Tags :అన్నమయ్య సంకీర్తనలు

సంకీర్తనలు

చెయ్యరాని చేతల వోచెన్నకేశ్వరా – అన్నమయ్య సంకీర్తన

గండికోట చెన్నకేశవుని సంకీర్తన – 3 చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వెలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడి ప్రణయ గాధను ఈ విధంగా స్తుతిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 1354-5 సంపుటము: 23-323 చెయ్యరాని చేఁతల వోచెన్నకేశ్వరా చేయం టేవు గండికోట […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నీకేల వెరపు నీవూ నేనూ నొక్కటే – అన్నమయ్య సంకీర్తన

స్వాధీన పతికయైన శృంగార నాయక ఒకతె కడపరాయని లీలలు కొనియాడుచూ, సుతారముగా ఆయనను దెప్పిపొడుస్తూ ‘నీవూ నేనూ ఒకటే కదా. నన్ను చూస్తే నీకెందుకయ్యా అంత భయం’ అంటూ తనని వశపరచుకున్న వైనాన్ని వివరిస్తోంది. అన్నమయ్య గళం నుండి జాలువారిన ఆ సంకీర్తనా మాధుర్యం మీ కోసం… వర్గం: శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 0277-5 సంపుటము: 9-161  ‘నీకేల వెరపు’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… నీకేల వెరపు నీవూ […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చెల్లునా నీ కీపనులు చెన్నకేశా – అన్నమయ్య సంకీర్తన

గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన – 2 చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వెలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: ముఖారి రేకు: 1009-2 సంపుటము: 20-50 చెల్లునా నీ కీపనులు చెన్న కేశా ‘చెల్లునా […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కాదనకు నామాట కడపరాయ – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుని ‘కడపరాయడు’ జగదేక సుందరుడు. కన్నెలు తమ జవ్వనమునే వానికి కప్పముగ చెల్లించినారు. కన్నె సోయగమునకు మురిసిన కడపరాయడు చెలువతో చెలిమి చేసి శృంగారము చేసినాడు. వర్గం: శృంగార సంకీర్తన రేకు: 587-4 సంపుటము: 13-458 రాగము: సాళంగనాట  ‘కాదనకు నా మాట’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… కాదనకు నామాట కడపరాయ – నీకు గాదెఁబోసే వలపులు కడపరాయ ॥పల్లవి॥ కప్పుర మియ్యఁగరాదా కడపరాయా- నీకుఁ గప్పితి నాపయ్యెదెల్లఁ గడపరాయా-వో […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కప్పురమందుకొంటిఁ గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

వర్గం: శృంగార సంకీర్తన రేకు: 561-4 సంపుటము: 13-302 రాగము: శంకరాభరణం Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… కప్పురమందుకొంటిఁ గడపరాయ నీకుఁ గప్పము మా జవ్వనము కడపరాయ ॥పల్లవి॥ కన్నుల మొక్కేనోయి కడపరాయ నా కన్నెచన్ను లేలంటేవు కడపరాయ కన్నవారెల్లా నవ్వేరు కడపరాయ నాతో సన్న లేల సేసేవు సారెఁ గడపరాయ ॥కప్పుర॥ కలఁగంటిఁ గడవోయి కడపరాయ యిఁకఁ గలఁచకు మాసిగ్గు కడపరాయ [&పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ

తన సంకీర్తనా మాధుర్యంతో అలమేలుమంగ పతిని కీర్తించి తరించిన పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. కడప జిల్లాకు చెందిన ఈ వాగ్గేయకారుడు పాలకొండల ప్రకృతి సోయగాల నడుమ నెలవై, భక్తుల కొంగు బంగారమై భాసిల్లుతున్న వేయి నూతుల కోన (వెయ్యినూతుల కోన) నృసింహున్ని చూడరమ్మని ఇలా కీర్తిస్తున్నాడు.. ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ వేడుకఁ బరుషలెల్ల వీధినుండరమ్మా. ||పల్లవి|| అల్లదివో వోగునూతులౌభళేశు పెద్దకోన వెల్లిపాల నీటి జాలు వెడలే సోన చల్లనిమాఁ కులనీడ సంగడిమేడలవాడ […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

రామభద్ర రఘువీర … అన్నమయ్య సంకీర్తన

సంకీర్తన:296  ‘రామభద్ర రఘువీర’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో॥పల్లవి॥ కౌసల్యానందవర్ధన ఘనదశరథసుత భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ రాసికెక్క కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా॥రామభద్ర॥ మారీచసుబాహు మర్దన తాటకాంతక దారుణవీరశేఖర ధర్మపాలక కారుణ్య రత్నాకర కాకాసుర వరద సారెకు వేదవిదులు జయవెట్టేరయ్యా ॥రామభద్ర॥ సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుటయోధ్యాపుర నిలయా యీతల శ్రీవేంకటాద్రి నిరవయిన […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అప్పులేని సంసారమైన… అన్నమయ్య సంకీర్తన

అప్పులేని సంసార మైనపాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన జాలు // పల్లవి // కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు చింతలేని యంబలొక్క చేరెడే చాలు జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు వింతలేని సంపదొక్క వీసమే చాలు // అప్పులేని // తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు // అప్పులేని // లంపటపడని మేలు లవలేసమే […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నరసింహ రామకృష్ణ : అన్నమయ్య సంకీర్తన

భగవదంకితబుద్ధులను ఏ దుష్టశక్తులూ నిలుపలేవు. భగవంతుని చేరడానికి పేర్కొన్న నవవిధ భక్తి మార్గాలలో వైరాన్ని ఆశ్రయించిన వారు శిశుపాల హిరణ్యకసిపాదులు. వైకుంఠవాసుడు ఆ దుష్టశక్తులను సంహరించి తన సాధుసంరక్షకత్వాన్ని చాటినాడు. అన్నమయ్య తన సంకీర్తన తపస్సును భంగపరిచే దుష్ట రాజకీయ శక్తులను నిర్మూలించమని వేంకటగిరి నృశింహుని ఇలా వేడుకుంటున్నాడు….  Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… నరసింహ రామకృష్ణ నమో శ్రీవేంకటేశ సరుగ నా(నా) […]పూర్తి వివరాలు ...

error: