॥పల్లవి॥ఘోరవిచారణ నారసింహ నీ-వీరూపముతో నెట్లుండితివో॥చ1॥ఉడికెడికోపపుటూర్పులఁ గొండలుపొడివొడియై నభమునకెగయబెడిదపురవమున పిడుగులు దొరుగఁగయెడనెడ నీవపుడెట్లుండితివో॥చ2॥కాలానలములు గక్కుచు నయన-జ్వాలల నిప్పులు చల్లుచునుభాలాక్షముతో బ్రహ్మండకోట్ల-కేలికవై నీవెట్లుండితివో॥చ3॥గుటగుటరవములు కుత్తికఁ గులుకుచుగిటగిటఁ బండ్లు గీఁటుచునుతటతటఁ బెదవులు దవడలు వణఁకఁగఇటువలె నీవపుడెట్లుందితివో॥చ4॥గోళ్ళమెఱుఁగుల కొంకులపెదపెద-వేళ్ళ దిక్కులు వెదకుచునునీళ్ళతీగెలు నిగుడఁగ నోర ను-చ్చిళ్ళు గమ్మఁగ నెట్లుండితివో॥చ5॥హిరణ్యకశిపుని నేపడఁచి భయం-కరరూపముతోఁ గడుమెరసితిరువేంకటాగిరిదేవుఁడ నీవిఁకయిరపుకొన్ననాఁడెట్లుందితివో రాగము: నాట రేకు: 0011-02 సంపుటము: 1-68 Tags: Annamacharya పూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య పాటలు
॥పల్లవి॥అలరఁ జంచలమైనఆత్మలందుండ నీయలవాటు సేసె నీవుయ్యాలపలుమారు నుచ్ఛ్వాసపవనమందుండ నీ భావంబు దెలిపె నీవుయ్యాల॥చ1॥ఉదయాస్త శైలంబు లొనరఁ గంభములైనఅదన నాకాశపద మడ్డదూలంబైన అఖిలంబునిండె నీవుయ్యాలపదిలముగ వేదములు బంగారుచేరులై పట్ట వెరపై తోఁచె నుయ్యాలవదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె నుయ్యాల॥చ2॥మేలుకట్లయి మీకు మేఘమండలమెల్ల మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాలనీలశైలమువంటి నీమేని కాంతికిని నిజమైన తొడవాయె నుయ్యాలపాలిండ్లు గదలఁగా బయ్యదలు రాఁపాడ భామినులు వడినూఁచు నుయ్యాలవోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల॥చ3॥కమలకును భూసతికి కదలు కదలుకుమిమ్ముఁ గౌఁగిలింపఁగఁ […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఈ పాదమేకదా యిలనెల్లఁ గొలిచినదియీ పాదమే కదా ఇందిరా హస్తముల కితవైనది॥చ1॥ఈ పాదమేకదా ఇందరును మొక్కెడిదియీ పాదమే కదా యీగగనగంగ పుట్టినదియీ పాదమే కదా యెలమిఁ బెంపొందినదియీ పాదమే కదా యిన్నిటాకి నెక్కుడైనది॥చ2॥యీ పాదమే కదా యిభరాజు దలఁచినదియీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినదియీ పాదమే కదా యీబ్రహ్మ గడిగినదియీ పాదమే కదా యెగసి బ్రహ్మండమంటినది॥చ3॥యీ పాదమే కదా యిహపరము లొసగెడిదియీ పాదమే కదా ఇల నహల్యకుఁ గోరికైనదియీ పాదమే కదా యీక్షింప దుర్లభముయీ పాదమే కదా […]పూర్తి వివరాలు ...
కన్నడ గౌళ॥పల్లవి॥తనకర్మవశం బించుక,దైవకృతం బొకయించుకమనసు వికారం బించుక,మానదు ప్రాణులకు॥చ1॥ఈదైన్యము లీహైన్యము లీచిత్తవికారంబులుయీదురవస్థలు గతులును యీలంపటములునుయీదాహము లీదేహము లీయను బంధంబులు మరియీదేహముగలకాలము యెడయవు ప్రాణులకు॥చ2॥యీచూపులు యీతీపులు నీనగవులు నీతగవులు-నీచొక్కులు నీపొక్కులు నీ వెడయలుకలునుయీచెలుములు నీబలువులు నీచనవులు నీఘనతలు-నీచిత్తముగలకాలము యెడయవు ప్రాణులకు॥చ3॥యీవెరవులు నీయెరుకవులు యీతలఁపులు నీతెలువులుదైవశిఖామణి తిరుమల దేవునిమన్ననలుదైవికమున కిటువగనక తనతలఁ పగ్గలమైననుదైవము తానౌ తానే దైవంబవుఁగాన రాగము: తెలియదు రేకు: 0010-05 సంపుటము: 1-65 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఈ విశ్వాసంబు యెవ్వరికిఁ దోఁప దిదిపావనుల హృదయమునఁ బ్రభవించుఁగానిని॥చ1॥ఇమ్మయినపాపంబు లెన్నివలసినఁ బ్రాణిసమ్మతంబున జేయఁ జాలుఁగా కేమికుమ్మరికి నొకయేఁడు గుదియ కొకనాఁడవునునమ్మితలఁ చినవిష్ణునామంబుచేత॥చ2॥కొదలేనిదురితములు కొండలునుఁ గోట్లునుచెదర కెప్పుడుఁ బ్రాణి చేయుగా కేమిపొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌనుహృదయంబు హరిమీఁద నుండినంతటను॥చ3॥సరిలేని దుష్కర్మసంఘములు రాసులైపెరుగఁ జేయుచు ప్రాణి పెంచుఁగాకేమి?బెరసి కొండలమీఁదఁ బిడుగువడ్డట్లౌనుతిరువేంకటాచలాధిపునిఁ దలఁచినను రాగము: శ్రీరాగం రేకు: 0010-04 సంపుటము: 1-64 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల_కీలువదలె సౌజన్యము కిందయిపోయినది॥చ1॥ఇందెక్కడిసంసారం, బేదెసఁ జూచిన ధర్మముకందయినది,విజ్ఞానము కడకుఁ దొలంగినది,గొందులు దరిఁబడె, శాంతము కొంచెంబాయ,వివేకముమందుకు వెదకినఁ గానము మంచితనంపుఁబనులు॥చ2॥మఱి యిఁక నేఁటివిచారము, మాలిన్యంబైపోయిన_వెఱుకలు, సంతోషమునకు నెడమే లేదాయ,కొఱమాలెను నిజమంతయు,కొండలకేఁగెను సత్యము,మఱఁగైపోయను వినుకులు, మతిమాలెను తెలివి॥చ3॥తమకిఁక నెక్కడిబ్రదుకులు, తడఁబడె నాచారంబులు,సమమైపోయిన వప్పుడె జాతివిడంబములు ,తిమిరంబింతయుఁ బాపఁగఁ దిరువేంకటగిరిలక్ష్మీ-రమణుఁడు గతిదప్పను కలరచనేమియు లేదు రాగము: సామంతం రేకు: 0010-03 సంపుటము: 1-63 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎంత చదివిన నేమి వినిన తన-చింత యేల మాను సిరులేల కలుగు॥చ1॥ఇతర దూషణములు యెడసినఁగాకఅతికాముకుఁడుగాని యప్పుడు గాకమతిచంచలము గొంత మానినఁగాకగతి యేల కలుగు దుర్గతులేల మాను॥చ2॥పరధనములయాస పాసినఁగాకఅరిదినిందలులేనియప్పుడు గాకవిరసవర్తనము విడిచినఁగాకపరమేల కలుగు నాపదలేల మాను॥చ3॥వేంకటపతి నాత్మ వెదకినఁగాకకింక మనసునఁ దొలఁగినఁగాకబొంకుమాట లెడసిపోయినఁగాకశంకయాల మాను జయమేల కలుగు రాగము: సామంతం రేకు: 0010-02 సంపుటము: 1-62 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పదిలము కోట పగవారుఅదనఁ గాచుకొందు రాఱుగురు॥చ1॥ఇమ్మైఁ జెప్ప యిందరిచేతతొమ్మిదినెల్లఁ దోఁగినదికొమ్మతీరునఁ గుదురైనకోటదొమ్మికాండ్లై దుగు రుందురు॥చ2॥వొంటికాఁడు రాజు వుడుగక తమలోనవొంటనీనిమంత్రు లొక యిద్దరుదంటతనంబునఁ దమయిచ్చఁ దిరిగాడు-బంటు లేడుగురు బలవంతులు॥చ3॥కలవు తొమ్మిది కనుమల తంత్రమునిలుపఁగలిగినట్టినెరవాదులుతెలిసి కొనేటితిమ్మినాయఁడు చొచ్చెబలిసె యీకోట భయమేల రాగము: శంకరాభరణం రేకు: 0010-01 సంపుటము: 1-61 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏది చూచినా నీవే యిన్నియును మఱి నీవేవేదవిరహితులకు వెఱతు మటుగాన॥చ1॥ఇరవుకొని రూపంబులిన్నిటానుఁ గలనిన్నుఁబరికించవలెఁగాని భజియింపరాదుగరిమచెడి సత్సమాగంబు విడిచిన నీ_స్మరణ విజ్ఞానవాసన గాదుగాన॥చ2॥యిహ దేవతాప్రభలనెల్ల వెలుఁగుట నీకుసహజమనవలెఁగాని సరిఁ గొలువరాదుఅహిమాంశుకిరణంబు లన్నిచోట్లఁ బరగుగ్రహియింపరా దవగ్రాహములు గాన॥చ3॥యింతయునుఁ దిరువేంకటేశ నీవునికిఁ దగఁజింతింపవలెఁగాని సేవింపరాదుఅంతయు ననరుహమును నరుహంబనఁగరాదుఅంతవానికిఁ బరుల కలవడదుగాన రాగము: సామంతం రేకు: 0009-05 సంపుటము: 1-60 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...