ప్రొద్దుటూరు: లెజెండ్ సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని హిందూపురం శాసనసభ్యుడు, కథా నాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. చలనచిత్ర సీమలో లెజెండ్ సినిమా ఒక లెజెండ్‌గా మిగిలిపోతుందన్నారు. లెజెండ్ చలనచిత్రం 275 రోజులు ప్రొద్దుటూరులోని అర్చనా థియేటర్‌లో ప్రదర్శింపబడిన నేపధ్యంలో విజయోత్సవ సభను ఆదివారం స్థానిక రాయల్ కౌంటీ రిసార్ట్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌తో కలిసి వచ్చిన బాలకృష్ణ మాట్లాడుతూ నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చిత్రానికి అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. […]పూర్తి వివరాలు ...