॥పల్లవి॥ఎఱుక గలుగునాఁ డెఱఁగఁడటామఱచినమేనితో మరి యఱిఁగీనాread॥చ1॥పటువైభవములఁ బరగేటినాఁడేతటుకున శ్రీహరిఁ దలఁచఁడటాకుటిలదేహియై కుత్తికఁ బ్రాణముతటతటన దరఁగఁ దలఁచీనా॥చ2॥ఆలుబిడ్డలతో మహసుఖ మందుచుతాలిమితో హరిఁ దలఁచఁడటావాలిన కాలుని వసమైనప్పుడుదాలు వెండఁగాఁ దలఁచీనా॥చ3॥కొఱఁతలేక తేఁకువఁ దా నుండేటి-తఱి వేంకటపతిఁ దలఁచఁడటామఱులు దేహియై మఱిచివున్నయడతఱచుటూరుపులఁ దలఁచీనా రాగము: ముఖారి రేకు: 0050-01 సంపుటము: 1-304 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ఘనమనోరాజ్యసంగతి చెలఁగినఁగానిజనుల కెప్పుడు నాత్మసౌఖ్యంబు లేదు॥చ1॥ప్రతిలేనిధైర్యంబు పదిలపరచినఁ గానిమతిలోనిపగవారిమద మణఁపరాదుమితిలేనిశాంతమనుమేఁటికైదువఁ గానిక్రితకంబువిషయముల గెలుపెరఁగరాదు॥చ2॥సొరిది నిర్మోహమనుజోడు దొడిగినఁ గానివెరపుడిగి మమతచే వెళ్లఁబడరాదుయిరవైన విజ్ఞానపింట నుండినఁ గానిఅరసి జగమెల్ల తానై యేలరాదు॥చ3॥యిన్నియునుఁ దిరువేంకటేశుఁ డిచ్చినఁ గానితన్నుఁదానెరిఁగి యాతనిఁగొలువరాదుకన్నులను వెలి లోను గలయఁజూచిన గానిసన్నంబుఘనమనెడిజాడ గనరాదు రాగము: సామంతం రేకు: 0049-06 సంపుటము: 1-303 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥కడుపెంత తాఁ గుడుచు కడుపెంత దీనికైపడనిపాట్ల నెల్లఁబడి పొరలనేలా॥చ1॥పరులమనసునకు నాపదలు గలుగఁగఁజేయఁబరితాపకరమైనబ్రదుకేలాసొరిది నితరుల మేలుచూచి సైఁపఁగలేకతిరుగుచుండేటి కష్ట దేహమిదియేలా॥చ2॥యెదిరి కెప్పుడుఁ జేయుహితమెల్లఁ దనదనుచుచదివిచెప్పనియట్టి చదువేలాపొదిగొన్నయాసలోఁ బుంగుడై సతతంబుసదమదంబై పడయుచవులు దనకేలా॥చ3॥శ్రీవేంకటేశ్వరుని సేవారతికిఁగాకజీవనభ్రాంతిఁ బడుసిరులేలాదేవోత్తముని నాత్మఁ దెలియనొల్లక పెక్కు_త్రోవ లేఁగిన దేహి దొరతనంబేలా రాగము: గుండక్రియ రేకు: 0049-05 సంపుటము: 1-302 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏదియునులేని దేఁటిజన్మమువేదాంతవిద్యావివేకి గావలెను॥చ1॥పరమమూ ర్తిధ్యానపరుఁడు గావలె నొండెపరమానందసంపద లొందవలెనుపరమార్థముగ నాత్మభావింపవలె నొండెపరమే తానై పరగుండవలెను॥చ2॥వేదశాస్త్రార్థకోవిదుఁడు గావలె నొండెవేదాంతవిదుల సేవించవలెనుకాదనక పుణ్యసత్కర్మి గావలె నొండెమోదమున హరిభక్తి మొగి నుండవలెను॥చ3॥సతతభూదదయావిచారి గావలె నొండెజితమైనయింద్రియస్థిరుఁడు గావలెనుఅతిశయంబగు వేంకటాద్రీశుసేవకులెగతియనుచు తనబుద్ధిఁ గలిగుండవలెను రాగము: నాట రేకు: 0049-04 సంపుటము: 1-301 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాటపూర్తి వివరాలు ...
అన్నమయ్య సంకీర్తనలలో పెద్దముడియం నృసింహుడు రాగము: సాళంగనాట రేకు: 0324-1 సంపుటము: 11-139 ॥పల్లవి॥ జయమాయ నీకు నాపె సరసములూ నయగారి ముడుయము నారసింహా ॥చ1॥మోము చూచి నీతోడ ముచ్చట లాడ వలసి కోమలి నీ తొడమీఁదఁ గూచున్నది ఆముకొని అట్టె మాట లాడ వయ్య ఆపెతోడ నామాట విని యిట్టె నారసింహా ॥చ2॥మన్నన నీ యలుకల మంకు దెలవ వలసి చన్ను లురమునఁ బెట్టి సత మైనది చెన్నుఁడ వాపె చనవు చెల్లించ వయ్య యిట్టె […]పూర్తి వివరాలు ...
గండికోట చెన్నకేశవుని సంకీర్తన – 3 చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వెలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడి ప్రణయ గాధను ఈ విధంగా స్తుతిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 1354-5 సంపుటము: 23-323 చెయ్యరాని చేఁతల వోచెన్నకేశ్వరా చేయం టేవు గండికోట […]పూర్తి వివరాలు ...
గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన – 2 చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వెలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: ముఖారి రేకు: 1009-2 సంపుటము: 20-50 చెల్లునా నీ కీపనులు చెన్న కేశా ‘చెల్లునా […]పూర్తి వివరాలు ...
సంకీర్తన:296 ‘రామభద్ర రఘువీర’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో॥పల్లవి॥ కౌసల్యానందవర్ధన ఘనదశరథసుత భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ రాసికెక్క కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా॥రామభద్ర॥ మారీచసుబాహు మర్దన తాటకాంతక దారుణవీరశేఖర ధర్మపాలక కారుణ్య రత్నాకర కాకాసుర వరద సారెకు వేదవిదులు జయవెట్టేరయ్యా ॥రామభద్ర॥ సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుటయోధ్యాపుర నిలయా యీతల శ్రీవేంకటాద్రి నిరవయిన […]పూర్తి వివరాలు ...
అప్పులేని సంసార మైనపాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన జాలు // పల్లవి // కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు చింతలేని యంబలొక్క చేరెడే చాలు జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు వింతలేని సంపదొక్క వీసమే చాలు // అప్పులేని // తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు // అప్పులేని // లంపటపడని మేలు లవలేసమే […]పూర్తి వివరాలు ...