Tags :అన్నమయ్య

ప్రసిద్ధులు సంకీర్తనలు

అన్నమయ్య కథ (మొదటి భాగం)

అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ పాడుతూంది. “చందమామ రావో జాబిల్లి రావో,మంచి కుందనంపు పైడికోర వెన్నపాలు తేవో” ఈ చందమామ పాట వ్రాసిందెవరో తెలుసా! తాళ్లపాక అన్నమాచార్యులు/అన్నమయ్య – వేంకటేశ్వరస్వామికి గొప్ప భక్తుడు; మహా కవి. మన తెలుగులో తొలి వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడంటే పాటలు స్వయంగా వ్రాసి పాడేవాడని అర్ధం. వేంకటేశ్వరుడు, అన్నమయ్య మేలుకొలుపు పాట పాడుతూంటే విని నిద్రలేచేవాడు. మళ్ళీ ఆయన జోలపాట పాడందే నిద్రపోడు. స్వామికే గాదు అమ్మవారికి కూడ […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇందరికి నభయంబు లిచ్చుచేయి – అన్నమయ్య సంకీర్తన

ఇందరికి నభయంబు లిచ్చుచేయి కందువగు మంచి బంగారు చేయి॥ వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి చిలుకు గుబ్బలికింద చేర్చు చేయి కలికి యగు భూకాంత కౌగిలించినచేయి వలనైన కొనగోళ్ళ వాడిచేయి॥ తనివోక బలిచేత దానమడిగిన చేయి ఒనరంగ భూదానమొసగు చేయి మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చినచేయి ఎనయ నాగేలు ధరియించు చేయి॥ పురసతుల మానములు పొల్లసేసినచేయి తురగంబుబరపెడి దొడ్డచేయి తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి॥పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు వార్తలు

అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు ప్రారంభం

సంకీర్తనాచార్యులు అన్నమయ్య 511వ వర్థంతి ఉత్సవాలు గురువారం ఆయన జన్మస్థలి తాళ్లపాక గ్రామం (రాజంపేట మండలం)లో తితిదే ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య ధ్యానమందిరంలో గోష్టి గానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నమయ్య చిత్రపటాన్ని గ్రామ పురవీధుల్లో వూరేగించారు. అంతకు ముందు అన్నమయ్య మూలవిరాట్ వద్ద గ్రామపెద్దలు, తితిదే అధికారులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. చివరగా నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తితిదే అధికారులు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

అన్నమయ్య 511వ వర్థంతి ఉత్సవాలు

పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 511వ వర్థంతి ఉత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకూ అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక, 108 అడుగుల విగ్రహం వద్ద, తిరుమల, తిరుపతిలలో దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తి.తి.దే డిప్యూటీ ఈవోలు శారద, బాలాజీ, ఏఈవో పద్మావతి తెలిపారు. ఇటీవల తాళ్లపాక అన్నమాచార్య ధ్యానమందిరంలో వర్థంతి ఉత్సవాల గోడపత్రాన్ని విడుదల చేశారు. తాళ్ళపాక, 108 అడుగుల విగ్రహం వద్ద జరిగే కార్యక్రమాలు: 27న బహుళద్వాదశి పూజలు, గోష్ఠిగానం, అన్నమయ్య చిత్రపటం […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

రాజవు నీకెదురేదీ రామచంద్ర – అన్నమయ్య సంకీర్తన

గండికోట శ్రీరామచంద్రుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటను చేరిన ‘పదకవితా పితామహుడు’ అక్కడి రాముని సేవించి తరించినాడు.  గండికోట శ్రీరామచంద్రునికి అన్నమయ్య సమర్పించిన సంకీర్తనా నీరాజనమిది…. వర్గం : శృంగార సంకీర్తన కీర్తన సంఖ్య: 165 (19వ రాగిరేకు) రాగం: దేవగాంధారి ‘రాజవు (పు) నీకేదురేదీ’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. ‘రాజవు నీకేదురేదీ’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ […]పూర్తి వివరాలు ...

వార్తలు

24 నుంచి అన్నమయ్య 605వ జయంతి ఉత్సవాలు

పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుని 605వ జయంత్యుత్సవాలకు తి.తి.దే బుధవారం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్‌చార్జి డెరైక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఆఫీసర్ టీఏపీ నారాయణ తాళ్లపాకలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 26 వరకు జయంత్యుత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్నమయ్య జన్మస్ధలం అయిన తాళ్లపాకలోని ధ్యానమందిరంలో నాదస్వర సమ్మేళనంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. గ్రామోత్సవం, సప్తగిరి గోష్టిగానం, శ్రీవారి కల్యాణం, […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం పర్యాటకం

“కడప దేవుని గడప” అని ఎందుకంటారో …

ఒంటిమిట్ట – దీన్నే ఏకశిలానగరం అంటారు. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో ఇక్కడకు వచ్చి దీనిపైన మూడురోజులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికి ఇంకా వారికి ఆంజనేయస్వామీ పరిచయం కాకపోవటంతో ఇక్కడ సీతారామలక్ష్మణుల విగ్రహాలే ఉంటాయి. ఆంజనేయస్వామీ విగ్రహం విడిగా ఆలయఆవరణలో ఒకప్రక్కన ఉంటుంది. ఈ విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్ట చేసాడని అంటారు. ఈ క్షేత్రానికి చాలా ప్రశస్తి ఉంది. పోతన ఇక్కడే ఉండి భాగవతాన్ని వ్రాసాడని చెప్తారు. ఆయన నివసించిన ఇల్లు కూడా ఉందికాని […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

భావమెరిగిన నల్లబల్లి చెన్నుడా : అన్నమయ్య సంకీర్తన

నల్లబల్లి చెన్నకేశవునిపై అన్నమయ్య రాసిన సంకీర్తన – 1 శఠగోప యతీంద్రులకడ సకల వైష్ణవాగమములను అభ్యసించిన అన్నమయ్య జీవితమే ఒక ధీర్ఘశరణాగతి. కడప గడపలో జనియించిన ఈ వాగ్గేయకారుడు తన నుతులతో వేంకటపతిని కీర్తించి ఆనంద నృత్యం చేసినాడు. నల్లబల్లి – కడప జిల్లా, ముద్దనూరు మండలంలోని ఒక గ్రామం. ఇక్కడ గల చెన్నకేశవ స్వామిని పలుమార్లు దర్శించి తరించిన అన్నమయ్య, ఆ స్వామిపై పలు సంకీర్తనలను రాసి – పాడినాడు. Your browser does not […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అన్నమాచార్యుని గురించి ఆయన మనవడు రాసిన సంకీర్తన

అన్నమాచార్యుని గురించి ఆయన మనవడు తాళ్లపాక చినతిరుమలాచార్య రాసిన సంకీర్తన ఇది … రాగం-సాళంగనాఁట ప : అప్పనివరప్రసాది అన్నమయ్యా అప్పసము మాకె కలఁ డన్నమయ్యా చ : అంతటికి నేలికైన ఆదినారాయణుఁ దన యంతరంగాన నిలిపీ నన్నమయ్యా సంతసానఁ జెలువొందె సనకసనందనాదు లంతటివాఁడు తాళ్ళపా కన్నమయ్యా                   &పూర్తి వివరాలు ...

error: