శాసనము : వండాడి శాసనము ప్రదేశం : వండాడి, రాయచోటి తాలూకా శాసనకాలం: ఎనిమిదవ శతాబ్దం రేనాటి చోళుల తరువాత ఎనిమిదవ శతాబ్ది తుదియందు కడప మండలము బాణ రాజులకును,వైదుంబ రాజులకును వశమయ్యెను. వైదుంబులు మొదట చిత్తూరు మండలములో నుండెడివారు. వారికి వైదుమ్బవ్రోలు అను నగరము రాజధాని. తర్వాత రేనాటి చోళులను నిర్జించి చిర్పులి నాక్రమించుకొనిరి.కొంతకాలమునకు పొత్తపి (రాజం పేట తాలూక), కలకడ (వాయల్పాడు తాలూక) నగరములు కూడ వీరికి రాజధానులయినట్లు శాసనము లందు కలదు.రేనాటి చోళులవలె […]పూర్తి వివరాలు ...
Tags :పొత్తపి
నన్నెచోడుడు కడప జిల్లాలో తూర్పు ప్రాంతాలను పొత్తపి రాజధానిగా పాలించిన అర్వాచీన చోళవంశికుడైన మహారాజు. ప్రాచీన చోళులలో ప్రసిద్ధుడైన కరికాలచోళుని వంశం తనదని చెప్పుకున్నాడు. నన్నెచోడుని తండ్రి చోడబల్లి, తల్లి శ్రీసతి. వీరి రాజ్యం కడప జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉండేది. ఈ రాజులు నందలూరు సౌమ్యనాథుని సేవించినారు. ఈ నన్నెచోడుడు ‘కుమార సంభవము’ అనే ఉత్కృష్ణ కావ్యాన్ని రచించిన కవిరాజశిఖామణి సూర్యవంశరాజు గనుక ఇతనికి టెంకాణాదిత్యుడు అని […]పూర్తి వివరాలు ...
రేనాటి చోళుల పాలన – ఇతర విశేషములు రేనాటి చోళులు మొదట పల్లవుల తరువాత బాదామి చాళుక్యుల సామంతులుగా ఉన్నట్లు తెలుస్తుంది. అయినప్పటికి పల్లవ మహేంద్రవర్మ కాలమునందు పుణ్య కుమారుడు స్వతంత్ర ప్రతిప్రత్తితో రేనాటి రాజ్యమును పాలించినట్లు అతడు వేయించిన తామ్ర శాసనములు, రామేశ్వరం శిలాశాసనం సూచిస్తున్నవి. రేనాటి చోళరాజులు తమను ప్రాచీన చోళరాజు కరికాలునికి చెందినవారుగా చెప్పుకొనుటవలన, కొందరి రాజుల పేర్లు చోళ మహారాజులని ఉండుట చేతను, వీరు కావేరి తీరమున గల ఆది చోళ […]పూర్తి వివరాలు ...
తెలుగు భాష చరిత్రలో, ఆంధ్రదేశ చరిత్ర నందు కడప జిల్లాను పాలించిన రేనాటి చోళ రాజులకు ఒక విశిష్ట స్థానముంది. కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తాలుకాలు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, వాయల్పాడు తాలుకాలు ప్రాచీన ఆంధ్ర దేశమునందు రేనాడుగా పిలువబడి, ఈ రాజుల కాలంలో తెలుగు భాష శాసన భాషగా మొదటిసారిగా ఉపయోగించబడింది. అదే విధంగా రేనాటి చోళులు పాలనాపరంగా, సంస్కృతిపరముగా ప్రవేశపెట్టిన విధానాలు తరువాతి ఆంధ్రదేశ రాజులకు మార్గదర్శకంగా నిలిచాయి. ఆదికవి […]పూర్తి వివరాలు ...
భక్త కన్నప్ప కడప (వైఎస్సార్) జిల్లా వాడే. కైఫీయతుల్లో ఇందుకు స్పష్టమైన ఆధారం ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో కన్నప్ప కర్నాటకవాడనీ, తమిళుడని, ఆ ప్రాంతాల వారు చేసిన వాదనలో నిజం లేదని స్పష్టమైంది. కన్నప్ప వైఎస్సార్ జిల్లావాడేననడానికి రుజువుగా ఆయన ప్రతిష్టించిన శివలింగం రాజంపేట మండలం ఊటుకూరులో నేటికీ ఉందని పండిత పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.పూర్తి వివరాలు ...