గండికోట కావ్యం సమీక్ష తెలుగులో ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యాలు స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత చాలా వచ్చాయి. వీటిని చారిత్రక స్థలకావ్యాలని కూడా పిలువవచ్చు. ప్రాచీన తెలుగు సాహిత్యంలో కాశీఖండం, భీమఖండం వంటి క్షేత్రప్రశస్తి కావ్యాలు ఉన్నప్పటికీ అవి కేవలం ఆధ్యాత్మిక దృష్టితో భక్తి ప్రధానంగా రచింపబడ్డాయి. కానీ ఆధునిక కాలంలో వచ్చిన క్షేత్రప్రశస్తి కావ్యాల లక్ష్యం వేరు. స్వాతంత్య్రోద్యమ కాలం కావడం వల్ల ప్రజలను చైతన్యవంతులను చేయడం ఆధునిక కవుల లక్ష్యం. అందువల్లనే ‘ఓ ఆంధ్రుడా! […]పూర్తి వివరాలు ...
Tags :గాడిచర్ల హరిసర్వోత్తమరావు
తెలుగు ప్రజల ఆదిమ నివాస స్థలం రాయలసీమ. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపాన ఉన్న రాళ్లకాల్వ వద్ద, కర్నూలు జిల్లాలో అనేక చోట్ల జరిగిన తవ్వకాలలో అతి ప్రాచీన మానవుని ఉనికికి సంబందించిన అనేక ఆధారాలు లబించినట్లు ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ హెచ్.డి. సంకాలియా తెలియజేసినారు. ”మద్రాసు చుట్టు పట్లా, కర్నూలు జిల్లాలో వున్న అనేక గుహలు అన్నిటికన్నాముఖ్యమైన స్థలాలని నా అభిప్రాయం. దాదాపు అరవయ్యేళ్ల క్రితం రాబర్ట్ బ్రూస్‌పుట్ ఆ ప్రదేశాలలో అనేక పరికరాలనూ, ఎముకల […]పూర్తి వివరాలు ...
ఆంద్రుల స్మృతి పథంలో చెరగని ముద్ర వేసిన ముగ్గురు ఈస్టిండియా కంపెనీ అధికారులలో థామస్ మన్రో ఒకరు. ఈయన 1761 మే 27వ తేదీన ఇంగ్లండ్‌లోని గ్లాస్‌కోలో జన్మించారు. ఇతని తండ్రి అలెగ్జాండర్ మన్రో ఒక వర్తకుడు. థామస్ మన్రో గ్లాస్‌కో విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఈస్టిండియా కంపెనీలో మిలిటరీ ఉద్యోగం కొరకు తన పంతొమ్మిదో ఏట అనగా 1780 జనవరిలో 15న మద్రాసుకు వచ్చాడు. అదే సమయంలో హైదరాలీ, టిప్పుసుల్తాన్‌లతో జరిగిన రెండు, మూడు […]పూర్తి వివరాలు ...
1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు. అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు […]పూర్తి వివరాలు ...