॥పల్లవి॥వందే వాసుదేవంబృందారకాధీశ వందిత పదాబ్జం॥చ1॥ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ-చందనాంకితల సచ్చారు దేహంమందారమాలికా మకుటసంశోభితంకందర్పజనక మరవిందనాభం॥చ2॥ధగధగిత కౌస్తుభాధరణ వక్షస్థలంఖగరాజవాహనం కమలనయనంనిగమాదిసేవితం నిజరూపశేష ప-న్నగరాజ శాయినం ఘన నివాసం॥చ3॥కరిపురనాధ సంరక్షణే తత్పరంకరిరాజ వరదసంగత కరాబ్జంసరసీరుహాననం చక్రవిభ్రాజితంతిరువేంకటాచలా దేవం భజే రాగము: శ్రీరాగం రేకు: 0008-05 సంపుటము: 1-53 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య సంకీర్తనలు
॥పల్లవి॥చాలదా హరినామ సౌఖ్యామృతము దమకుచాలదా హితవైన చవులెల్ల నొసఁగ॥చ1॥ఇదియొకటి హరినామ మింతైనఁ జాలదాచెదరకీ జన్మముల చెఱలు విడిపించమది నొకటె హరినామ మంత్రమది చాలఁదాపదివేలు నరకకూపముల వెడిలించ॥చ2॥కలదొకటి హరినామ కనకాద్రి చాలదాతొలఁగుమని దారిద్ర్యదోషంబు చెఱుచతెలివొకటి హరినామ దీపమది చాలదాకలుషంపు కఠినచీఁకటి పారఁద్రోల॥చ3॥తగువేంకటేశు కీర్తన మొకటి చాలదాజగములో కల్పభూజంబు వలెనుండసొగిసి యీ విభునిదాసుల కరుణ చాలదానగవుఁజూపులను నున్నతమెపుడుఁ జూప రాగము: శ్రీరాగం రేకు: 0008-04 సంపుటము: 1-52 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నదు లొల్లవు నా స్నానము కడు-సదరము నాకీ స్నానము॥చ1॥ఇరువంకల నీయేచినముద్రలుధరియించుటే నాస్నానముధరపై నీనిజదాసులదాసుల-చరణధూళి నాస్నానము॥చ2॥తలఁపులోన నినుఁదలఁచినవారలఁదలఁచుటే నాస్నానమువలనుగ నినుఁగనువారల శ్రీపాద-జలములే నాస్నానము॥చ3॥పరమభాగవతపాదాంబుజముల-దరుశనమే నాస్నానముతిరువేంకటాగిరిదేవ నీకథాస్మరణమే నాస్నానము రాగము: ముఖారి రేకు: 0008-03 సంపుటము: 1-51 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥జీవాతుమై యుండు చిలుకా నీ-వావలికి పరమాత్ముఁడై యుండు చిలుకా॥చ1॥ఆతుమపంజరములోన నయముననుండి నాచేతనేపెరిగిన చిలుకాజాతిగాఁ గర్మపుసంకెళ్ళఁబడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకాభాతిగాఁ జదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకారీతిగా దేహంపురెక్కలచాటున నుండి సీతుకోరువలేని చిలుకా॥చ2॥బెదరి అయిదుగురికిని భీతిఁబొందుచుఁ గడుఁ జెదరఁగఁ జూతువే చిలుకాఅదయులయ్యిన శత్రులారుగురికిఁగాక అడిచిపడుదువే నీవు చిలుకావదల కిటు యాహారవాంచ నటు పదివేలు వదరులు వదరేటి చిలుకాతుదలేని మమతలు తోరమ్ము సేసి నాతోఁగూడి మెలగిన చిలుకా॥చ3॥నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందుఁ జిలుకాశ్రీవేంకటాద్రిపై […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కొనుట వెగ్గళము దాఁ దినుట యల్పము మీఁదు-గనుట వినుట లేక దా కడచన్నభవము॥చ1॥ఆపద వడ్డికినిచ్చి అనుభవింపఁబోయినయేపున నెవ్వరికి నిం దేమిగలదుపాపపుపైరు విత్తినపండిన పంటలలోనరూపింపఁగ నిందు రుచి యేమిగలదూ॥చ2॥ఘనుఁడైనతిరువేంకటనాథుఁ డిన్నిటికి-యును భోక్తయుఁ గర్మియును నైనవాఁడుపనిలేదు నిష్ఠూరపరుఁడు దానై వుండుతనకుఁ దానె కర్త తనమౌటఁ గాన రాగము: గుండక్రియ రేకు: 0008-01 సంపుటము: 1-49 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకుబూడిదిలో హోమమై పోయఁ గాలము॥చ1॥ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడి ననికదిసిన యాసచేఁ గడవలేకయెదురుచూచి చూచి యెలయించి యెలయించిపొదచాటు మృగమై పోయఁ గాలము॥చ2॥ఇంతటఁ దీరెడి దుఃఖ మంతటఁ దీరెడిననివింతవింత వగలచే వేఁగివేఁగిచింతయు వేదనలఁ జిక్కువడుచు నగ్ని-పొంతనున్న వెన్నయై పోయఁ గాలము॥చ3॥యిక్కడ సుఖము నా కక్కడ సుఖంబనియెక్కడికైనా నూర కేఁగియేఁగిగక్కన శ్రీతిరువేంకటపతిఁ గానకపుక్కిటి పురాణమయి పోయఁ గాలము రాగము: బౌళి రేకు: 0007-04 సంపుటము: 1-48 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పాయని కర్మంబులె కడుబలవంతము లనినప్పుడెకాయమునకు జీవునకునుఁ గర్తృత్వము లేదు॥చ1॥ఆతుమ కలవ్యాపకమని తలపోసినపిమ్మటజాతియుఁ గులాభిమానముఁ జర్చింపనెరాదుభూతవికారములన్నియుఁ బురుషోత్తముఁ డనినప్పుడుపాతకముల పుణ్యంబులపని తనకే లేదు॥చ2॥పదిలంబుగ సర్వాత్మకభావము దలఁచినపిమ్మటముదమున నెవ్వరిఁ జూచినఁ మొక్కకపోరాదుకదిసిన యిప్పటి సుఖములె కడుదుఃఖములని తెలిసినచెదరక సంసారమునకు జేసాఁపనెరాదు॥చ3॥పరిపూర్ణుఁడు తిరువేంకటపతియనఁగా వినినప్పుడుయెరవుల హీనాధికములు యొగ్గులు మరి లేవుపరమాత్ముండగు నీతని భక్తులందలఁచిన యప్పుడుతిరముగ నీతనికంటెను దేవుఁడు మరి లేఁడు రాగము: సామంతం రేకు: 0007-03 సంపుటము: 1-47 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకునుమంగళము సర్వాత్మకునకు ధర్మస్వరూపునకూ,జయజయ॥చ1॥ఆదికినినాదైన దేవున కచ్యుతున కంభోజనాభున-కాదికూర్మంబైన జగదాధారమూర్తికినివేదరక్షకునకును సంతతవేదమార్గవిహారునకు బలి-భేదికిని సామాదిగానప్రియవిహారునకు॥చ2॥హరికిఁ బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకునుపరమపురుషోత్తమునకును బహుబంధదూరునకుసురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్టునకు కరుణా-కరునకునుఁ గాత్యాయనీ నుతకలితనామునకు॥చ3॥పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకుశంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకువేంకటాచలవల్లభునకును విశ్వమూర్తికి నీశ్వరునకునుపంకజాకుచకుంభకుంకుమపంకలోలునకు రాగము: లలిత రేకు: 0007-02 సంపుటము: 1-46 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥మంచిదివో సంసారము మదమత్సరములు మానినకంచునుఁ బెంచును నొకసరిగాఁ దా చూచినను॥చ1॥ఆపదలకుమ సంపదలకు నభిమానింపక యుండినపాపముఁ బుణ్యము సంకల్పములని తెలిసిననుకోపము శాంతము తమతమగుణములుగా భావించినతాపము శైత్యమునకుఁ దాఁ దడఁబడకుండినను॥చ2॥వెలియును లోపలయును నొకవిధమై హృదయం బుండినపలుకునుఁ బంతము దా నొక భావన దోఁచిననుతలఁపునఁ దిరువేంకటగిరిదైవము నెలకొనియుండినసొలపక యిన్నిటికినఁ దా సోఁకోరుచెనైనా రాగము: లలిత రేకు: 0007-01 సంపుటము: 1-45 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...