోబిల మఠ సంస్తాపనాచార్యులైన శ్రీమాన్ శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరినాడు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య. అన్నమయ్య దర్శించుకున్న రాయలసీమ జిల్లాలలోని ఆలయాల జాబితా : కడప జిల్లా: దేవుని కడప లక్ష్మీవెంకటేశ్వరాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం గండికోట చెన్నకేశవాలయం గండికోట రామాలయం ప్రొద్దుటూరు చెన్నకేశవాలయం పొట్లదుర్తి చెన్నకేశవాలయం వెయ్యినూతులకోన నృసింహాలయం సంబటూరు చెన్నకేశవాలయం పెద్దచెప్పలి చెన్నకేశవాలయం మాచనూరు చెన్నకేశవాలయం పాలగిరి చెన్నకేశవాలయం కోన చెన్నకేశవాలయం […]పూర్తి వివరాలు ...
బౌద్ధ ప్రదీప కడప కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నాగనాదేశ్వరుని కొండ నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు– బుద్ధుడి మధుర జ్ఞాపకాలు, భావితరాలకు నిత్య స్ఫూర్తి దీపికలు. కడప జిల్లాను కూడా బౌద్ధ పర్యాటకం లో భాగం చేసి, ఇక్కడి బౌద్ధ ప్రదేశాలను అభివృద్ధి చేయవలసిందిగా జిల్లా ప్రజలు, పర్యాటక ప్రియులు, బౌద్ధ విశ్వాసులు కోరుతున్నారు. కడప జిల్లాలో వేల సంవత్సరాల పాటు బౌద్ధం వైభవంగా విరాజిల్లింది. అనంతపురం జిల్లాలోని ఎర్రగుడిలోనూ, కర్నూలు జిల్లా పత్తికొండ […]పూర్తి వివరాలు ...
జిల్లా రైతులకు ముఖ్యమంత్రి పరోక్ష సందేశం కడప: రైతులు కడప జిల్లాలో వరి సాగు చేయకుండా ఉద్యాన పంటలు పండించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరోక్షంగా సందేశమిచ్చారు. అలాగే కడప జిల్లాను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, అందుకే ఇక్కడి నుంచి ఉద్యాన రైతుల రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. స్థానిక పురపాలిక మైదానంలో శనివారం ఉద్యాన రైతుల రుణ ఉపశమన పత్రాలు మరియు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా […]పూర్తి వివరాలు ...
పల్లెలను వదలని పాడు జరాలు కన్నెత్తి చూడని వైద్య సిబ్బంది నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వం జేబులు గుల్ల చేస్తున్న ప్రయివేటు ఆసుపత్రులు రాజధాని ‘శ్రద్ధ’ ప్రజారోగ్యం పై ఏదీ? కరువు దరువుకు తోడు ప్రభుత్వ ఆదరువు లేక అల్లాడుతున్న మన పల్లెలపైన పాడు జరాలు పగబట్టినాయి. కడప జిల్లాలోని పలు పల్లెలు పాడు జరాల బారిన పడి విలవిలలాడుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారుగా 50కి పైగా ప్రాణాలు జ్వరాల కారణంగా గాల్లో కలిసిపోయినట్లు అనధికార సమాచారం. […]పూర్తి వివరాలు ...
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాఉద్యమం సీమ ప్రజలంతా పోరుబాటకు సిద్ధం కావాల ప్రొద్దుటూరు: కడప జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం అలవికాని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ, తీవ్ర వివక్ష చూపుతోందని శాసనమండలి సభ్యుడు డాక్టరుఎం.గేయానంద్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఒక ఆసుపత్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… రాయలసీమకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినహామీలు ఇంతవరకు అమలు కాలేదన్నారు. నదీజలాల పంపకంలో రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు. రాయలసీమ అభివృద్ది విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాఉద్యమం చేస్తామని హెచ్చరించారు.వెనకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం ప్రజలంతా పోరుబాటకు సిద్ధం […]పూర్తి వివరాలు ...
పోయిన వారం విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి కడపకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రులూ, అధికారుల సమక్షాన మాట్లాడుతూ “కడప జిల్లాకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం” అని ఘనంగా ప్రకటించేశారు. ఆయన వివిధ సందర్భాల్లో జిల్లాకిచ్చిన హామీలన్నీ కలిపి జాబితా తయారుచేస్తే ఒక ఉద్గ్రంథమౌతుంది. రాజకీయ నాయకులన్నాక చాలా సందర్భాల్లో చాలా చాలా హామీలు అటు ఆంతరంగిక సమావేశాల్లోనూ, ఇటు బహిరంగ సభల్లోనూ కూడా ఎన్నెన్నో ఇచ్చేస్తూ ఉంటారు. వాటిని పట్టుకుని నిలదీయాలనుకోవడం […]పూర్తి వివరాలు ...