Tags :రాయచోటి

    పర్యాటకం

    దేవుని కడప

    ‘దేవుని కడప’లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం కడప జిల్లాలోని ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. కడప నగరంలోని ఉన్న ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకోవటానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. నిర్మాణ శైలి : విజయనగర ప్రత్యేకతలు : ఏటా ఉగాది పర్వదినాన దేవుని కడప ఆలయాన్ని ముస్లింలు దర్శించుకుని స్వామి వారికి భత్యం సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం ఈ గుడిలో అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. సమీపంలోని దేవుని కడప చెరువులో పడవ విహారం […]పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు వార్తలు

    ఈ రోజు నుంచి అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ జాతర

    అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ ఆలయం రాయలసీమలోనే ప్రసిద్ధి – శనివారం నుంచి అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనార్థం రానున్నారు. మూడు రోజులు జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తిరుణాల్ల నేపధ్యం … అనంతపురం గ్రామానికి చెందిన తిమ్మిరెడ్డి ఉత్తారెడ్డి పొలం గట్టుకు కావాల్సిన కంప కొట్టి తొడుగేశారు. తీసుకెళ్లేందుకు కాడెద్దులతో కదిలించగా కదలలేదు. ఆ రాత్రి అమ్మవారు స్వప్నంలోకి వచ్చి […]పూర్తి వివరాలు ...

    పర్యాటకం

    400 ఏండ్ల రాయచోటి పత్తర్‌ మసీదు

    రాయచోటి నడిబొడ్డున ఠాణా సెంటర్‌లో ఉన్న అతి ప్రాచీనమైన మసీదు ‘షాహీ జామియా’ మసీదు (పత్తర్‌ మసీదు). దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ మసీదు స్థలాన్ని అప్పటి భూస్వామి ఇనాయత్‌ ఖాన్‌ దానం చేశారట. అప్పట్లో గ్రామ పెద్దల సహకారంతో ఆర్థిక వనరులు సమకూర్చకుని మసీదు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మసీదు నిర్మాణమంతా రాతితో జరిగింది. అందుకే దీనిని పత్తర్‌ మసీద్‌ అని పిలుస్తారు. మసీదు అంటే ప్రార్థనా మందిరం. దీనికి మరొక పేరు […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    నింపడమే నా జీవిత ధ్యేయం…

    రాయచోటి – లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలను సస్యశ్యామలం చేయగలిగే వెలిగల్లు, శ్రీనివాసపురం రిజర్వాయర్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయించి, హంద్రీ-నీవా జలాల తో నింపడమే తన జీవిత ధ్యేయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. హంద్రీ – నీవా జలాలను తరలించడం ద్వారానే దుర్భిక్ష ప్రాంతమైన రాయచోటి నియోజక వర్గంలో శాశ్వతంగా కరవును నివారించవచ్చని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ దశాబ్దాలుగా ఈ […]పూర్తి వివరాలు ...

    ఆలయాలు పర్యాటకం

    రాయచోటి వీరభద్రాలయం

    రాయలకాలంలో రాయచోటి పక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం వెలసింది. వీరభద్రస్వామికి రాచరాయుడు అనే పేరుకూడ ఉంది. ఇక్కడ మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరిగిన తరు వాత మధ్యలో ఉన్న ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం ప్రత్యేక విశేషం. ఆనవాయితీ మరో విశేషం ఏమంటే ముస్లింలలోని దేశముఖితేకు చెందిన వారు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి పూజా సామాగ్రి పంపుతారు. ఆ పూజా సామగ్రితో పూజలు నిర్వహించి […]పూర్తి వివరాలు ...