Tags :అన్నమయ్య సంకీర్తనలు

సంకీర్తనలు

ఇందిరానామ మిందరికి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇందిరానామ మిందరికికుందనపుముద్ద వో గోవిందis-aber.net॥చ1॥అచ్చుతనామము అనంతనామముఇచ్చినసంపద లిందరికినచ్చినసిరులు నాలుకతుదలుకొచ్చికొచ్చీ నోగోవిందా॥చ2॥వైకుంఠనామము వరదనామముఈకడనాకడ నిందరికివాకుఁదెరపులు వన్నెలు లోకాలఁగూకులు వత్తులు నోగోవిందా॥చ3॥పండరినామము పరమనామముఎండలువాపెడి దిందరికినిండునిధానమై నిలచినపేరుకొండలకోనేటివోగోవిందా రాగము: శుద్ధవసంతం రేకు: 0002-02 సంపుటము: 1-8 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సదా సకలము సంపదలే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥సదా సకలము సంపదలేతుద దెలియఁగ వలెఁ దొలఁగఁగవలయు॥చ1॥అహర్నిశమును నాపదలేసహించిన నవి సౌఖ్యములేయిహమున నవి యిందఱికినిమహిమ దెలియవలె మానఁగవలెను॥చ2॥దురంతము లివి దోషములేపరంపర లివి బంధములువిరసములౌ నరవిభవములౌ-సిరులే మరులౌ చిరుసుఖ మవును॥చ3॥గతి యలమేల్ మంగ నాంచారికిఁబతియగువేంకటపతిఁ దలఁచిరతు లెఱుఁగగవలె రవణము వలెనుహిత మెఱుఁగఁగవలె నిదె తనకు రాగము: శుద్ధవసంతం రేకు: 0002-01 సంపుటము: 1-7 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శుద్ధవసంతంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

మానుషము గాదు మఱి దైవికము గాని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥మానుషము గాదు మఱి దైవికము గానిరానున్నా అది రాకుమన్నఁ బోదు॥చ1॥అనుభవనకుఁ బ్రాప్తమైనదితనకుఁదానె వచ్చి తగిలికాని పోదు॥చ2॥తిరువేంకటగిరిదేవుని-కరుణచేతఁ గాని కలుష మింతయుఁ బోదు రాగము: గుండక్రియ రేకు: 0001-06 సంపుటము: 1-6 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

వేదం బెవ్వని వెదకెడిని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥వేదం బెవ్వని వెదకెడినిఆ దేవునిఁ గొనియాడుఁడీ॥చ1॥అలరిన చైతన్యాత్మకుఁడెవ్వఁడుకలఁ డెవ్వఁ డెచటఁ గలఁడనినతలఁతు రెవ్వనినిఁ దనువియోగదశయిల నాతని భజియించుఁడీ॥చ2॥కడఁగి సకలరక్షకుఁడిం దెవ్వఁడువడి నింతయు నెవ్వనిమయముపిడికిట తృప్తులు పితరులెవ్వనినిఁదడవిన, ఘనుఁడాతనిఁ గనుఁడీ॥చ3॥కదిసి సకలలోకంబులవారలుయిదివో కొలిచెద రెవ్వనినిత్రిదశవంద్యుఁడగు తిరువేంకటపతివెదకి వెదకి సేవించుఁడీ రాగము: పాడి రేకు: 0001-05 సంపుటము: 1-5 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏవం శ్రుతిమత మిదమేవ త- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఏవం శ్రుతిమత మిదమేవ త-ద్భావయితు మతఃపరం నాస్తి॥చ1॥అతుల జన్మభోగాసక్తానాంహిత వైభవసుఖ మిదమేవసతతం శ్రీహరిసంకీర్తనం త-ద్వ్యతిరిక్తసుఖం వక్తుం నాస్తి॥చ2॥బహుళమరణపరిభవచిత్తా నా-మిహపరసాధన మిదమేవఅహిశయనమనోహరసేవా త-ద్విహరణం వినా విధిరపి నాస్తి॥చ3॥సంసారదురితజాడ్యపరాణాంహింసావిరహిత మిదమేవకంసాంతక వేంకటగిరిపతేః ప్ర-శంసైవా పశ్చా దిహ నాస్తి రాగము: సామంతం రేకు: 0001-04 సంపుటము: 1-4 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

హీనదశలఁబొంది యిట్ల నుండుటకంటె – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥హీనదశలఁబొంది యిట్ల నుండుటకంటెనానావిధులను నున్ననాఁడే మేలు॥చ1॥అరుదైన క్రిమికీటకాదులందుఁ బుట్టిపరిభవములనెల్లఁ బడితిఁ గానియిరవైనచింత నాఁడింతలేదు యీ-నరజన్మముకంటె నాఁడే మేలు॥చ2॥తొలఁగక హేయజంతువులయందుఁ బుట్టిపలువేదనలనెల్లఁ బడితిఁగానికలిమియు లేమియుఁ గాన నేఁ డెఱిఁగినలఁగి తిరుగుకంటె నాఁడే మేలు॥చ3॥కూపనరకమున గుంగి వెనకకు నేఁబాపవిధులనెల్లఁ బడితిఁగానియేపునఁ దిరువేంకటేశ నా కిటువలెనాపాలఁ గలిగినాఁడే మేలు రాగము: దేసాక్షి రేకు: 0001-03 సంపుటము: 1-3 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, [&పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

వేదవేద్యులు వెదకేటిమందు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥వేదవేద్యులు వెదకేటిమందుఅదినంత్యములేని‌ ఆమందు॥చ1॥అడవిమందులుఁ గషాయములు నెల్లవారుకడగానక కొనఁగానుతొడిఁబడ నొకమందు దొరకె మాకు భువి-నడియాలమైనట్టి ఆమందు॥చ2॥లలితరసములుఁ దైలములు నెల్లవారుకలకాలము గొనఁగానుచెలువైన దొకమందు చేరె మాకు భువి-నలవిమీఱినయట్టియామందు॥చ3॥కదిసినజన్మరోగముల నెల్లవారుకదలలేక వుండఁగానుఅదన శ్రీతిరువేంకటాద్రిమీఁదిమందుఅదివో మాగురుఁడిచ్చె నామందు రాగము: దేసాక్షి రేకు: 0001-02 సంపుటము: 1-2 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదుకలికిమరుఁడు సేసినాజ్ఞ కడవఁగరాదురా॥చ1॥అంగడి కెత్తినట్టిదివ్వె లంగనముఖాంబుజములుముంగిటి పసిఁడికుంభములును ముద్దులకుచయుగంబులుయెంగిలిసేసినట్టితేనె లితవులైన మెఱుఁగుమోవులులింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు॥చ2॥కంచములోని వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలుయెంచఁగ నెండలోనీడలు యెడనెడకూటములుతెంచఁగరాని వలెతాళ్ళు తెలివిపడనిలేఁతనవ్వులుమంచితనములోని నొప్పులు మాటలలోనిమాటలు॥చ3॥నిప్పులమీఁద జల్లిననూనెలు నిగిడితనివిలేనియాసలుదప్పికి నేయిదాగినట్లు తమకములోనితాలిమిచెప్పఁగరానిమేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలుఅప్పనికరుణగలిగి మనుట అబ్బురమైనసుఖములు రాగము: సామంతం రేకు: 0001-01 సంపుటము: 1-1 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టుతక్కినవి యిన్నియును తలఁపు రేఁచెడిని॥చ1॥యెఱుఁగుమీ జీవుఁడా యింద్రియాలు సొమ్ము గావుగుఱియై మాయలలోనఁ గూడించే వింతెమఱవకు జీవుడా మనసు చుట్టము గాదుతెఱఁగొప్ప ఆసలానే తిప్పెడి దింతె॥చ2॥తెలుకో జీవుఁడా దేహమును నమ్మరాదువలసితే నుండుఁ బోవు వన్నెవంటిదితలఁచుకో జీవుడా ధనము దనిచ్చ గాదుపలులంపటములచేఁ బరచెడి దింతె॥చ3॥సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదుబిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతెయిమ్ముల శ్రీవేంకటేశ డితనిమూలమే యింతనెమ్మిఁ దానే గతియంటే నిత్యమవు నింతే రాగము: రామక్రియ రేకు: 0099-06 సంపుటము: 1-500 Tags: Annamacharya […]పూర్తి వివరాలు ...

error: