ఒంటిమిట్ట: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని పోతన సాహిత్యపీఠం మరియు తితిదే ధర్మప్రచారమండలి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండరామాలయంలో గురువారం జరిగిన భాగవత పద్యార్చనకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య శ్యాంసుందర్ పోటీలను ప్రారంభింపద్యార్చనకు హాజరైన విద్యార్థులను చూసి వారు ఆశ్యర్యచకితులయ్యారు. వీరు తెలుగుభాషా గతవైభవాన్ని గుర్తుకు తెస్తున్నారని వైవీయూ ఉపకులపతి శ్యాంసుందర్ అన్నారు. తెలుగుభాషకు సేవ చేస్తున్న […]పూర్తి వివరాలు ...
Tags :రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
ప్రముఖ సాహితీ విమర్శకులు, సాహితీవేత్త ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఈ ఏడాది కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన “మన నవలలు, మన కథలు” అనే విమర్శనా గ్రంథానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రకటించింది. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ప్రస్తుతం కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనాకేంద్రం భాద్యులుగా వ్యవహరిస్తూ ఇక్కడి యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో గౌరవ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని కుంట్రపాకం(తిరుపతి సమీప గ్రామం)లో జన్మించిన […]పూర్తి వివరాలు ...
డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (20.10.1925-28.02.2014) ఇవాళ ఒక లెజెండ్ మాత్రమే కాదు సెలబ్రిటీ కూడా. ఈ రెండు నిర్వచనాలకు ఆయన తగిన వారనడంలో కొంచెమైనా అతిశయోక్తి లేదు. వేమనను సీపీ బ్రౌన్ వెలుగులోకి తెస్తే, సీపీ బ్రౌన్‌ను జానమద్ది వెలుగులోకి తెచ్చారు. కడపలోని తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా వచ్చిన బ్రౌన్ తెలుగు సాహిత్యానికి సేవ చేసి తెలుగు సూర్యుడిగా ప్రసిద్ధుడైతే బ్రౌన్‌ను వెలుగులోకి తెచ్చిన జానమద్ది సాహితీ సూర్యుడిగా ప్రసిద్ధి చెందాడు. సీపీ బ్రౌన్ జీవితం, […]పూర్తి వివరాలు ...