Tags :ఒంటిమిట్ట కోదండరామాలయం

    అభిప్రాయం

    చిన్న క్షేత్రాలనూ ఎదగనివ్వండి

    నిన్నమొన్నటిదాకా కడప జిల్లా మొత్తానికి ప్రసిద్ధిచెందిన దేవాలయం అంటే ‘దేవుని కడప’ ఒక్కటే గుర్తొచ్చేది. ఇప్పుడు స్వదేశ్ దర్శన్ కింద జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు కేంద్రాల్లో దేవుని కడప ప్రస్తావనే లేదు. ఆ నాలుగు కేంద్రాలు: ఒంటిమిట్ట కోదండరామాలయం, పుష్పగిరి చెన్నకేశవాలయం, అమీన్ పీర్ దర్గా, గండికోటలోని మసీదు. ఒంటిమిట్టను ఎలాగూ తితిదే వాళ్ళు నూరుకోట్లతో అభివృద్ధి చేస్తున్నారు కదా? అది చాలదన్నట్లు మరీ కక్కుర్తిగా చిన్నాచితకా దేవస్థానాలకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న రెండుకోట్లకు కూడా […]పూర్తి వివరాలు ...

    పర్యాటకం

    ఒంటిమిట్ట కోదండరామాలయం

    రాష్ర్టవిభజన నేపథ్యంలో భద్రాచల రామాలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమి వేడుకలను అధికార లాంఛనాలతో కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం వేదికగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ ఆలయ విశేషాల పట్ల తెలుగువారిలో సహజంగానే ఆసక్తి నెలకొంది. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎన్నో విశిష్టతలను సంతరించుకున్న ఈ రామాలయం వివరాలు… కడప నుంచి తిరుపతికి వెళ్లే ప్రధానమార్గంలో కడపకు 24 కి.మీ. దూరంలో మండలకేంద్రం ఉంది. ఈ గ్రామం త్రేతాయుగం నాటిదని స్థలపురాణం వివరిస్తోంది. […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ఒంటిమిట్టలో రోడ్ల పునరుద్ధరణకు 45లక్షలు

    కడప: ఒంటిమిట్ట కోదండరామాలయం సమీపంలోని రోడ్లు పునరుద్ధరించేందుకు, అలాగే రథం తిరిగే రోడ్డు వెంబడి మరమ్మతులు చేసేందుకు గాను ప్రభుత్వం 45 లక్షల రూపాయలను  (G.O.RT.No. 242) మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం పేర (పంచాయతీ రాజ్ శాఖ) కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి  జీవో నెంబరు 242ను మార్చి 11న విడుదల చేశారు. ఇందులో 40 లక్షల రూపాయలను వెచ్చించి వాహనశ్రేణి (విఐపి) తిరిగేందుకు వీలుగా ఆలయ సమీపంలోని రోడ్లను పునరుద్ధరిస్తారు. మిగతా ఐదు […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం పర్యాటకం

    “కడప దేవుని గడప” అని ఎందుకంటారో …

    ఒంటిమిట్ట – దీన్నే ఏకశిలానగరం అంటారు. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో ఇక్కడకు వచ్చి దీనిపైన మూడురోజులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికి ఇంకా వారికి ఆంజనేయస్వామీ పరిచయం కాకపోవటంతో ఇక్కడ సీతారామలక్ష్మణుల విగ్రహాలే ఉంటాయి. ఆంజనేయస్వామీ విగ్రహం విడిగా ఆలయఆవరణలో ఒకప్రక్కన ఉంటుంది. ఈ విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్ట చేసాడని అంటారు. ఈ క్షేత్రానికి చాలా ప్రశస్తి ఉంది. పోతన ఇక్కడే ఉండి భాగవతాన్ని వ్రాసాడని చెప్తారు. ఆయన నివసించిన ఇల్లు కూడా ఉందికాని […]పూర్తి వివరాలు ...