Tags :కడప జిల్లా కలెక్టర్

వార్తలు

కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న హరికిరణ్

కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన హరికిరణ్ బదిలీపై వెళుతున్న కలెక్టర్ బాబురావు నాయుడు నుంచి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా 51 వ కలెక్టరుగా బేస్తవారం పొద్దున 11 గంటలకు కలెక్టరేట్‌లోని ఛాంబరులో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. హరికిరణ్ 2009 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇక్కడ పనిచేసిన బాబురావు నాయుడు గిరిజన కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఉన్న హరికిరణ్ ను ప్రభుత్వం […]పూర్తి వివరాలు ...

వార్తలు

కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న బాబురావు నాయుడు

కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన బాబురావు నాయుడు బదిలీపై వెళుతున్న కలెక్టర్ సత్యనారాయణ నుంచి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా 50వ కలెక్టరుగా శుక్రవారం సాయంత్రం 4.35 నిమిషాలకు కలెక్టరేట్‌లోని ఛాంబరులో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. బాబురావు నాయుడు 2006 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇక్కడ పనిచేసిన సత్యనారాయణ ఆం.ప్ర స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ గా […]పూర్తి వివరాలు ...

వార్తలు

కె.వి.సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్నారు

కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన కె.వి.సత్యనారాయణ బదిలీపై వెళుతున్న కలెక్టర్ కె.వి. రమణ నుంచి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేసిన కె.వి.రమణ గృహనిర్మాణశాఖ ఎండీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సత్యనారాయణను ప్రభుత్వం కడప జిల్లా కలెక్టరుగా నియమించింది. సత్యనారాయణ స్వస్థలం కృష్ణా జిల్లాలోని గన్నవరం. బాధ్యతలు తీసుకున్న అనంతరం వేద పండితులు కొత్త కలెక్టర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. పలువురు అధికారులు, […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఈ కలెక్టర్ మాకొద్దు

కడప : జిల్లా ప్రజలపైన ఆరోపణలు గుప్పిస్తూ, జిల్లా అభివృద్ధికి ఆటంకంగా మారిన జిల్లా కలెక్టర్ ను గవర్నర్ వెంటనే వెనక్కి పిలిపించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో వివిధ రాజకీయపక్షాల నాయకులూ (తెదేపా మినహా), కార్యకర్తలూ, వివిధ ప్రజా సంఘాలు, ప్రజలూ పాల్గొన్నారు. ముందుగా కలెక్టరేట్ ఎదుట కూర్చుని నిరసన తెలిపిన అఖిలపక్షం ఆ తర్వాత కలెక్టరేట్ లోపలికి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని, లాఠీచార్జీ చేశారు. […]పూర్తి వివరాలు ...