Tags :అన్నమయ్య పాటలు

సంకీర్తనలు

పరమపాతకుఁడ భవబంధుఁడ శ్రీ – – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పరమపాతకుఁడ భవబంధుఁడ శ్రీ –హరి నినుఁ దలఁచ నే నరుహుఁడనా॥చ1॥అపవిత్రుఁడ నే నమంగళుఁడఁ గడు-నపగతణ్యుఁడ నలసుఁడనుకపటకలుషపరికరహృదయుఁడ నే-నపవర్గమునకు నరుహుఁడనా॥చ2॥అతిదుష్టుఁడ నే నధికదూషితుఁడహతవివేకమతి నదయుఁడనుపతిలేని రమాపతి మిముఁదలఁచలేనతులగతికి నే నరుహుఁడనా॥చ3॥అనుపమవిషయపరాధీనుఁడ నే-ననంతమోహభయాతురుఁడవినుతింపఁగ దిరువేంకటేశ ఘను-లనఘులుగాక నే నరుహుఁడనా రాగము: సామంతం రేకు: 0005-04 సంపుటము: 1-33 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎంతటివారలు నెవ్వరును హరిఁ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎంతటివారలు నెవ్వరును హరిఁజింతిచక నిశ్చింతులు గారు॥చ1॥అతిజితేంద్రియులు ననశనవ్రతులు-నతుల తపోధనులగువారుచతురానన గురుస్మరణము దొరకకతతి నూరక పుణ్యతములుగారు॥చ2॥అనఘులు శాంతులు నధ్యాత్మతతులు-ననుపమ పుణ్యులు యాజకులువనజోదరు ననవరతముఁ దలఁచకవినుతి స్మృతికిని విభుదులుగారు॥చ3॥దురిత విదూరులు దుర్మతిహీనులునిరతానందులు నిత్యులునుతిరువేంకటగిరిదేవుని గొలువకపరమార్గమునకు బ్రహ్మలు గారు రాగము: గుండక్రియ రేకు: 0005-03 సంపుటము: 1-32 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎన్ని లేవు నా కిటువంటివి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎన్ని లేవు నా కిటువంటివికన్నులెదుట నిన్నుఁ గనుగొనలేనైతి॥చ1॥అరయ నేఁజేసిన యపరాధములు చూచికరుణించి వొకడైనాఁ గాచునాకరచరణాదులు కలిగించిననిన్నుఁబరికించి నీసేవాపరుఁడ గాలేనైతి॥చ2॥యేతరినై నేనెఱిఁగి సేసినయట్టి-పాతక మొకఁడైనా బాపునాఆతుమలోనుండి యలరి నీవొసఁగిన-చేతనమున నిన్నుఁ జెలఁగి చేరనైతి॥చ3॥శ్రీవేంకటేశ నేఁ జేసిన యితరుల-సేవ కొకఁడు దయసేయునానీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడనీవాఁడ ననుబుద్ధి నిలుపనేరనైతి రాగము: గౌళ రేకు: 0005-03 సంపుటము: 1-31 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆలాగుపొందులును నటువంటికూటములు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఆలాగుపొందులును నటువంటికూటములుయీలాగులౌట నేఁడిదె చూడనయితి॥చ1॥అడియాసచూపులకు నాసగించితిఁగానివెడమాయలని లోను వెదకలేనైతికడువేడుకలఁ దగిలి గాసిఁ బొందితిఁగానియెడలేనిపరితాప మెఱఁగలేనైతి॥చ2॥చిరునగవుమాటలకుఁ జిత్తగించితిఁగానితరితీపులని లోనుఁ దలఁపలేనైతివరుస మోహపుఁ బసలవలలఁ జిక్కితిఁగానిగరువంపుఁ బొలయలుక గానలేనైతి॥చ3॥శ్రీవేంకటేశ్వరునిఁ జింత సేసితిఁగానిదేవోత్తమునిలాగుఁ దెలియలేనైతియీవైభవముపై నిచ్చగించితిఁగానియీవైభవానంద మిది పొందనైతి రాగము: ఆహిరి రేకు: 0005-02 సంపుటము: 1-30 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పెంచఁబెంచ మీఁదఁ బెరిగేటిచెలిమి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పెంచఁబెంచ మీఁదఁ బెరిగేటిచెలిమిఇంచుకంత తాలిముల కెడలేనిచెలిమి॥చ1॥అంటుముట్టులేక మనసులంటుకొన్న చెలిమికంటఁగంట నవ్వించేఘనమైనచెలిమివెంటవెంటఁ దిరిగాడు వెఱ్ఱిగొన్న చెలిమియింటివారిచిత్తములకు నెడరైనచెలిమి॥చ2॥చెక్కుచెమట పెక్కు వలనే చిక్కనై నచెలిమియెక్కడౌటా తమ్ముఁదమ్ము నెఱఁగనీనిచెలిమిచక్కఁదనమే చిక్క మేనుచిక్కినట్టిచెలిమిలెక్కలేని యాసలెల్ల లేఁతలయినచెలిమి॥చ3॥అంకురించినట్టితలఁపు లధికమయినచెలిమిలంకెలయినయాసలెల్లా లావుకొన్న చెలిమివేంకటాద్రివిభునిఁ గూడి వేడుకయినచెలిమిపంకజాననలకెల్లఁ బాయరానిచెలిమి రాగము: ఆహిరి రేకు: 0005-01 సంపుటము: 1-29 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పాపపుణ్యములరూపము దేహ మిది దీని- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పాపపుణ్యములరూపము దేహ మిది దీని-దీపనం బణఁగింపఁ దెరు వెందు లేదు॥చ1॥అతిశయంబైన దేహభిమానము దీరగతిఁగాని పుణ్యసంగతిఁ బొందరాదుమతిలోనిదేహభిమానంబు విడుచుటకురతి పరాజ్ముఖుఁడు గాక రపణంబు లేదు॥చ2॥సరిలేనిమమకారజలధి దాఁటిఁనఁగానిఅరుదైన నిజసౌఖ్య మది వొందరాదుతిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁగానిపరగుబ్రహ్మనందపరుఁడుఁ దాఁగాఁడు రాగము: పాడి రేకు: 0004-08 సంపుటము: 1-28 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నిన్నుఁ దలఁచి నీపేరు దలఁచి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నిన్నుఁ దలఁచి నీపేరు దలఁచినన్నుఁ కరుణించితే నెన్నికగాక॥చ1॥అధికునిఁ గాచు టేమరుదు నన్ను-నధమునిఁ గాచుట యరుదుగాక నీకుమదురమౌ టేమరుదు మధురమూ, చేఁదుమధురమౌటే మహిలో నరుదుగాక॥చ2॥అనఘునిఁ గరుణింప నరుదుగాదు నీకుఘనపాపుని నన్నుఁ గాచు టరుదుగాకకనకము గనకము గానేల, యినుముకనకమవుటే కడు నరుదుగాక॥చ3॥నెలకొన్నభీతితో నిన్నుఁ జెనకితిఁగాకతలకొన్నసుఖినైనఁ దలఁచనేల నిన్నుయెలమితోఁ దిరువేంగళేఁశుడ నాపాలఁగలిగి నీకృప గలుగఁ జేతువుగాక రాగము: దేసాక్షి రేకు: 0004-07 సంపుటము: 1-27 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అనుమానపుబ్రదు కది రోఁతా తన – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అనుమానపుబ్రదు కది రోఁతా తనమనసెనయనికూటమి మరి రోఁతా॥చ1॥అపకీర్తులఁబడి ఆడికెలోనైఅపవాదియౌట అదిరోఁతవుపమ గెలిచేనని వొరుఁ జెరుచుటలువిపరీతపుగుణవిధ మొకరోఁతా॥చ2॥తనగుట్టెల్లా నెరిఁగినవారలముందటతనయెమ్మెలు చెప్పుకొనుట రోఁతవనితలముందట వదరుచు వదరుచుకనుఁగవ గాననిగర్వము రోఁత॥చ3॥భువి హరి గతియని బుద్ధిఁదలంచని-యవమానపుమన నది రోఁతభవసంహరుఁడై పరగువేంకటపతి-నవిరళముగఁ గొలువని దది రోఁత రాగము: ముఖారి రేకు: 0004-06 సంపుటము: 1-26 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నిత్యానంద ధరణీధర ధరారమణ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నిత్యానంద ధరణీధర ధరారమణకాత్యాయనీ స్తోత్రకామ కమలాక్ష॥చ1॥అరవిందనాభ జగధాధార భవదూరపురుషోత్తమ నమో భువనేశాకరుణాసమగ్ర రాక్షసలోకసంహార-కరణ కమలాదీశ కరిరాజవరద॥చ2॥భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానందసాగరనిజావాస సకలాధిపనాగారిగమన నానావర్ణనిజదేహభాగీరథీజనక పరమ పరమాత్మ॥చ3॥పావన పరాత్పర శుభప్రద పరాతీతకైవల్యకాంత శృంగారరమణశ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమోదేవతారాద్య సుస్థిరకృపాభరణ రాగము: శ్రీరాగం రేకు: 0004-05 సంపుటము: 1-25 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగంపూర్తి వివరాలు ...

error: