Tags :తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు

సంకీర్తనలు

ఇందరికి నభయంబు లిచ్చుఁ జేయి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇందరికి నభయంబు లిచ్చుఁ జేయికందువగు మంచి బంగారు చేయి॥చ1॥వెలలేనివేదములు వెదకితెచ్చిన చేయిచిలుకుగుబ్బలికిందఁ జేర్చు చేయికలికియగు భూకాంతఁ గాఁగిలించిన చేయివలనైన కొనగోళ్ళవాఁడి చేయి॥చ2॥తనివోక బలిచేత దానమడిగిన చేయివొనరంగ భూదానమొసఁగు చేయిమొనసి జలనిధి యమ్ము మొనకుఁ దెచ్చిన చేయియెనయ నాఁగేలు ధరింయిచు చేయి॥చ3॥పురసతుల మానములు పొల్లసేసిన చేయితురగంబుఁ బరపెడిదొడ్డ చేయితిరువేంకటాచలధీశుఁడై మోక్షంబుతెరువు ప్రాణులకెల్లఁదెలిపెడి చేయి రాగము: సామంతం రేకు: 0065-01 సంపుటము: 1-334 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చిరంతనుఁడు శ్రీవరుఁడు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥చిరంతనుఁడు శ్రీవరుఁడుపరమం భవ్యం పావనం॥చ1॥వేదమయుఁడు కోవిదుఁడమలుఁడు పరుఁ-డాది పురుషుఁడు మహామహుఁడుయేదెస నేమని యేది దలఁచిన న-ఖేద మవాద మఖిల సమ్మతం॥చ2॥నిఖిలనిలయుఁడు మునివరదుఁడధికుఁడుమఖముఖ శుకాభిమతరతుఁడుశిఖరం శివం సుశీలన మతిశయ-ముఖరం ముఖ్యం మూలమిదం॥చ3॥అనేకప్రదుఁ డనాది నిధనుఁడుఘనుఁడీ తిరువేంకటవిభుఁడుదినం దినం సముదిత రవికోటి భ-జనం సిద్ధాంజనం ధనం రాగము: ముఖారి రేకు: 0064-06 సంపుటము: 1-333 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సకలసందేహమై జరగుచున్నది యెకటి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥సకలసందేహమై జరగుచున్నది యెకటిప్రకటింప జీవమో బ్రహ్మమో కాని॥చ1॥వసుదేవుజఠరమనువననిధికిఁ జంద్రుఁడైఅసమానగతిఁ బొడమినాఁ డీతఁడువసుధఁ జంద్రుఁడు నీలవర్ణుఁ డేఁటికినాయకసరెత్తి ననుఁగందు గలయఁగొనుఁబోలు॥చ2॥ఇనవంశమున లోకహితకల్పభూజమైఆనఘఁడై జనియించినాఁ డీతఁడుననుపై నసురతరువు నల్లనేఁటికినాయపెనుఁగొమ్మలో చేఁగ పెరిగిరాఁబోలు॥చ3॥తిరువేంకటాద్రిపైఁ దెలియఁ జింతామణైఅరిదివలెఁ బొడచూపినాఁ డీతఁడుగరిమె నది యిపుడు చీఁకటివర్ణమేలాయహరినీలమణులప్రభ లలమికొనఁబోలు రాగము: శ్రీరాగం రేకు: 0064-05 సంపుటము: 1-332 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పొరాక పోయి తలఁపుననున్న దైవంబుఁ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పొరాక పోయి తలఁపుననున్న దైవంబుఁజేరనొల్లక పరులఁజేరఁదిరగెదము॥చ1॥వడిఁబారు పెనుమృగము వలలలోపలఁ దగులువడి వెడల గతిలేక వడఁకుచున్నట్లుచెడనికర్మములలోఁ జిక్కి భవములబాధఁబడియెదముగాక యేపనికిఁ దిరిగెదము॥చ2॥నీరులోపలిమీను నిగిడి యామిషముకైకోరి గాలము మ్రింగి కూలబఁడినట్లుజారిపోయిననేల సంసారసౌఖ్యవి-కారంపుమోహములఁ గట్టువడియెదము॥చ3॥శ్రీవేంకటేశు నాశ్రితలోకరక్షకునిభావింప దేవతాపతియైనవానిసేవించుభావంబు చిత్తమొడఁబడక నే-మీవలావలిపనుల నిట్లఁ దిరిగెదము రాగము: గుండక్రియ రేకు: 0064-04 సంపుటము: 1-331 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తెలిసియు నత్యంతదీనుఁడై తన్నుఁ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥తెలిసియు నత్యంతదీనుఁడై తన్నుఁదెలియఁగఁగోరేటి తెలివే పో తెలివిread॥చ1॥వలచినసతి దన్ను వడిఁ గాలఁదన్నినఅలరి యెట్లా నుబ్బు నటువలెనేతలఁక కెవ్వరు గాలఁదన్నినా మతిలోనఅలుగక ముదమందునదివో తెలివి॥చ2॥అరిది మోహపు వనిత ఆలిపైఁ దిట్టిన…నరవిరై చొక్కినయుటవలెనేపరులు దన్ను వెలుపల నిట్లఁ బలికినఆరలేక రతిఁ జొక్కునదివో తెలివి॥చ3॥తనివోక ప్రియకాంత తమ్ములపురస మాన….ననయమును నటు గోరునటువలెనేతనర వేంకటపతిదాసుల ప్రసాదంబుఆనిశము ను గొనఁగోరునదివో తెలివి రాగము: బౌళి రేకు: 0064-03 సంపుటము: 1-330 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కొంచెమును ఘనముఁ గనుఁగొననేల – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥కొంచెమును ఘనముఁ గనుఁగొననేల హరిఁదలఁచుపంచమహపాతకుఁడే బ్రహ్మణోత్తముఁడు॥చ1॥వేదములుచదివియును విముఖుఁడై హరికథలనాదరించనిసోమయాజికంటెయేదియునులేనికులహీనుఁడైనను విష్ణుపాదసేవకుఁడువో బ్రహ్మణోత్తముఁడు॥చ2॥పరమమగువేదాంతపఠన దొరకియు సదాహరిఁదలఁచలేని సన్న్యాసికంటెమరిగి పసురముఁదినెడిమాలయైనను వాఁడెపరమాత్ముఁ గొలిచినను బ్రహ్మణోత్తముఁడు॥చ3॥వినియుఁ జదివియు రమావిభునిఁ దలఁపక వృథాతనువు వేఁపుచుఁ దిరుగతపసికంటెచనవుగల వేంకటేశ్వరుదాసులకు వెంటఁబనిదిరుగునధముఁడే బ్రహ్మణోత్తముఁడు రాగము: శ్రీరాగం రేకు: 0064-02 సంపుటము: 1-329 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏమి గలదిందు నెంత పెనగినఁ వృధా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఏమి గలదిందు నెంత పెనగినఁ వృధాకాముకపు మనసునకు కడ మొదలు లేదు॥చ1॥వత్తిలోపలి నూనె వంటిది జీవనమువిత్తుమీదటి పొల్లు విధము దేహంబుబత్తిసేయుట యేమి పాసిపోవుట యేమిపొత్తుల సుఖంబులకు పొరలుటలుగాక॥చ2॥ఆకాశ పాకాశ మరుదైన కూటంబులోకరంజకము తమలోనిసమ్మతముచాకిమణుఁగుల జాడ చంచలపు సంపదలుచేకొనిననేమి యివి చెదిరిననునేమి॥చ3॥గాదెఁబోసినకొలుచుకర్మి సంసారంబువేదు విడువనికూడు వెడమాయబదుకువేదనల నెడతెగుట వేంకటేశ్వరు కృపా-మోదంబు వడసినను మోక్షంబు గనుట రాగము: వరాళి రేకు: 0064-01 సంపుటము: 1-328 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

జీవుఁ డెంతటివాఁడు చిత్త మెంతటిది తన – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥జీవుఁ డెంతటివాఁడు చిత్త మెంతటిది తనదైవికము గడవ నెంతటివాఁడు దాను॥చ1॥విడిచిపోవని యాస విజ్ఞానవాసనలఁగడచి మున్నాడె నెక్కడివివేకములువుడుగనియ్యనిమోహ ముబ్బి పరమార్ధములమెడవట్టి నూకె నేమిటికింక నెరుక॥చ2॥పాయనియ్యనిమహాబంధ మధ్యాత్మతోరాయడికిఁ దొడఁగె సైరణలేల కలుగుమాయనియ్యనికోపమహిమ కరుణామతినివాయెత్తనియ్య దెవ్వరికిఁ జెప్పుదము॥చ3॥సరిలేనియాత్మచంచల మంతరాత్మకుని-నెరఁగనియ్యదు దనకు నేఁట్టిపరిణతలుతిరువేంకటాచలాధిపునిమన్ననఁగానివెరసి యిన్నటి గెలువ వెరవు మఱిలేదు రాగము: దేశి రేకు: 0063-06 సంపుటము: 1-327 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేశిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కాకున్న సంసారగతులేల – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥కాకున్న సంసారగతులేలలోకకంటకములగు లోభంబులేల॥చ1॥వినికిగనవలసినను విష్ణుకీర్తన చెవికివినికిచేసిన నదియె వేదాంతబోధమనికిగనవలసినను మధువైరిపై భక్తివునికి ప్రాణులకు బ్రహ్మోపదేశంబు॥చ2॥చదువు గనవలసినను శౌరినామము దిరుగఁజదువుటే సకలశాస్త్రముల సమ్మతమునిదుర గనవలసినను నీరజాక్షునికిఁ దన-హృదయసమర్పణ సేయుటిది యోగనిదుర॥చ3॥ఆస వలసిన వేంకటాధీశ్వరుని‌ కృపకు-నాససేయుటే పరమానందసుఖమువాసి గనవలసినను వైష్ణవాగారంబువాసి సేయుట తనకు వైభవస్ఫురణ రాగము: శ్రీరాగం రేకు: 0063-05 సంపుటము: 1-326 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

error: