మైదుకూరు పట్టణంలోని పోరుమామిళ్ళ రోడ్డులో కె.సి.కెనాల్ పక్కగా వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి (సదానందమఠం) మైదుకూరు చరిత్రలో విశిష్టమైన స్థానం ఉంది. “పిచ్చమాంబ మఠం” “పిచ్చమ్మ మఠం” పేర్లతో ఈ ఆశ్రమం పిలువబడుతోంది. మైదుకూరు మండలం వనిపెంటలోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించిన పెద్దయార్యులు మొదటగా సదానందశ్రమాన్ని స్థాపించి ప్రజల్లో తాత్విక చింతన, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడానికి శ్రీకారం చుట్టారు. తండ్రి పెద్దయార్యుల భోధనలతో పిచ్చమాంబ ప్రభావితురాలైయ్యారు . ఆశ్రమం మరింతగా అభివృద్దిచెందడానికి విశేష కృషి చేశారు. […]పూర్తి వివరాలు ...
Tags :వనిపెంట
మైదుకూరు: మండలంలోని మిట్టమానుపల్లెకు చెందిన రైతు మూలే రామసుబ్బారెడ్డి తన పంటపొలాలను అడవి జంతువుల నుంచి రక్షించుకొనే నేపధ్యంలో తన తోటకు విద్యుత్ వైర్లతో కంచె వేశాడని, రాత్రివేళ చిరుత వచ్చి విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందిందని, చిరుత మృతిచెందడంతో రైతు రామసుబ్బారెడ్డి శక్రవారం స్టార్టర్ ఆయిల్ చిరుతపై పోసి నిప్పుపెట్టి ఆనవాలు లేకుండా కాల్చివేయాలనే ప్రయత్నం చేశాడని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో దర్యాప్తు చేసి శనివారం నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు […]పూర్తి వివరాలు ...
విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి. సాహితీ సమరాంగణ చక్రవర్తిగా చరిత్రకెక్కిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ప్రస్తుత కడప ప్రాంతం రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రధాన భూమికను పోషించింది. కడప ప్రాంతంలో లభించిన […]పూర్తి వివరాలు ...
భైరేని లేదా భైరవకోన కడప జిల్లాలోని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రము. మైదుకూరు పట్టణానికి ౩౦ కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతం లో వెలసిన భైరవకోన లేదా భైరేని భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఏట శివరాత్రి సందర్భంగా భైరవకోన తిరుణాల వైభవోపేతంగా జరుగుతుంది. ఈ భైరవకోన చరిత్ర ఇలా ఉంది . పూర్వం అహోబిలం సమీపంలో నల్లమలలో ప్రవహించే భవనాశి నది జలప్రళయానికి సూచనగా ఉప్పొంగడం మొదలయ్యింది. దీనితో అహోబిల నరసింహ స్వామి ఈ […]పూర్తి వివరాలు ...
రాయించినది: కుల్కరిణీ శంకరప్ప నల్లమల పర్వతమందు ఉన్న అహోబిల నారసింహ క్షేత్రానికి దక్షిణ భాగమున యోజన ద్వయ స్థలమున పూర్వము వాల్మీకి తపస్సు చేస్తూ ఉండేవాడు. అందువలన ఈ స్థలమును వాల్మీకి పురం అని ప్రజలు చెప్పుకుంటున్నారు… ఇటు తరువాత చోళ మహారాజు రాజ్యం చేసేటప్పుడు (కలియుగమందు కొంత కాలం జరిగిన తరువాత) నర్ర గొల్లలు అనే వాళ్ళు ఈ స్థలములో నర్రవుల మందలు ఆపు చేసుకుని ఉండేవారు. అప్పుడు వాళ్ళు ఉండేటందుకు () గాను కొట్టాలు […]పూర్తి వివరాలు ...