॥పల్లవి॥ఇంతే మఱేమిలేదు యిందుమీఁదనుదొంతులకర్మాలు దుమ్ముదూరుపెత్తుట॥చ1॥వుల్లములో నుండి దేహ మొగి రక్షించేహరి-నొల్లకున్న తన్నుఁ దా నొల్లకుండుటబల్లిదుఁ డాతని మాని పరుల వేఁడేదెల్లాపొల్లకట్టు దంచిదంచి పోగు సేసుకొనుట॥చ2॥యెయ్యెడాఁ బుణ్యఫలము లేమి గలిగిన హరి-కియ్యకున్న నది దైవమియ్యకుండుటచెయ్యార నాతని కొప్పు సేయని భోగములెల్లాచయ్యన జెఱకుఁ బిప్పి చవిగొనుట॥చ3॥శ్రీకాంతుడై నట్టి శ్రీవేంకటేశ్వరునిజేకొంటే సిరులెల్లా జేకొనుటమేకుల శ్రీహరినామమే నోర నుడుగటకైకొన్న యమృతపుగందు వగుట రాగము: గుజ్జరి రేకు: 0082-06 సంపుటము: 1-398 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
Tags :తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు
॥పల్లవి॥చీచీ నరుల దేటిజీవనముకాచుక శ్రీహరి నీవే కరుణింతుగాకreadread॥చ1॥అడవిలో మృగజాతియైనఁ గావచ్చుఁగాకవడి నితరులఁ గొలువఁగవచ్చునావుడివోని పక్షియై వుండనై నావచ్చుఁ గాకవిడువ కెవ్వరినైనా వేఁడవచ్చునా॥చ2॥పసురమై వెదలేనిపాటు వడవచ్చుఁ గాకకసివో నొరుల బొగడగావచ్చునావుసురుమానై పుట్టివుండనై నవచ్చుగాకవిసువక వీరివారి వేసరించవచ్చునా॥చ3॥యెమ్మెల బుణ్యాలు సేసి యిల యేలవచ్చుఁగాకకమ్మి హరిదాసుఁడు గావచ్చునానెమ్మది శ్రీవేంకటేశ నీచిత్తమే కాకదొమ్ములకర్మము లివి తోయవచ్చునా రాగము: శంకరాభరణం రేకు: 0082-05 సంపుటము: 1-397 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఓహో ఢేంఢేం వొగి బ్రహ్మమిదియనిసాహసమున శృతి చాటెడిని॥చ1॥పరమును నపరముఁ బ్రకృతియు ననఁగావెరవు దెలియుటే వివేకముపరము దేవుఁడును అపరము జీవుఁడుతిరమైన ప్రకృతియె దేహము॥చ2॥జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమునుపూని తెలియుటే యోగముజ్ఞానము దేహాత్మ జ్ఞేయము పరమాత్మజ్ఞాన గమ్యమే సాధించు మనసు॥చ3॥క్షరము నక్షరమును సాక్షి పురుషుఁడనిసరవిఁ దెలియుటే సాత్వికముక్షరము ప్రపంచ మక్షరము కూటస్థుఁడుసిరి పురుషోత్తముఁడే శ్రీవేంకటేశుఁడు రాగము: రామక్రియ రేకు: 0082-04 సంపుటము: 1-396 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కింకదీర ‘నదైవం కేశవాత్పర’ మనిఉంకువైవనాలో నీవుపమ లివే॥చ1॥కంటి నీవొక్కఁడవే లోకములకు దైవమనివొంటి మఱి నిన్నుఁ బోల నొకరిఁ గానవింటి నీవే ఘనమని వేదాంతమందు నీ-కంటె నితరము విన గరుణానిధీ॥చ2॥తోఁచె నాకు నీసేవే తుదిపదమని మఱితోఁచ దీబుద్ధికి; సరితూఁగ దెందునుపూఁచి నాగురుఁడు నిన్నే బోధించేగాని మఱిదాఁచఁడాయ నీమహిమ ధరణిధరా॥చ3॥సమ్మతించె నామతి జవియైనా కథలెసమ్మతించ దెక్కడో రచ్చల సుద్దులునమ్మిక శ్రీవేంకటేశ నంటున నీపాదాలేనమ్మితి నేమియు నమ్మ నారాయణా రాగము: ధన్నాసి రేకు: 0082-03 సంపుటము: 1-395 Tags: Annamacharya Keerthanalu, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥సులభుఁడు మధుసూదనుఁడు మన-మెలమి నమ్మిన నిట్టే సుండీis-aber.net॥చ1॥పడుచు మాటన కా ప్రహ్లదునెదుటపొడచూపె నాదిపురుషుఁడుఅడవి దేహనక అదంతిమొఱకునుతడవి కాచిన దైవము సుండీ॥చ2॥ఆడుమాటలనక అంతలో ద్రౌపదినివాడిమి గాచిన వరదుఁడుపోఁడిమిఁ బేదనక పొందిన కుచేలునివీఁడె సంపదిచ్చె విష్ణుఁడు సుండీ॥చ3॥వీరువారన కిదె వేఁడిన వరములుసారేకు నిచ్చిన సర్వేశుఁడుమేరతో లోకముల మెఱసె నిప్పుడునుయీరీతి శ్రీవేంకటేశుఁడే సుండీ రాగము: రామక్రియ రేకు: 0082-02 సంపుటము: 1-394 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య [&పూర్తి వివరాలు ...
॥పల్లవి॥విధి నిషేధము లకు వెఱవఁగఁ బనిలేదుమధుసూదన నీమన్నన దాసుడైతే॥చ1॥విడువరానిధర్మ విధుల పురుషులనువిడిచి గోపికలు విచ్చనవిడిబడి నిన్ను దగులుటే పరమధర్మ మాయయెడయునితర ధర్మాలిక నేటికయ్యా॥చ2॥మానరాని కర్మమార్గము లటు మానిపూనినయతులే పూజ్యులటనీనారాయణనియతే ధర్మమాయయీనిజ మొకటియు నెఱగఁగఁవలయు॥చ3॥యిన్నిట శ్రీవేంకటేశ నీదాసుఁడైవున్న విచారాల నొదుగనేలానిన్ను గూర్చినట్టి నిజభ క్తి గలదనితిన్ననై తెలిపేటి తెలివే కలది రాగము: దేవగాంధారి రేకు: 0082-01 సంపుటము: 1-393 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవాసౌమిత్రి భరత శత్రుఘల తోడ జయమందు దశరథ రాఘవా॥చ1॥శిరసు కూఁకటుల రాఘవా చిన్నారి పొన్నారి రాఘవాగరిమ నావయసునఁ దాటకిఁ జంపిన కౌసల్యనందన రాఘవాఅరిది యజ్ఞముగాచు రాఘవా అట్టె హరువిల్లు విఱిచిన రాఘవాసిరులతో జనకుని యింటను జానకిఁ జెలఁగి పెండ్లాడిన రాఘవా॥చ2॥మలయు నయోధ్యా రాఘవా మాయామృగాంతక రాఘవాచెలఁగి చుప్పనాతి గర్వ మడఁచి దైత్యసేనలఁ జంపిన రాఘవాసొలసి వాలిఁజంపి రాఘవా దండి సుగ్రీవునేలిన రాఘవాజలధి బంధించిన రాఘవా లంక సంహరించిన రాఘవా॥చ3॥దేవతలు చూడ రాఘవా […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుఁడే రక్షకుఁడుతటుకున స్వతంత్రముడిగిన యాత్మకు తగునిశ్చింతమే పరసుఖము॥చ1॥ఆఁకటి కడుగని శిశువుకుఁ దల్లి యడిచి పాలు ద్రాగించినరీతి,యీకడఁ గోరికలుడిగిన యోగికి నీశ్వరుఁడే రక్షకుఁడుచేకొని బుద్దెఱిఁగిన బిడ్డలపైఁ జింతింపరు తొల్లిటివలెఁ దల్లులుయీకొలఁదులనే స్వయత్న దేహుల కీశ్వరుఁడును వాత్సల్యము వదలు॥చ2॥తతిఁ గరిరాజుఁ గాచినయట్లు ద్రౌపదిమానము గాచినయట్లు,హితమతి స్వతంత్రముడిగిన యోగికి యీశ్వరుఁడే రక్షకుఁడుఅతనుఁడు భస్మంబయ్యిననాఁడు అజునిశిరంబటు ద్రుంచిననాఁడుచతురుఁడుదా నడ్డము రాఁడాయను స్వతంత్రముడుగని జీవులుగాన॥చ3॥దిక్కని యనిశముఁ జిత్తములోనఁ జింతించేటి శరణాగతజనులకు,యిక్కడనక్కడ శ్రీ వేంకటగిరియీశ్వరుఁడే రక్షకుఁడుమక్కువతోఁ దనయంతర్యామిని మఱచినస్వామి ద్రోహులకెల్లాఅక్కరతోఁ బుట్టుగులే […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పరులసేవలు చేసి బ్రదికేరటాసిరివరుదాసులు సిరులందు టరుదా॥చ1॥కోరి వొక నరునిఁ గొలిచిన వారలుదీరులై సలిగెలఁ దిరిగేరటకూరిమి బ్రహ్మండ కోటులేలెడివాని-వార లింతటఁ జనవరులౌ టరుదా॥చ2॥చేకొన్న తుమ్మిద చేపడ్డ కీటము –లాకడఁ దుమ్మిదలయ్యీనటశ్రీకాంతుని పాదసేవకులగు వార –లేకులజు లయినా నెక్కుడౌ టరుదా॥చ3॥ధరణీశు నాజ్ఞల తమదేశములందుసిరులనాణెపు ముద్ర చెల్లీనటతిరువేంకటాద్రి శ్రీదేవుని ముద్రలుధరియింపఁగా నింతటఁ జెల్లు టరుదా రాగము: దేసాళం రేకు: 0081-03 సంపుటము: 1-390 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...