Tags :అన్నమయ్య సాహిత్యం

సంకీర్తనలు

ప్రాణులనేరమి గాదిది బహుజన్మపరంపరచే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ప్రాణులనేరమి గాదిది బహుజన్మపరంపరచేప్రాణులు సేసిన తమతమ పాపఫలము గానిread॥చ1॥హరి సకలవ్యాపకుఁడని అందరుఁ జెప్పఁగ నెరిఁగియుపరదైవంబులఁ గోలువకపాయరు మానవులునరపతి భూమేలఁగ భూవరు భజియింపఁగనొల్లకపరిసరవర్తులబెంబడిఁ బనిసేనినయట్లు॥చ2॥పొందుకు తమతమ సేసినపూజలు మ్రొక్కులు గైకొనుఅందముగాఁ బురుషాత్తముఁ డాతఁడే కలఁడనియుఅందరు నెరిఁగియు యితరులఁ జెందుదురున్నత శైలమునందక చేరునతరువుల నందుకొనినయట్లు॥చ3॥శ్రీ వేంకటపతి యొక్కఁడె చెప్పఁగ జగములకెల్లనుదైవము నాతుమలోపలిధనమనఁగా వినియుసేవింపరు పామరు లీదేవుని మధురంబొల్లకవావిరిఁ బులుసులు చేఁదులు వలెనని కొనునట్లు రాగము: గుండక్రియ రేకు: 0069-05 సంపుటము: 1-362 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎక్కడ చొచ్చడి దీభవమేదియుఁ గడపల గానము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎక్కడ చొచ్చడి దీభవమేదియుఁ గడపల గానమువుక్కునఁ బరితాపానల మూదక మండెడివి॥చ1॥హృదయవికారము మాన్పఁగ నేతెరఁగును సమకూడదుమదనానందము చెరుపఁగ మందేమియు లేదుపొదలినదేహగుణంబులఁ బోనడువఁగ గతి గానముబ్రదికించినకోరికెలకుఁ బ్రాయము దిరిగినది॥చ2॥కమలినయజ్ఞానం బిది కన్నులముందరఁ గానదుతిమిరము పొదిగొని చూడ్కికి దెరువేమియు లేదుతెమలనియాశాపాశము తెంపఁగ సత్వము చాలదుమమకారము వెడలింపఁగ మతి యెప్పుడు లేదు॥చ3॥దురితంబులు పుణ్యంబులు తొడిఁబడ నాత్మనుఁ బెనగొనిజరగఁగ శరీరధారికి సత్కర్మము లేదుతిరువేంకటగిరిపతియగు దేవశిఖామణిపాదముశరణని బ్రదుకుటదప్పను సన్మార్గము లేదు రాగము: బౌళి రేకు: 0069-04 సంపుటము: 1-361 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇత్తడి బంగారుసేయ నింతకు నేరుతునంటా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇత్తడి బంగారుసేయ నింతకు నేరుతునంటాకొత్తసేఁతలెల్ల దొరకొంటిగా నీవు॥చ1॥హీనులైనవారు నిన్ను నేచి కొలిచిన ఘన-మైన పదవులఁ బెట్టేయెటువలెనేమానక యెవ్వతెనైన మచ్చికఁ దగిలి నాతో …..నానిపట్టి సరివేసే వద్దిరా నీవూ॥చ2॥కడుఁబాతకులు నిన్నుఁ గదిసి కొలిచేరంటా-నడరి పుణ్యులఁజేయునటువలెనేకడఁగి యెవ్వతెనైన గాజు మాణికము సేసివడి నన్నుఁ గెరలించవద్దురా నీవూ॥చ3॥దిందుపడ మాయసేసి దేవుఁడ నేఁగానంటా….నందరి భ్రమలఁ బెట్టునటువలెనేఅందమైనన తిరువేంకటాద్రీశ నీప్రేమచెంది నన్నుఁ గూడి దాఁచజెల్లునా నీవూ రాగము: సామంత రేకు: 0069-03 సంపుటము: 1-360 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చెలి నేఁడు తానేమి సేయునమ్మ చెలి యేమిసేయు నీ- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥చెలి నేఁడు తానేమి సేయునమ్మ చెలి యేమిసేయు నీ-చెలు లేమి సేయుదురు చెలువైన విభుమేనిచెలు వింత సేయఁగాread॥చ1॥సతి నేఁడు బంగారుచవికెలోఁ జిత్రంపు-గతు లెంత చూపినఁ గడకంటఁ జూడదుఅతనిఁజూచినమంచియబ్బురపుఁజూపులుఅతనివెంటనే పోయ నటుగాఁబోలును॥చ2॥తేనియలూరేటి మంచి తియ్యనిమాటలు మంత్ర-గానములుగా వినుపించి కడువేసరితిమివానిమాటలు విన్నవలనైన ముదమునవీనులు ముద్రించిన విధముగాఁబోలును॥చ3॥నిచ్చళపుమోమున నెయ్యము దైలువారెబచ్చనచేఁతలు గుబ్బలపై నిండనొప్పెనుఅచ్చపువేడుక వేంకటాద్రీశుఁ డీరేయినెచ్చెలికి నిచ్చినట్టినేరుపు గాఁబోలును రాగము: ఆహిరి రేకు: 0069-02 సంపుటము: 1-359 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

దొరుకునా యితని కృప తుదిపదంబు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥దొరుకునా యితని కృప తుదిపదంబుఅరిది విభవము లొల్లమనినాఁ బొదలుread॥చ1॥సొంపలర నితఁడు కృపఁజూచు టరుదని కాకయింపు సామాన్యమా యితని కరుణలంపటము ఘనమైన లక్ష్మీకటాక్షములుసంపదలు తోడనే చల్లు వెదలాడు॥చ2॥తగ నితనిపై భక్తి తగులు టరుదని కాకనగుట సామాన్యమా ననచి యితఁడుజగదేక హితములుగ సరసతలు సౌఖ్యములుదిగులువాయఁగ నితడు దిప్పుదీరాడు॥చ3॥తిరువేంకటాద్రి సిద్ధించు టరుదని కాకమరుగఁ దను నిచ్చునా మరియొకరినియిరవైన భోగములు యిష్టసామ్రాజ్యములువిరివిగొని యితని దయ వెంటనే తిరుగు రాగము: సామంతం రేకు: 0069-01 సంపుటము: 1-358 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అస్మదాదీనాం అన్యేషాం – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అస్మదాదీనాం అన్యేషాంతస్మికా తస్మికా తత్రచ పునశ్చ॥చ1॥సతతాధ్యయననిష్ఠాపరాణాం దృఢ-ప్రతినాం యతీనాం వనవాసినాంగతిరిహ స్మర్తుం కా జగత్యాం పర-స్థితిరియం కా విష్ణుసేవా పునశ్చ॥చ2॥మోహినామత్యంతముష్కరాణాం గుణ-గ్రాహిణాం భవనైకకఠినానాందేహసంక్షాళన విదేశకోవా దాశ్రీహరిస్మరణవిశేష: పునశ్చ॥చ3॥కింకుర్వాణదు:పంకిలమనోభయభ్రాంతానాంశంకాం నిరురుతి స్సరసా కా, శ్రీ-వేంకటాచలపతేర్వినుతి: పునశ్చ రాగము: పాడి రేకు: 0068-06 సంపుటము: 1-357 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తలఁపులోపలి తలఁపు దైవమితఁడు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥తలఁపులోపలి తలఁపు దైవమితఁడుపలుమారుఁ బదియునుఁ బదియైన తలఁపుread॥చ1॥సవతైనచదువులు సరుగఁ దెచ్చిన తలఁపురవళిఁ దరిగుబ్బలివి రంజిల్లు తలఁపుకవగూడఁ గోరి భూకాంతముంగిట తలఁపుతివిరి దూషకు గోళ్ళఁ దెగటార్చు తలఁపు॥చ2॥గొడగువట్టినవానిఁ గోరి యడిగిన తలఁపుతడఁబడక విప్రులకు దానమిడు తలఁపువొడిసి జలనిధినిఁ గడగూర్చితెచ్చినతలఁపుజడియక హలాయుధము జళిపించు తలఁపు॥చ3॥వలపించి పురసతులవ్రతము చెరిచిన తలఁపుకలికితనములు చూపఁగలిగున్న తలఁపుయిల వేంకటాద్రిపై నిరవుకొన్న తలఁపుకలుషహరమై మోక్షగతిచూపు తలఁపు రాగము: వసంతం రేకు: 0068-05 సంపుటము: 1-356 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

విశ్వప్రకాశునకు వెలిఁయేడ లో నేడ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥విశ్వప్రకాశునకు వెలిఁయేడ లో నేడశాశ్వతున కూహింప జన్మమిఁక నేడ॥చ1॥సర్వపరిపూర్ణునకు సంచారమిఁక నేడనిర్వాణమూర్తికిని నిలయమిఁక నేడవుర్వీధరునకుఁ గాలూఁదనొక చోటేడపార్వతీ స్తుత్యునకు భావమిఁక నేడ॥చ2॥నానాప్రభావునకు నడుమేడ మొదలేడఆనన సహస్రునకు నవ్వలివ లేడమౌని హృదయస్థునకు మాటేడ పలుకేడజ్ఞాన స్వరూపునకుఁ గాన విననేడ॥చ3॥పరమ యోగీంద్రునకు పరులేడ తా నేడదురితదూరునకు సంస్తుతి నింద లేడతిరువేంకటేశునకు దివ్యవిగ్రహ మేడహరికి నారాయణున కవుఁగాము లేడ రాగము: కన్నడగౌళ రేకు: 0068-04 సంపుటము: 1-355 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎక్కడనున్నా నీతఁడు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎక్కడనున్నా నీతఁడుదిక్కయి మాదెసఁ దిరిగీఁగాక॥చ1॥సరసుఁడు చతురుఁడు జగదేకగురుఁడుపరమాత్మ డఖిల బంధువుఁడుహరి లోకోత్తరుఁ డతఁడే నామతిసిరితోఁ బాయక చెలఁగీఁగాక॥చ2॥ఉన్నతోన్నతుఁ డుజ్జ్వలుఁ డధికుఁడుపన్నగశయనుఁడు భవహరుఁడుయిన్నిటఁగ లిగిన యిందిరారమణుఁడుమన్ననతో మము మనిపీఁగాక॥చ3॥మమతల నలమేల్మంగకు సంతత –రమణుఁడు వేంకటరాయఁడుజమళిసంపదల సరసవిభవములతమకంబున మముఁదనిపీఁగాక రాగము: ముఖారి రేకు: 0068-03 సంపుటము: 1-354 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారిపూర్తి వివరాలు ...

error: