Tags :చిన్నమండెం

    ఆచార వ్యవహారాలు

    రేపటి నుంచి పీరయ్యస్వామి ఆరాధనోత్సవాలు

    చిన్నర్సుపల్లెలో సద్గురు పీరయ్యస్వామి ఆరాధనోత్సవాలు ఈనెల 15 నుంచి నిర్వహిస్తున్నట్టు పీఠాధిపతి నాగలింగమయ్య తెలిపారు. మకర సంక్రాంతి నాడు ఉదయం నుంచే స్వామివారి జీవసమాధికి పుష్పాలంకరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పగలంతా ప్రత్యేక కార్యక్రమాలుంటాయని, రాత్రికి స్వామివారి పేరుతో కాలమానిని ఆవిష్కరణ జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం కొండమూల చౌడేశ్వరీమాత వూరేగింపు, పెద్దమండెం మండలం నుంచి వచ్చే దేవరెద్దు ప్రదర్శనతో పాటు చింతామణి, సత్యహరిశ్చంద్ర నాటకాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. 16న ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జెండా […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    జిల్లాలో 48 కరువు మండలాలు

    కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, చక్రాయపేట, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడు, వీరబల్లి, జమ్మలమడుగు, కడప, తొండూరు, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, అట్లూరు, వేంపల్లె, బద్వేలు, గోపవరం, చిన్నమండెం, రాయచోటి, పులివెందుల, […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    తొలివిడత స్థానిక ఎన్నికలు ఈ పొద్దే!

    తొలివిడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 29 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎంపీటీసీ బరిలో 1055 మంది, జడ్పీటీసీ బరిలో 144 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 29 జడ్పీటీసీ స్థానాలకు, 326 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 8,05,681 మంది పల్లె ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. బద్వేల్, అట్లూరు, గోపవరం, బికోడూరు, కలసపాడు, పోరుమామిళ్ళ, కాశినాయన, మైదుకూరు, బీమఠం, దువ్వూరు, […]పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు

    పాలేటమ్మ తిరుణాళ్ళ ముగిసింది

    చిన్నమండెం: కేశాపురం గ్రామం దేవళంపేటలో మంగళవారం సాయంత్రం సిద్దల బోనాలతో ప్రారంభమైన పాలేటమ్మ తిరునాళ్లలో రాత్రికి మొక్కులు ఉన్న భక్తులు కట్టిన చాందినీ బండ్లు, బాణ సంచా పేలుళ్లు, చెక్కభజనలు, కోలాటాలు, సంగీతవిభావరి అందరిని అలరించాయి. బుధవారం అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం వద్ద రద్దీ నెలకొంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా చిత్తూరు జిల్లా సరిహద్దు మండలాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అమ్మవారి దర్శనానికి ఎక్కువ సమయం వరుసలో నిల్చోవాల్సి వచ్చింది. […]పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు

    మల్లూరమ్మ జాతర వైభవం

    ఆదివారం మధ్యాహ్నం సిద్దల బోనాలు పట్టడంతో ప్రారంభమైన మల్లూరమ్మ జాతర సోమవారం పగలు కనుల పండువగా సాగింది.  రాత్రికి మొక్కుబడిదారులు ఏర్పాటు చేసిన 17 చాందినీ బండ్లు సోమవారం తెల్లవారుజాముకు జాతరకు చేరుకున్నాయి. బండ్ల ముందు ట్రాక్టర్లలో వీధి నాటకాలు, చెక్కభజనలు, కోలాటాలు చేశారు. ఇవి భక్తులను అలరించాయి. వేల సంఖ్యలో ప్రజలు రావడంతో గుడి దగ్గర రద్దీగా మారింది. ఒక్కో బండికి ఒక చుట్టే తిరగాలని పోలీసులు చెప్పడంతో ప్రశాంతంగా ప్రదక్షిణలు సాగాయి. సోమవారం పగలు తిరునాళ్ల […]పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు

    రేపటి నుంచి పాలేటమ్మ తిరుణాళ్ళ

    చిన్నమండెం మండల పరిధిలోని కేశాపురం గ్రామం దేవళంపేటలో వెలసిన పాలేటమ్మ ఆలయం వద్ద 18వ తేదీ మంగళవారం నుంచి రెండు రోజులు తిరునాళ్ల నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరెన్నికగన్న పాలేటమ్మకు చిన్నమండెం, కలిబండ, పడమటికోన, బోనమల, కేశాపురం, జిల్లా సరిహద్దు గ్రామాల్లో ఆదివారం నుంచే బోనాలు సమర్పిస్తారు. మంగళవారం ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం సిద్దల బోనాలు సమర్పించడంతో తిరునాళ్ల ప్రారంభమవుతుంది. మొక్కులు ఉన్నవారు […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    మండలాధ్యక్ష రిజర్వేషన్లు – 27 పురుషులకు, 23 మహిళలకు

    కడప జిల్లాలోని 50 మండలాధ్యక్ష స్థానాలలో (ఎంపిపి) 27 పురుషులకు, 23 మహిళలకు కేటాయించారు. దీనికి సంబంధించి శనివారం రాత్రి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ రిజర్వేషన్ల జాబితాపై సంతకం చేశారు. మండలాధ్యక్షుల రిజర్వేషన్లను పరిశీలిస్తే…  ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్‌కు 4, మహిళలకు 3 మండలాలు, బీసీ జనరల్‌కు 7, మహిళలకు 6 అన్‌రిజర్వుడు జనరల్‌కు 15, మహిళల కు 14 మండలాలను ఖరారు చేశారు. మండలాల వారీగా రిజర్వషన్ల వివరాలిలు.. [checklist] పులివెందుల […]పూర్తి వివరాలు ...