Tags :కెవిరమణ

    వార్తలు

    ‘కొప్పర్తి పరిశ్రమలవాడలో భూముల ధరలు ఎక్కువ’: కలెక్టర్

    గతంలో ఏ కలెక్టరు ఇలా ఉండరనేది నిజమే కడప :  కొప్పర్తి పరిశ్రమల పార్కులో పెద్ద, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు అక్కడ భూముల ధరలు ఎక్కువగా ఉన్నందువల్ల వెనక్కి తగ్గుతున్నారని జిల్లా కలెక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. కడప జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా సోమవారం స్థానిక సభాభవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆయన మాట్లాడుతూ గతంలో ఏ కలెక్టరు ఇలా ఉండరనేది నిజమేనన్నారు. అప్పటి […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ఉద్దేశపూర్వకంగా జిల్లాను ఘోరీ కడుతున్నారు

    విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో శాసనసభ్యులు మౌనముద్ర దాల్చిన కలెక్టర్ కడప: జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు అవసరమని కమిటీ ఛైర్మన్, ఎంపీ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు, కేటాయింపులు, నిధుల వినియోగం, ప్రజలకు చేరువపై సమీక్షించడానికి బుధవారం సభాభవన్‌లో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కమిటీ ఛైర్మన్‌గా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి,  కార్యదర్శి హాదాలో జిల్లా కలెక్టర్ వెంకటరమణ, సభ్యులుగా జడ్పీ ఛైర్మన్ గూడూరు రవి, 8 […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ఈ కలెక్టర్ మాకొద్దు

    కడప : జిల్లా ప్రజలపైన ఆరోపణలు గుప్పిస్తూ, జిల్లా అభివృద్ధికి ఆటంకంగా మారిన జిల్లా కలెక్టర్ ను గవర్నర్ వెంటనే వెనక్కి పిలిపించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో వివిధ రాజకీయపక్షాల నాయకులూ (తెదేపా మినహా), కార్యకర్తలూ, వివిధ ప్రజా సంఘాలు, ప్రజలూ పాల్గొన్నారు. ముందుగా కలెక్టరేట్ ఎదుట కూర్చుని నిరసన తెలిపిన అఖిలపక్షం ఆ తర్వాత కలెక్టరేట్ లోపలికి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని, లాఠీచార్జీ చేశారు. […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    6న అఖిలపక్షం కలెక్టరేట్ ముట్టడి

    కడప: జిల్లా కలెక్టర్ కెవి రమణ వ్యవహారశైలికి నిరసనగా సోమవారం నాడు కలెక్టరేట్ ముట్టడికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. కడప జిల్లా ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ప్రజా వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న కలెక్టర్ ఇక్కడి  నుండి వెళ్లిపోవాలని కోరుతూ ఈ ఆందోళనను నిర్వహించనున్నట్లు అఖిలపక్షం నేతలు ఒక ప్రకటనలో తెలియజేశారు.పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ‘వాస్తు కోసం దక్షిణ ద్వారం మూయండి’: కలెక్టర్

    ఒంటిమిట్ట: వాస్తు రీత్యా దక్షిణద్వారం అనర్థదాయకం కావడంతో కోదండ రామాలయ దక్షిణ ద్వారాన్ని మూసి వేయాలని జిల్లా సర్వోన్నత అధికారి కేవిరమణ అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లాకలెక్టరు కేవీ రమణ పరిశీలించారు. కల్యాణం నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సమయంలో బారికేడ్లతో భక్తులకుఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వరుసలు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. కల్యాణం నిర్వహించే ప్రాంత వంకను పూడ్చాలని జెడ్పీవైస్‌ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కలెక్టరు సూచించారు. ప్రస్తుతం సమయంతక్కువగా […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    కలెక్టర్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

    మైదుకూరు: ప్రజా ప్రతినిధుల సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కెవీ రమణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి శుక్రవారం శాసనసభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఆహ్వానించి, ఆపై పోలీసుల ద్వారా అడ్డుకొని ప్రజాప్రతినిధులను అవమానపరిచారని ఈ నేపథ్యంలో సెక్షన్ 168 కింద విచారణకు స్వీకరించి చర్యలు చేపట్టాలని ఆయన స్పీకర్‌ను కోరారు.పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ప్రభుత్వం ఆయన్ను వెనక్కి పిలిపించుకోవాల

    కడప: జిల్లా కలెక్టర్ కేవీ రమణ వ్యవహార శైలిపై అఖిలపక్షం నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధంగా పని చేయని ఆయన ఈ జిల్లా కలెక్టర్‌గా అర్హులు కారని పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ అధ్యక్షతన రౌండు టేబుల్ సమావేశం నిర్వహించారు. వైకాపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, కార్మిక సంఘం నేతలు జిల్లా కలెక్టర్ తీరుపై మండిపడ్డారు. గతంలో పని చేసిన […]పూర్తి వివరాలు ...