Tags :జానపద పాటలు

    జానపద గీతాలు రాయలసీమ

    ఓ రాయలసీమ రైతన్నా ! – జానపద గీతం

    సాగునీటి సౌకర్యాల విషయంలో దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ రైతుకు వ్యవసాయం గుదిబండగా మారి, ప్రాణ సంకటమై కూర్చుండింది. కాయకష్టం చేసి గుట్టలు చదును చేసి తను సాగు చేసిన మెట్ట, పొట్ట కూడా నింపలేదని బాధపడుతున్న రైతు వ్యధను ‘ఓ రాయలసీమ రైతన్నా …’ అంటూ జానపదులు ఇలా ఆలపిస్తున్నారు. మెట్టలూ, గుట్టలుదీసి – పట్టుబట్టీ దున్నితేను చిట్టెడైన పండవేమిరా ఓ రాయలసీమ రైతన్నా..! పొట్టలైనా నిండవేమిరా ఎండలోస్తే పంటలేదు, కుండనొక్కా గింజ లేదు […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    అందమైన దాన … జానపద గీతం

    అందమైన దాన,, సందమామ లాంటి దాన నీ అందమంతా సూసి నేను వాలిపోయాను పొద్దుటూరు లోనా పట్టు సీరలంగడి నాది సీరలన్నీ నీవు సింగారించుకోవే ।।అందమైన॥ ఆళ్ళగడ్డ లోన హారాలంగడి నాది హారాలన్ని నీవు రుంగారించుకోవే ॥అందమైన॥ అనంతపురంలోన అద్దాల మాడి నాది అద్దాల మాడిలోన ముద్దాడుకుందాము రావే ॥అందమైన॥ ముద్దనూరి లోన ముద్దాలంగడి నాది ఒక ముద్దయునా తిని పోదువు రావే ॥అందమైన॥పూర్తి వివరాలు ...