॥పల్లవి॥ఎంత చదివిన నేమి వినిన తన-చింత యేల మాను సిరులేల కలుగు॥చ1॥ఇతర దూషణములు యెడసినఁగాకఅతికాముకుఁడుగాని యప్పుడు గాకమతిచంచలము గొంత మానినఁగాకగతి యేల కలుగు దుర్గతులేల మాను॥చ2॥పరధనములయాస పాసినఁగాకఅరిదినిందలులేనియప్పుడు గాకవిరసవర్తనము విడిచినఁగాకపరమేల కలుగు నాపదలేల మాను॥చ3॥వేంకటపతి నాత్మ వెదకినఁగాకకింక మనసునఁ దొలఁగినఁగాకబొంకుమాట లెడసిపోయినఁగాకశంకయాల మాను జయమేల కలుగు రాగము: సామంతం రేకు: 0010-02 సంపుటము: 1-62 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య సంకీర్తనలు
॥పల్లవి॥పదిలము కోట పగవారుఅదనఁ గాచుకొందు రాఱుగురు॥చ1॥ఇమ్మైఁ జెప్ప యిందరిచేతతొమ్మిదినెల్లఁ దోఁగినదికొమ్మతీరునఁ గుదురైనకోటదొమ్మికాండ్లై దుగు రుందురు॥చ2॥వొంటికాఁడు రాజు వుడుగక తమలోనవొంటనీనిమంత్రు లొక యిద్దరుదంటతనంబునఁ దమయిచ్చఁ దిరిగాడు-బంటు లేడుగురు బలవంతులు॥చ3॥కలవు తొమ్మిది కనుమల తంత్రమునిలుపఁగలిగినట్టినెరవాదులుతెలిసి కొనేటితిమ్మినాయఁడు చొచ్చెబలిసె యీకోట భయమేల రాగము: శంకరాభరణం రేకు: 0010-01 సంపుటము: 1-61 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏది చూచినా నీవే యిన్నియును మఱి నీవేవేదవిరహితులకు వెఱతు మటుగాన॥చ1॥ఇరవుకొని రూపంబులిన్నిటానుఁ గలనిన్నుఁబరికించవలెఁగాని భజియింపరాదుగరిమచెడి సత్సమాగంబు విడిచిన నీ_స్మరణ విజ్ఞానవాసన గాదుగాన॥చ2॥యిహ దేవతాప్రభలనెల్ల వెలుఁగుట నీకుసహజమనవలెఁగాని సరిఁ గొలువరాదుఅహిమాంశుకిరణంబు లన్నిచోట్లఁ బరగుగ్రహియింపరా దవగ్రాహములు గాన॥చ3॥యింతయునుఁ దిరువేంకటేశ నీవునికిఁ దగఁజింతింపవలెఁగాని సేవింపరాదుఅంతయు ననరుహమును నరుహంబనఁగరాదుఅంతవానికిఁ బరుల కలవడదుగాన రాగము: సామంతం రేకు: 0009-05 సంపుటము: 1-60 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥మదమత్సరము లేక మనసుపేదై పోపదరినయాసలవాఁడువో వైష్ణవుఁడు॥చ1॥ఇట్టునట్టుఁ దిరిగాడి యేమైనా జెడనాడిపెట్టరంటాఁ బోయరంటాఁ బెక్కులాడియెట్టివారినైనా దూరి యెవ్వరినైనఁ జేరివట్టియాసలఁ బడనివాడుఁవో వైష్ణవుఁడు॥చ2॥గడనకొరకుఁ జిక్కి కాముకవిద్యలఁ జొక్కినిడివి నేమైనాఁ గని నిక్కి నిక్కివొడలిగుణముతోడ వుదుటువిద్యలఁ జాలవడదాఁకి బడలనివాఁడువో వైష్ణవుఁడు॥చ3॥ఆవల వొరులఁ జెడనాడఁగ వినివినిచేవమీరి యెవ్వరినిఁ జెడనాడకకోవిదు శ్రీవేంకటేశుఁ గొలిచి పెద్దలకృపవావివర్తనగలవాడుఁవో వైష్ణవుఁడు రాగము: ఆహిరి రేకు: 0009-04 సంపుటము: 1-59 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పట్టవసముగానిబాలుఁడా పెనుఁ-బట్టపు బలువుఁడ బాలుఁడా॥చ1॥ఇరుగడ బహ్మయు నీశ్వరుఁడును నిన్నుసరుస నుతింప జఠరమునఅరుదుగ నుండి ప్రియంబున వెడలిన-పరమమూర్తివా బాలుఁడా॥చ2॥తల్లియుఁ దండ్రియుఁ దనియనిముదమునవెల్లిగ లోలో వెఱవఁగనుకల్లనిదురతోఁ గనుమూసుక రే-పల్లెలోఁ బెరిగిన బాలుఁడా॥చ3॥యేదెసఁ జూచిన నిందరి భయముల-సేదలు దేఱఁగఁ జెలగుచునువేదపల్లవపు వేంకటగిరిపైపాదము మోపిన బాలుఁడా రాగము: భైరవి-రచ్చెతాళం రేకు: 0009-04 సంపుటము: 1-58 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...
శ్రీరాగం, యేకతాళి॥పల్లవి॥విడుమనవో రోలు విడుమనవో వేగవిడుమనవో తల్లి వెఱచీ, నీబాలుడు॥చ1॥యెన్నఁడు గొల్లెతలయిండ్లు వేమారుఁ జొచ్చివెన్నలుఁ బాలును వెఱఁజఁడువన్నెలనీకోప మింత వద్దు నీకు నీయానకన్నుల నవ్వుల ముద్దుగారీ నీబాలుడు॥చ2॥సారేకు పెరుగులచాడెలూ నేఁడు మొదలూగోరయై కోలలఁ బగుల మొత్తఁడుకూరిమిలేక నీవు కోపగించఁగాఁ గన్నీరుజోరుగా రాలఁగా నిన్నే చూచీ నీబాలుఁడు॥చ3॥చాలు నీకోప మిది సరిలేనిమద్దులివిరోలనే యిట్లను విరుగఁద్రోయఁడుమేలిమివేంకటపతి మేటిఁనీకొమాఁరు డిదెకేలెత్తి నీకు మ్రొక్కెడి నిదె బాలుఁడు రాగము: తెలియదు రేకు: 0009-03 సంపుటము: 1-57 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నగుఁబాట్లఁ బడేనాజిహ్వపగటున నిదివో పావనమాయ॥చ1॥ఇల నిందరి నుతియించి పెంచువలెనలినలియైనది నా జిహ్వనలినోదరుశ్రీనామము దలఁచిన-ఫలమున కిదివో పావనమాయ॥చ2॥భ్రమఁబడి మాయపుపడఁతులతమ్మలునమలి చవులుగొనె నాజిహ్వఅమరవంద్యుఁడగుహరి నుతియించఁగప్రమదము చవిగొని పావనమాయ॥చ3॥నెలఁతలపలు యోనిద్రవనదులనునలుగడ నీఁదెను నాజిహ్వఅలసి వేంకటనగాధిపయనుచునుపలికినయంతనె పావనమాయ రాగము: ముఖారి రేకు: 0009-02 సంపుటము: 1-56 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏమి సేయవచ్చుఁ గర్మమిచ్చినంతేకాని లేదుతాముసేసినంత వట్టు తమకుఁ బోరాదు॥చ1॥ఇట్టునట్టు మిట్టిపడ్డ యించుకంతా లేదు, వీఁపుబట్టగట్ట మోపు మోఁచి పాటువడ్డా లేదుతట్టువడ లోకమెల్ల దవ్వుకొనినా లేదుతెట్టఁదెరువున నోరుదెరచినా లేదు॥చ2॥అడిగి పరులబదు కాసపడ్డా లేదు, భీతివిడిచి నెత్తుటఁదోగి వీరుఁడైనా లేదుఅడవులెల్లాఁ దిరిగి అలమటించిన లేదుయిడుమపాటుకుఁ జొచ్చి యియ్యకొన్నా లేదు॥చ3॥వచ్చివచ్చి వనితల వలపించుకొన్నా లేదుమెచ్చులగుఱ్ఱము నెక్కి మెరసినా లేదుయెచ్చరికఁ దిరువేంకటేశుఁ గొలువక వుంటేయిచ్చటనచ్చట సుఖ మించుకంతా లేదు రాగము: సామంతం రేకు: 0009-01 సంపుటము: 1-55 Tags: Annamacharya Keerthanalu, Telugu […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నీ కథామృతము నా నిరతసేవన నాకుచేకొనుట సకలసంసేవనం బటుగాన॥చ1॥ఇదియె మంత్రరాజము నాకు నేప్రొద్దు-నిదియె వేదసంహితపాఠముయిదియె బహుశాస్త్రమెల్లఁ జదువుట నాకు-నిదియె సంధ్య నాకిదియ జప మటుగాన॥చ2॥యిదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు-నిదియె దుఃఖవిరహితమార్గముయిదియె భవరోగహితభేషజము నాకు-నిదియె వుపనిషద్వాక్యపద్దతిగాన॥చ3॥యిదియె దానఫల మీఁజాలినది నాకుయిదియే తలఁపఁ బరహితకర్మముయిదియె తిరువేంకటేశ నీసంస్మరణ-మిదియె యిదియె ఇన్నియును నటుగాన రాగము: భూపాళం రేకు: 0008-06 సంపుటము: 1-54 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...