కడప: ప్రస్తుతం వైకాపాలో ఉన్న కందుల సోదరులు భాజపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వీరు భాజపా నేతలతో జరుపుతున్న చర్చలు కొలిక్కి వచ్చినట్లు మీడియాలో కధనాలు వెలువడ్డాయి. కందుల రాజమోహన్‌రెడ్డి ఆ పార్టీ ముఖ్యనేతతో భేటీ అయ్యి, చేరిక తేదీని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. జనవరి 9వ తేదీన విజయవాడకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారు. ఆయన సమక్షంలో చేరేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ అది కుదరకపోతే 18వ తేదీన కడప నగరంలో […]పూర్తి వివరాలు ...
Tags :కందుల
కందుల శివానంద రెడ్డి, అతని సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజమోహన రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు. వీరు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ఆర్ సిపి నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యే అభ్యర్ధి అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల సోదరులు మాట్లాడుతూ జిల్లా అభివృద్ది కోసమే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా వైకాపాలో చేరినట్లు చెప్పారు. మొదట కాంగ్రెస్ పార్టీలో […]పూర్తి వివరాలు ...
ఇటీవలే కాంగ్రెస్ నుండి తరిగి తెలుగుదేశంలో చేరిన కందుల రాజమోహన్‌రెడ్డి కడప లోక్‌సభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబును కలిసి ఈ విషయమై విన్నవించినట్లు ఆయన తెలిపారు. కడపలోని తన ఇంట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మంచి నాయకుడు అవసరమన్నారు. బాబు సిఎం అయితే రాష్ట్రాభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చే నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో మంతనాలు సాగిస్తున్నారు. జిల్లాలో మకాం వేసిన సీఎం రమేష్ సమీకరణలు కూడగట్టడంలో తలమునకలయ్యారు.కందుల సోదరులు, మేడా మల్లిఖార్జునరెడ్డి, వీరశివారెడ్డి, రమేష్ రెడ్డి (రాయచోటి) సహా పలువురు కాంగ్రెస్ నేతలను దేశంలోకి రప్పించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తునారు. ఇప్పటికే వరదరాజులరెడ్డిని పార్టీలో చేర్చుకున్న దేశం నేతలు మిగిలిన వారిపై దృష్టి సారించారు. శుక్రవారం ఉదయం వీరశివారెడ్డిని కలిసి […]పూర్తి వివరాలు ...