Tags :అన్నమయ్య సంకీర్తనలు

సంకీర్తనలు

ఏణ నయనల చూపులెంత సొబగైయుండు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఏణ నయనల చూపులెంత సొబగైయుండుప్రాణ సంకటములగు పనులు నట్లుండు॥చ1॥ఎడలేని పరితాప మేరీతిఁ దానుండుఅడియాస కోరికలు నటువలెనె యుండుకడలేని దుఃఖసంగతి యెట్లుఁ దానుండుఅడరు సంసారంబు నట్లనే వుండు॥చ2॥చింతా పరంపరలఁ జిత్తమిది యెట్లుండువంతఁ దొలఁగన మోహవశము నట్లుండుమంతనపుఁ బనులపయి మనసు మరియెట్లుండుకంతుశరమార్గముల గతి యట్లనుండు॥చ3॥దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండుశ్రీవేంకటేశు కృపచేత లట్లుండుభావగోచరమైన పరిణతది యెట్లుండుకైవల్యసౌఖ్య సంగతులు నట్లుండు రాగము: నారణి రేకు: 0016-05 సంపుటము: 1-99 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎంత చేసిన తనకేది తుద – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎంత చేసిన తనకేది తుదచింత శ్రీహరిపైఁ జిక్కుటే చాలు॥చ1॥ఎడపక పుణ్యాలెన్ని చేసినాఁగడమే కాకిఁకఁ గడ యేదితడఁబడ హరియే దైవమనుచును మదివిడువక వుండిన వెరవే చాలు॥చ2॥యెన్నితపము లివి యెట్లఁ జేసినాఅన్నువ కధికము కలవేదివన్నెలఁ గలఁగక వనజాక్షునిపైవున్న చిత్తమది వొక్కటే చాలు॥చ3॥యిందరివాదము లెట్ల గెలిచినాకందే గాకిఁక గరిమేదిఇందరినేలిన యీ వేంకటపతిపొందగు మహిమల పొడవే చాలు రాగము: సామంతం రేకు: 0016-04 సంపుటము: 1-98 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎవ్వరెవ్వరివాడో యీ జీవుఁడు చూడ- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎవ్వరెవ్వరివాడో యీ జీవుఁడు చూడ-నెవ్వరికి నేమౌనో యీ జీవుఁడు॥చ1॥ఎందరికిఁ గొడుకుగాఁ డీజీవుఁడు వెనకకెందరికిఁ దోఁబుట్టఁ డీజీవుఁడుయెందరిని భ్రమయించఁ డీజీవుఁడు దుఃఖ-మెందరికిఁ గావింపఁ డీజీవుఁడు॥చ2॥యెక్కడెక్కడఁ దిరుగఁ డీజీవుఁడు వెనక-కెక్కడో తనజన్మ మీ జీవుఁడుయెక్కడి చుట్టము దనకు నీ జీవుఁడు యొప్పు-డెక్కడికి నేఁగునో యీ జీవుఁడు॥చ3॥ఎన్నఁడును జేటులేనీ జీవుఁడు వెనక-కెన్నిదనువులు మోవఁడీ జీవుఁడుయెన్నఁగల తిరువేంకటేశుమాయలఁ దగిలియెన్నిపదవులఁబొందఁ డీజీవుడు రాగము: నాట రేకు: 0016-03 సంపుటము: 1-97 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చూడరెవ్వరు దీనిసోద్యంబు పరికించి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥చూడరెవ్వరు దీనిసోద్యంబు పరికించిచూడఁజూడఁగఁ గాని సుఖమెఱఁగరాదు॥చ1॥ఎడతెగని మమత వేయఁగరాని పెనుమోపుకడలేని యాస చీఁకటి దవ్వుకొనుటనిడివైన కనుచూపు నీడనుండిన యెండవడిచెడని తమకంబు వట్టితాపంబు॥చ2॥బుద్ధిమానిన చింత పోనియూరికిఁ దెరువుపొద్దువోవని వలపు పొట్టపొంకంబుయెద్దుఁ బట్టిన సివం బెఱుకమాలిన ప్రియములొద్దిక విహారంబు లుబ్బుఁగవణంబు॥చ3॥తీపులోపలి తీపు తిరువేంకటేశ్వరుని-చూపు దనుఁ బొడగనని చూపు లోచూపు ,ఆపదలువాయు నెయ్యపుఁ దలఁపులీతలఁపురూపైన రుచిలోని రుచి వివేకంబు రాగము: బౌళి రేకు: 0016-02 సంపుటము: 1-96 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనె – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనెవేదువిడిచిన కూడు వెదకినను లేదు॥చ1॥ఏకాంతసౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకుపైకొన్నదుఃఖముల పాలుపడెఁ గాకయేకమగు పుణ్యంబు లేడాఁగల విందరికికైకొన్నదురితములు కలపాటిగాక॥చ2॥హితవైనమమకార మెందుఁగల దిందరికిప్రతిలేని విరహతాపము కొలఁదిగాకమతిలోని వేడుకలు మరియేమి మనుజులకుజితమైన దైవమిచ్చిన పాటిగాక॥చ3॥యిరవైవ దైవకృపయేల దొరుకునుఁ దమకుపరిమైనకర్మంబు పరిపాటిగాకయెరవైనపెనుబంధ మేల వీడెడు నాత్మఁదిరువేంకటేశుకృప తిరమైనఁ గాఁక రాగము: శ్రీరాగం రేకు: 0016-01 సంపుటము: 1-95 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తాప లేక మేడ లెక్కఁదలఁచేము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥తాప లేక మేడ లెక్కఁదలఁచేముయేపులేని చిత్తముతో యీహీహీ నేము॥చ1॥ఎఱుకమాలినబుద్ధి యెవ్వరైనాఁ బతులంటాతెఱఁగెఱఁగక వీధిఁ దిరిగేముపఱచైన జవరాలు పరులెల్లా మగలంటావొఱపు నిలిపిన ట్లోహోహో నేము॥చ2॥యిందరును హితులంటా యెందైనా సుఖమంటాపొందలేనిబాధఁ బొరలేముమందమతిఁవాడు యెండమావులు చెరువులంటాఅందునిందుఁ దిరిగిన ట్లాహాహా నేము॥చ3॥మేటివేంకటేశుఁ బాసి మీఁదమీఁద జవులంటానాటకపు తెరువుల నడిచేముగూటిలో దవ్వులవాఁడు కొండలెల్ల నునుపంటాయేటవెట్టి యేఁగిన ట్లీహీహీ నేము రాగము: లలిత రేకు: 0015-06 సంపుటము: 1-94 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఈ సురలీ మునులీ చరాచరములు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఈ సురలీ మునులీ చరాచరములుయీ సకలమంతయు నిది యెవ్వరు॥చ1॥ఎన్నిక నామము లిటు నీవైయుండఁగయిన్నినామముల వారిది యెవ్వరువున్నచోటనే నీవు వుండుచుండఁగ మరియిన్నిటాఁ దిరుగు వారిది యెవ్వరు॥చ2॥వొక్కరూపై నీవు వుండుచుండఁగ మరితక్కిన యీరూపములు తా మెవ్వరుయిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండమక్కువ నుండువారు మరి యెవ్వరు॥చ3॥శ్రీవేంకటాద్రిపై చెలఁగి నీవుండఁగాదైవంబులనువారు తా మెవ్వరుకావలిసినచోట కలిగి నీ వుండఁగయీవిశ్వపరిపూర్ణు లిది యెవ్వరు రాగము: నాదరామక్రియ రేకు: 0015-05 సంపుటము: 1-93 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇటు గరుడని నీవెక్కినను – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇటు గరుడని నీవెక్కిననుపటపట దిక్కులు బగ్గనఁ బగిలె॥చ1॥ఎగసిన గరుడని యేపున ’ధా’ యనిజిగిదొలఁక చబుకు చేసిననునిగమాంతంబులు నిగమ సంఘములుగగనము జగములు గడగడ వడఁకె॥చ2॥బిరుసుగ గరుడని పేరెము దోలుచుబెరసి నీవు కోపించిననుసరుస నఖిలములు జర్జరితములైతిరుపున నలుగడ దిరదిరఁ దిరిగె॥చ3॥పల్లించిన నీ పసిఁడి గరుడనినికెల్లున నీ వెక్కినయపుడుఝల్లనె రాక్షస సమితి నీ మహిమవెల్లి మునుఁగుదురు వేంకటరమణా రాగము: నాట రేకు: 0015-04 సంపుటము: 1-92 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నాఁటికి నాఁడే నా చదువు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నాఁటికి నాఁడే నా చదువుమాటలాడుచును మఱచేటి చదువు॥చ1॥ఎనయ నీతని నెఱుఁగుటకే పోవెనకవారు చదివినచదువుమనసున నీతని మఱచుటకే పోపనివడి యిప్పటిప్రౌఢలచదువు॥చ2॥తెలిసి యితనినే తెలియుటకే పోతొలుతఁ గృతయుగాదులచదువుకలిగినయీతనిఁ గాదననే పోకలియుగంబులోఁ గలిగినచదువు॥చ3॥పరమని వేంకటపతిఁ గనుటకే పోదొరలగు బ్రహ్మాదులచదువుసిరుల నితని మఱచెడికొరకే పోవిరసపుజీవులవిద్యలచదువు రాగము: సామంతం రేకు: 0015-03 సంపుటము: 1-91 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతంపూర్తి వివరాలు ...

error: