Tags :ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

    ఆచార వ్యవహారాలు వార్తలు

    ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణ వైభోగం

    ఒంటిమిట్ట: కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు (బుధవారం) ప్రత్యేక వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హస్తా నక్షత్రయుక్త శుభలగ్నంలో రాత్రి 8 గంటలకు మొదలైన కల్యాణం 10 గంటల వరకూ సాగింది. ఉత్సవ విగ్రహాలను పల్లకీపై కొలువుదీర్చి ప్రధాన ఆలయం నుంచి శోభాయాత్రగా శిల్పకళా శోభితమైన కళ్యాణమండపం వద్దకు తీసుకువచ్చారు. వేదికపైన రజిత సింహాసనంపై కళ్యాణమూర్తులను ఆసీనులను చేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేసి […]పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు వార్తలు

    ఏప్రిల్‌ 14 నుంచి ఒంటిమిట్ట కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు

    ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్‌ 12వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 15న సాయంత్రం 4.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల షెడ్యూల్ : 14-04-16(గురువారం) మూలవర్ల అభిషేకం (ఉదయం), అంకురార్పణం (సాయంత్రం) 15-04-16(శుక్రవారం) ధ్వజారోహణం, శ్రీరామజయంతి (ఉదయం),  […]పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు ప్రత్యేక వార్తలు

    కనుల పండువగా కోదండరాముని రథోత్సవం

    ఒంటిమిట్ట : కోదండరాముని రథోత్సవం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. సీతాలక్ష్మణ సమేతుడై రథంపై ఊరేగి వచ్చిన  కోదండరాముడు పుర వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు ఉత్సవ విగ్రహాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథం వద్దకు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఆశీనులను చేశారు. స్థానిక తహశీల్దార్ కనకదుర్గయ్య పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రామనామస్మరణ […]పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు ప్రత్యేక వార్తలు

    వైభవంగా కోదండరాముడి పెళ్లి ఉత్సవం

    ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో గురువారం రాత్రి శ్రీసీతారాముల పెళ్లి ఉత్సవం శాస్త్రోక్తంగా, వైభవంగా జరిగింది. గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేర్వేరుగా స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తితిదే  తరపున కార్యనిర్వహణాధికారి సాంబశివరావు పట్టు వస్త్రాలు అందజేశారు. అంతుకు ముందు సీతా రాములను వేర్వేరుగా వేద పండితులు, ఆలయ సిబ్బంది ఆలయం నుంచి కల్యాణ వేదిక వద్దకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామయ్య, సీతమ్మను కల్యాణ వేదికపైకి తెచ్చి నిర్వహించిన […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ఈ రోజు రాత్రి ఒంటిమిట్టలో సీతారాముల పెళ్లి

    ఓఒంటిమిట్ట: ఈ రోజు (గురువారం) రాత్రి జరగనున్న కోదండరామయ్య పెళ్లి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల పెళ్లి ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించనున్నారు. శ్రీరామనవమి నుంచి ఆరో రోజున రాత్రివేళ వెన్నెలలో ఈ కల్యాణం నిర్వహించడం మొదటి నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా పలు ఏర్పాట్లు చేశారు. అలాగే పెద్దఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఒంటిమిట్ట ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ముఖ్యమంత్రి […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు

    కడప : శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ  రోజు నుంచి ఏప్రిల్ 6 వరకు జిల్లాలోని 8 డిపోల పరిధిలో ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని చెప్పారు. కడప డిపో నుంచి 25, రాజంపేట 30, ప్రొద్దుటూరు 15, బద్వేలు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగు డిపోల నుంచి పది బస్సుల చొప్పున మొత్తం 120 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు వెల్లడించారు.ఆర్టీసీ […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల షెడ్యూలు 2015

    రేపటి నుంచి ఉత్సవాల అంకురార్పణ కడప: ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలను ఈ నెల 27వ నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటరమణ తెలిపారు. భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో సెల్‌ఫోన్లు, కెమేరాలు వెంట తీసుకెళ్లరాదని, పాదరక్షలు వేసుకుని వెళ్లరాదని సూచించారు. దర్శనం టికెట్ దేవస్థానంలో కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. 27వ తేదీ ఉదయం 4 గంటల నుంచి ప్రజలు స్వామిని దర్శించుకునే వీలు కల్పించామన్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    గవర్నర్ చేతులమీదుగా కోదండరామ కళ్యాణం

    ఒంటిమిట్ట : కోదండరాముని కల్యాణాన్ని ఏప్రిల్ 2న గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ సహాయ కమిషనరు శంకర్‌బాలాజీ చెప్పారు. శుక్రవారం ఒంటిమిట్టలో పాత్రికేయులతో మాట్లాడుతూ… చేత్తో ఒలిచిన బియ్యం గింజలతో సీతారాముల తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని  ఆయన తెలిపారు. చేత్తో ఒలిచిన బియ్యం గింజలను చుట్టుప్రక్కల గ్రామస్థులు 27 వరకూ తెచ్చి ఇవ్వవచ్చునన్నారు. ఈ ఏడాది నూతనంగా ప్రవేశ పెట్టే ఈ ఆచారాన్ని విజయవంతం చేయాలన్నారు. కల్యాణంలో పాల్గొనదలచిన 25లోగా భక్తులు రూ. వెయ్యి చెల్లించి […]పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు

    మార్చి 26 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

    ఒంటిమిట్ట: కోదండరాముని శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మార్చి 27వ తేదీతో ప్రారంభమై, ఏప్రిల్ 6తో ముగియనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తారు. బ్రహ్మోత్సవాల గోడపత్రాలను ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆదివారం విడుదలచేశారు. ముఖ్యమంత్రికి స్వయంగా ఒంటిమిట్ట కోదండరాముడి గురించి తాను వివరించానన్నారు. ఒంటిమిట్ట, రామతీర్థం ఆలయాలకు సంబంధించిన నివేదకలను తెప్పించుకొని, పరిశీలించిన పిదప ప్రభుత్వ లాంచనాల విషయంలో ఓ నిర్ణయానికి వద్దామని సీఎం చెప్పారన్నారు. రామాలయానికి దాతల సహకారంతో ఒంటిమిట్ట కొదందరామాలయంలో […]పూర్తి వివరాలు ...