॥పల్లవి॥ఏమి వొరలేరు యేమి మరలేదుయీ మాయలంపటం బీఁదమోఁదనేకాని॥చ1॥సతులుగలమేలు దా సడిఁబొరలనేకానిసతమైన సౌఖ్యస్వస్థానంబు లేదుహితులు గలమేలు తా నిడుమఁబొరలనె కానిహితవివేకము నరుల కెంతైన లేదు॥చ2॥తనువు లెత్తినమేలు తగులాయమేకానికనుఁగొనఁగ యోగభోగము గొంత లేదుఘనము గలమేలు తా గర్వాంధమేకానిఘనుఁడైన శ్రీనాథుఁ గనుగొనగ లేదు॥చ3॥చింతగలిగిన మేలు చివుకఁబట్టనెకానిచింత వేంకటవిభునిఁ జింతించ లేదుసంతు గలిగిన మేలు సంసారమే కానిసంతతముఁ జెడని సద్గతిఁ జేర లేదు రాగము: శుద్దవసంతం రేకు: 0066-06 సంపుటము: 1-345 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య సాహిత్యం
॥పల్లవి॥ఎదుటినిధానమ వెటుచూచిన నీ-వదె వేంకటగిరియనంతుఁడా॥చ1॥సొగిసి భాద్రపదశుద్ధచతుర్ధశితగువేడుక నిందరు గొలువపగటుసంపదలు బహుళ మొసఁగు నీ-వగు వేంకటగిరియనంతుఁడా॥చ2॥తొలుత సుశీలకు దుశ్శీలవలనవెలయ సంపదల విముఖఁడవైవలెనని కొలిచిన వడిఁ గాచినమా-యల వేంకటగిరియనంతుఁడా॥చ3॥కరుణఁ గాచితివి కౌండిన్యుని మునుపరగినవృద్ధబ్రహ్మఁడవైదొరవులు మావులు ధ్రువముగఁ గాచిన-హరి వేంకటగిరియనంతుఁడా రాగము: శుద్దవసంతం రేకు: 0066-05 సంపుటము: 1-344 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకుజాలెల్ల నడఁగించు సంకీర్తనం॥చ1॥సంతోషకరమైన సంకీర్తనంసంతాపమణఁగించు సంకీర్తనంజంతువుల రక్షించు సంకీర్తనంసంతతముఁ దలచుఁడీ సంకీర్తనం॥చ2॥సామజముఁ గాంచినది సంకీర్తనంసామమున కెక్కుడీ సంకీర్తనంసామీప్య మిందరికి సంకీర్తనంసామాన్యమా విష్ణు సంకీర్తనం॥చ3॥జముబారి విడిపించు సంకీర్తనంసమబుద్ధి వొడమించు సంకీర్తనంజమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనంశమదమాదులఁ జేయు సంకీర్తనం॥చ4॥జలజాసనునినోరి సంకీర్తనంచలిగొండసుతదలఁచు సంకీర్తనంచలువ గడు నాలుకకు సంకీర్తనంచలపట్టి తలఁచుఁడీ సంకీర్తనం॥చ5॥సరవి సంపదలిచ్చు సంకీర్తనంసరిలేని దిదియపో సంకీర్తనంసరుస వేంకటవిభుని సంకీర్తనంసరుగననుఁ దలఁచుఁడీ సంకీర్తనం రాగము: సామంతం రేకు: 0066-04 సంపుటము: 1-343 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కరుణానిధిం గధాదరంశరణాగతవత్సలం భజే॥చ1॥శుకవరదం కౌస్తుభాభరణంఆకారణప్రియ మనేకదంసకలరక్షకం జయాధికం సే –వకపాలకమేవం భజే॥చ2॥వురగశయనం మహోజ్ఞ్వలం తంగరుడారూఢం కమనీయంపరమపదేశం పరమం భవ్యంహరిం ధనుజభయదం భజే॥చ3॥లంకాహరణం లక్ష్మీరమణంపంకజ సంభవ భవప్రియంవేంకటేశం వేదనిలయం శు…భాంకం లోకమయం భజే రాగము: కన్నడగౌళ రేకు: 0066-03 సంపుటము: 1-342 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కన్నడగౌళపూర్తి వివరాలు ...
॥పల్లవి॥సతతము నేఁ జేయు ననాచారములకుఁ గడ యెక్కడమతి ననుఁగని కావుము రామా రామా రామా॥చ1॥నేసిననాబ్రహ్మత్యలు శిశుహత్యలు గోహత్యలుఆసలనెన్నో యెన్నో ఆయాజాడలనుయీసున నేనిపు డెరిఁగియు నెరఁగక సేసేదురితపు-రాసులకును గడలే దిదె రామా రామా రామా॥చ2॥నమలెడి నావాచవులకు నానావిధభక్షణములుకమిలిన దుర్గంధపు శాకమ్ములు దొమ్ములునుజముబాధల నరకంబుల సారేకు నన్నెటువలె శ్రీ …రమణుఁడ ననుఁగాచే విటు రామా రామా రామా॥చ3॥కపటపునాధనవాంఛలు కలకాలముఁ బరకాంతలఁజపలపుదలఁపుల నేఁతల సంఖ్యము లరయఁగనుయెపుడును నిటువలెనుండెడుహీనుని నన్నెటు గాచెదోరపమున శ్రీ వేంకటగిరి రామా రామా రామా రాగము: ఆహిరి రేకు: […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎందుఁ జూచినఁ దనకు నిన్నియును నిట్లనేకందులేనిసుఖము కలనైన లేదు॥చ1॥సిరులు గలిగిన ఫలము చింతఁ బొరలనె కానిసొలది సంతోష మించుకయైన లేదుతరుణి గల ఫలము వేదనలఁ బొరలుటె కానినెరసులేని సుఖము నిమిషంబు లేదు॥చ2॥తనువుగల ఫలము పాతకము సేయనె కానిఅనువైన పుణ్యంబు అది యింత లేదుమనసుగల ఫలము దుర్మతిఁబొందనే కానిఘనమనోజ్ఞాన సంగతి గొంత లేదు॥చ3॥చదువుగలిగిన ఫలము సంశయంబే కానిసదమల జ్ఞాననిశ్చయ మింత లేదుయిది యెరిఁగి తిరువేంకటేశ్వరునిఁ గొలిచిననుబ్రదుకు గలుగును భవము ప్రాణులకు లేదు రాగము: శుద్దవసంతం రేకు: 0066-01 సంపుటము: […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥చదివెఁబో ప్రాణి సకలము యీ-చదువుమీఁది విద్య చదువఁడాయఁగాని॥చ1॥సిరులు చంచలమని చేఁతలధ్రువమనిపరగుసంసారము బయలనితొరలిన సుఖమెల్ల దు: ఖమూలమనియెరిఁగి లోభమువీడ నెరఁగఁడాయఁగాని॥చ2॥తలకొన్న ధర్మమే తలమీఁది మోఁపనివలసీనొల్లమి దైవవశమనికలిమియు లేమియుఁ గడవఁగ రాదనితెలిసి లోభము వీడఁ దెలియఁడాయఁగాని॥చ3॥యేచిన పరహితమెంతయుఁ దమ దనివాచవులిన్ని నెవ్వగలనియీచందమున వేంకటేశుచేఁతలనిచూచి లోభమువీడఁ జూడడాయఁగాని రాగము: ధన్నాశి రేకు: 0065-06 సంపుటము: 1-339 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ధన్నాశిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥అలర నుతించరో హరినియెలయించి మిము భ్రమయించీనిఁ గాలము॥చ1॥సేయరో మనుజులార చింత హరినిఁకనైనరోయరో మీభుజియించు రుచులమీఁదకాయ మస్థిరము యీకలి మధ్రువము చాలఁబోయఁబో యెందుకుఁగాకపోయఁ గాలము॥చ2॥మెచ్చరో మనుజులార మీరే హరికథలుపుచ్చరో మీమదిలోని పొరలెల్లానుకొచ్చరో మనుజులార కోరికలెల్లను మీకు-నిచ్చీని శుభములు యివి యెల్లకాలము॥చ3॥కనరో వేంకటపతిఁ గన్నులుదనియఁగావినరో యీతనిస్తుతి వీనులు నిండమనరో శ్రీహరిచేతిమన్ననలు మీరుతనమీఁదిమది బుద్ధి దాఁచీనిఁ గాలము రాగము: భూపాళం రేకు: 0065-05 సంపుటము: 1-338 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎండలోనినీడ యీమనసుపండు గాయసేయఁబనిలేదు మనసు॥చ1॥వానచేతకములవలెనాయ మనసుగోనెఁబట్టినబంకగుణమాయ మనసుమానఁజిక్కినకోలమతమాయ మనసుతేనెలోపలియీఁగ తెఱఁగాయ మనసు॥చ2॥గడిరాజుబదుకాయ కడలేని మనసునడివీది పెసరాయ నయమైన మనసుగడకుఁగట్టినపాఁతగతి దోఁచె మనసుఅడుసులోపలికంబమై తోఁచె మనసు॥చ3॥తెరవుచూపినజాడఁ దిరుగు నీమనసుమరుగఁజేసినచోట మరుగు నీ మనసుతిరువేంకటేశుపైఁ దిరమైన మనసుసిరిగలిగినచోటఁ జేరు నీమనసు రాగము: ఆహిరి రేకు: 0065-04 సంపుటము: 1-337 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరిపూర్తి వివరాలు ...