Tag Archives: కవిత

నేను – తను (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

నేను - తను

ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినపుడు మేమిద్దరం చెరో ధృవం వైపు విసరేయబడతాము ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణ చిత్రంలా గోచరిస్తుంది చేయి చాచితే అందే ఆమె దూరం మనస్సులో యోజనాలై విస్తరించుకొంటుంది ఉల్లిపొరై మామధ్య లేచిన భేదభావానికి నా అహం ఉక్కుపూత పూసేందుకు నడుం బిగిస్తుంది మౌనంగా మామధ్య …

పూర్తి వివరాలు

వానొచ్చాంది (కవిత)

రాయలసీమ రైతన్నా

ఆకు అల్లాడ్డంల్యా గాలి బిగిచ్చింది ఉబ్బరంగా ఉంది ఊపిరాడ్డంల్యా ఉక్క పోచ్చాంది వంతు తప్పేట్లు లేదు వంక పారేట్లే ఉంది. పొద్దు వాల్తాంది మిద్దెక్కి సూచ్చనా వానొచ్చాదా రాదా? పదునైతాదా కాదా? అదును దాట్తే ఎట్లా? ఏడు పదుల కరువు పందికొక్కుల దరువు పంకియ్యని ప్రభువు ముదనష్టపు అప్పు ఉరితాళ్ళ బతుకు. అద్దద్దో…ఆపక్క …

పూర్తి వివరాలు

వీర ప్రేక్షకులు (కవిత)

chidambarareddy

వాడి కాగితాల చూపుల్నిండా టన్నుల కొద్దీ వ్యూహాలు. తన తల్లో వండిన కలలుగానే కొత్త రంగులు పూస్తుంటాడు కొలతలేసి చూపుతుంటాడు. మాటల గాలిపటాల్ని గీసి మిరుమిట్ల మిణుగుర్లతికించి హద్దుల్లేని ఆకాశంలో మేకే అందని అతి ఎత్తుల్లో ప్రదర్శనలు సాగిస్తుంటాడు. కలలెందుకు కనాలో కన్న కలలకు దార్లెలా వేయాలో ప్రయత్నించే మీరు మీ మేధస్సే …

పూర్తి వివరాలు

సీమ రైతన్న (కవిత) – జగదీశ్ కెరె

రాయలసీమ రైతన్నా

కరువుటెండలో వాడిపోతున్న మట్టిపూలు రాలిపోతున్నాయి వెన్నెముకగా నిలవాల్సిన అన్నదాతలు నిలువ నీడలేక నేలకొరగిపోతున్నారు మేఘాల చినుకుల కోత కరువులో ఆకలిమంటల కోత నిరంతరం సీమలో రైతన్నలకు రంపపు కోత పచ్చని ఆకులా నవ్వాల్సిన రైతన్న ఎండుటాకులా ఎముకలగూడై మిగిలాడు పరిమలాలు వెదజల్లాల్సిన మట్టివాసన కుల్లినశవాల వాసనతో మలినమయ్యింది బురద నీల్లలో దుక్కిదున్నాల్సిన కాల్లకు …

పూర్తి వివరాలు

ఒక్క వాన చాలు (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

రాయలసీమ రైతన్నా

వాన మాట విన్పిస్తే చాలు చెవులు – అలుగుల్ని సవరించుకొనే చెరువులవుతున్నాయి మేఘాల నీడలు కదిలితే చాలు కళ్లు – పురివిప్పే నెమళ్ళవుతున్నాయి కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై పైరు చెక్కిళ్లమీద జాలిగా జారుతోంది ఉత్తర ప్రగల్భాల ఉరుముల్తో ఉత్తర కూడ దాటింది ఒక్క వాన వొంగితే చాలు ముక్కాలు పంటన్నా …

పూర్తి వివరాలు

నాది నవసీమ గొంతుక (కవిత)

సిద్దేశ్వరం ..గద్దించే

కరువు గడ్డ కాదిది కాబోయే పోరు బిడ్డ నెత్తుటి గుడ్డ కాదిది కాబోయే ఉద్యమ అడ్డా మౌనాంగీకారం కాదు రా….. బద్దలవబోయే సీమ నిశ్శబ్ద ఘీంకారం ఎర్ర చందనం నీ సొత్తు కాదిక అది నా సీమ అస్తిత్వం అది మొరటుతనం కాబోదిక మాది నిప్పంటి సీమ కరుకుతనం కూరలో కరేపాకు కాదిక …

పూర్తి వివరాలు

కొత్తసీమ (పాట) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

chidambarareddy

చర్న కోల ఏదిరా-బండిగుజ్జ వెదకరా వడిశెలా చెల్లెమ్మా-మొద్దొ పరక తీయమ్మా //చర్న// వాడెవడో నిజాముగాడు మననమ్మెనంట తెల్లోనికి ఇంకెవడో ఖద్దరోడు ముక్కలుగా నరికెనంట. అరవ నాడులో చేతులు కన్నడ దేశాన తలా మొండెమే మనమిప్పుడు వంచించ బడిన బిడ్డలం //చర్న// రాజుల కాలం కాదిది- రజకీయ నక్కలార ప్రజల మాట ఆలకించి -పోరాడుదాము …

పూర్తి వివరాలు

సామీ నమస్కారం…. (కవిత)

కడప జిల్లాపై బాబు

సామీ నమస్కారం…. మాకు పంగనామాలు పెట్టిన  సామీ నీకు నమస్కారం అమ్మ నోట్లో మన్ను కొట్టి అబద్దాలు ఆరవోసిన  సామీ నీకు నమస్కారం సొమ్ములున్న సోగ్గాళ్ళ కౌగిట బందీవై  మము వెక్కిరించిన  సామీ నీకు నమస్కారం! సభ సాక్షిగా సీమకు  మకిలిని అంటగట్టిన  సామీ నీకు నమస్కారం! రాజధాని పేర రంకు నడిపి  …

పూర్తి వివరాలు

అన్నన్నా తిరగబడు… (కవిత) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

chidambarareddy

రాయల సీమజనాల్లో రగత మురికిపారాల రాజకీయ రంకుల్ని ఈడ్చి ఈడ్చి తన్నాల. ఈపొద్దు ఇంటిలోన రేపేమో మంటిలోన ఏదొకటో కాకుంటే మనకింకా ముక్తి లేదు. ఒకకంటికి సున్నము వెన్న మరో కంటికి ఆదినుండి మనసీమకు అంతులేని అన్యాయం. ప్రాజెక్టును ఇస్తామని మదరాసునుండి పిల్చినారు చుక్క నీరు ఇవ్వకుండ కిందకు మళ్లించినారు . సీమ …

పూర్తి వివరాలు
error: