॥పల్లవి॥తలఁపులోపలి తలఁపు దైవమితఁడుపలుమారుఁ బదియునుఁ బదియైన తలఁపుread॥చ1॥సవతైనచదువులు సరుగఁ దెచ్చిన తలఁపురవళిఁ దరిగుబ్బలివి రంజిల్లు తలఁపుకవగూడఁ గోరి భూకాంతముంగిట తలఁపుతివిరి దూషకు గోళ్ళఁ దెగటార్చు తలఁపు॥చ2॥గొడగువట్టినవానిఁ గోరి యడిగిన తలఁపుతడఁబడక విప్రులకు దానమిడు తలఁపువొడిసి జలనిధినిఁ గడగూర్చితెచ్చినతలఁపుజడియక హలాయుధము జళిపించు తలఁపు॥చ3॥వలపించి పురసతులవ్రతము చెరిచిన తలఁపుకలికితనములు చూపఁగలిగున్న తలఁపుయిల వేంకటాద్రిపై నిరవుకొన్న తలఁపుకలుషహరమై మోక్షగతిచూపు తలఁపు రాగము: వసంతం రేకు: 0068-05 సంపుటము: 1-356 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య పాటలు
॥పల్లవి॥విశ్వప్రకాశునకు వెలిఁయేడ లో నేడశాశ్వతున కూహింప జన్మమిఁక నేడ॥చ1॥సర్వపరిపూర్ణునకు సంచారమిఁక నేడనిర్వాణమూర్తికిని నిలయమిఁక నేడవుర్వీధరునకుఁ గాలూఁదనొక చోటేడపార్వతీ స్తుత్యునకు భావమిఁక నేడ॥చ2॥నానాప్రభావునకు నడుమేడ మొదలేడఆనన సహస్రునకు నవ్వలివ లేడమౌని హృదయస్థునకు మాటేడ పలుకేడజ్ఞాన స్వరూపునకుఁ గాన విననేడ॥చ3॥పరమ యోగీంద్రునకు పరులేడ తా నేడదురితదూరునకు సంస్తుతి నింద లేడతిరువేంకటేశునకు దివ్యవిగ్రహ మేడహరికి నారాయణున కవుఁగాము లేడ రాగము: కన్నడగౌళ రేకు: 0068-04 సంపుటము: 1-355 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎక్కడనున్నా నీతఁడుదిక్కయి మాదెసఁ దిరిగీఁగాక॥చ1॥సరసుఁడు చతురుఁడు జగదేకగురుఁడుపరమాత్మ డఖిల బంధువుఁడుహరి లోకోత్తరుఁ డతఁడే నామతిసిరితోఁ బాయక చెలఁగీఁగాక॥చ2॥ఉన్నతోన్నతుఁ డుజ్జ్వలుఁ డధికుఁడుపన్నగశయనుఁడు భవహరుఁడుయిన్నిటఁగ లిగిన యిందిరారమణుఁడుమన్ననతో మము మనిపీఁగాక॥చ3॥మమతల నలమేల్మంగకు సంతత –రమణుఁడు వేంకటరాయఁడుజమళిసంపదల సరసవిభవములతమకంబున మముఁదనిపీఁగాక రాగము: ముఖారి రేకు: 0068-03 సంపుటము: 1-354 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥అతఁడే సకలవ్యాపకుఁడతఁడే యాతురబంధువుఁ –డతఁడు దలఁపుల ముంగిట నబ్బుట యెన్నఁడొకో॥చ1॥సారేకు సంసారంబను జలనిధు లీఁదుచు నలసిన-వారికి నొకదరిదాపగు వాఁ డిఁక నెవ్వఁడొకోపేరిన యజ్ఞానంబను పెనుఁజీఁకటి తనుఁగప్పినచేరువవెలుఁగై తోఁపెడిచెలి యికఁ నెవ్వఁడొకో॥చ2॥దురితపుకాననములలో త్రోవటు దప్పినవారికితెరు విదె కొమ్మని చూపెడిదేవుఁడి దెవ్వఁడొకోపెరిగిన యాశాపాశము పెడగేలుగఁ దనుఁగట్టినవెరవకుమని విడిపించేటి విభుఁడిఁక నెవ్వఁడొకో॥చ3॥తగిలిన యాపదలనియెడి దావానలముల చుట్టినబెగడకుమని వడినార్పెడి బిరుదిఁక నెవ్వఁడొకోతెగువయుఁ దెంపును గలిగిన తిరువేంకట విభుఁడొక్కఁడేసొగిసి తలంచినవారికి సురతరువగువాఁడు రాగము: సామంతం రేకు: 0068-02 సంపుటము: 1-353 Tags: Annamacharya Keerthanalu, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కాయము జీవుఁడుగలనాఁడే తెలియవలెయీయత్నములు దనకెన్నఁడు॥చ1॥సతతము సంసారజడుఁడు దానట యాత్మ-హితవు దెలుసుకాల మెన్నఁడురతిసరసముల పూరకే ప్రాయ మెడలంగయితరసుఖము దన కెన్నఁడు॥చ2॥యెడపక ద్రవ్యమెహితుఁడై తిరుగఁ దన.-యిడుమపాటు మాను టెన్నఁడుకడలేనిపొలయలుకలచేతఁ దనదేహ-మిడియఁగ నిజసుఖ మెన్నఁడు॥చ3॥శ్రీవేంకటేశునిఁ జేరి తక్కినసుఖ-మేవగించుకాల మెన్నఁడుశ్రీవల్లభునికృప సిరిగాఁ దలఁచి జీవుఁ –డీవైభవముఁ గాంచు టెన్నఁడు రాగము: నాట రేకు: 0068-01 సంపుటము: 1-352 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥అందరి కాధారమైనఆదిపురుషుఁ డీతఁడువిందై మున్నారగించె విదురునికడ నీతఁడు॥చ1॥సనకాదులు గొనియాడెడి సర్వాత్మకుఁ డీతఁడువనజ భవాదులకును దైవంబైనతఁ డీతఁడుయినమండలమునఁ జెలఁగేటిహితవైభవుఁ డీతఁడుమునువుట్టిన దేవతలకు మూలభూతి యీతఁడు॥చ2॥సిరులొసఁగి యశోదయింట శిశువైనతఁ డీతఁడుధరనావులమందలలో తగఁ జరించె నీతఁడుసరసతలను గొల్లెతలకుఁ జనవులొసఁగె నీతఁడుఆరసి కుచేలునియడుకు లారగించె నీతఁడు॥చ3॥పంకజభవునకును బ్రహ్మపద మొసఁగెను యీతఁడుసంకీర్తన లాద్యులచే జట్టిగొనియె నీతఁడుతెంకిగ నేకాలముఁ బరదేవుఁడయిన యీతఁడువేంకటగిరిమీఁద బ్రభల వెలసినఘనుఁ డీతఁడు రాగము: సామంతం రేకు: 0067-06 సంపుటము: 1-351 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కటకటా జీవుఁడా కాలముదోలుకరాఁగసటవటలనే పొద్దు జరుపే వుగాread॥చ1॥సమత నన్నియును జదివి కడపటనుకుమతివై అందరిఁ గొలిచే వుగాతమిగొని ప్రేమ నెంతయును గంగకుఁబోయితమకింది నూతినీరు దాగే వుగా॥చ2॥తనువుఁ బ్రాయము నమ్మి దానధర్మము మానిచెనటివై కర్మాలు సేసే వుగావొనరఁగ మీఁదనొడ్డిన మొగులు నమ్మిదొనలనీళ్ళు వెళ్ళఁదోసే వుగా॥చ3॥యెలమితోఁ దిరువేంకటేశుఁ గొలువలేకపొలము రాజులవెంటఁ బొయ్యే వుగాచిలుకకువలె బుద్ధిచెప్పనఁ గానలేకపలుమారుకే తోజుఁ బాడే వుగా రాగము: పాడి రేకు: 0067-05 సంపుటము: 1-350 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥సకలసంగ్రహము సకలసంచయముఅకృతకృత మిది హరినామం॥చ1॥సకలవేదశాస్త్రములసార మిదిసకలమంత్రరాజంబు నిదిసకల పురాణరసముల మధుర మిదిఆకుటిలపావనం హరినామం॥చ2॥సకలతత్వసంశయఖండన మిదిసకలకర్మనిశ్చయము నిదిసకలవిధిరహస్యప్రధాన మిదిఅకారణహితం హరినామం॥చ3॥సకలదేవతాస్వామిప్రియం బిదిసకలలోకరక్షణము నిదిప్రకటం వేంకటపతి నామాంకిత-మకించనధనం హరినామం రాగము: లలిత రేకు: 0067-04 సంపుటము: 1-349 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలితపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏఁటి బ్రదుకు యేఁటి బ్రదుకు వొక్కమాటలోనే యటమటమైన బ్రదుకు॥చ1॥సంతకూటములే చవులయిన బ్రతుకుదొంతిభయములతోడి బ్రదుకుముంతనీళ్ళనే మునిఁగేటి బ్రదుకువంతఁ బొరలి కడవరంలేని బ్రదుకు॥చ2॥మనసుచంచలమే మనువయిన బ్రదుకుదినదినగండాలఁ దీరు బ్రదుకుతనియ కాసలనె తగిలేటి బ్రదుకువెనకముందర చూడ వెరపయిన బ్రదుకు॥చ3॥తెగి చేఁదె తీపయి తినియేటి బ్రదుకుపగవారిపంచలపాలైన బ్రదుకుతగువేంకటేశ్వరుఁ దలఁచని బ్రదుకుపొగకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు రాగము: శ్రీరాగం రేకు: 0067-03 సంపుటము: 1-348 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...