Tags :అన్నమయ్య పాటలు

సంకీర్తనలు

అంగనలాల మనచే నాడించుకొనెఁగాని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అంగనలాల మనచే నాడించుకొనెఁగానిసంగతెఱిఁగిన నెరజాణఁ డితఁడే॥చ1॥వొడలులేనివాని కొక్కఁడే తండ్రాయఁగానితడయక పురుషాత్తముఁ డితఁడేబడబాగ్ని జలధికిఁ బాయకల్లుఁడాయఁగానివెడలించె నమృతము విష్ణుఁ డితడే॥చ2॥పులిగూడుదిన్న వానిపొం దొక్కటే సేసేఁగానినలువంక లక్ష్మీనాథుఁ డితఁడేచలికిఁ గోవరివానిసరుస బావాయఁగానిపలుదేవతలకెల్ల ప్రాణబంధుఁ డితఁడే॥చ3॥యెక్కడో గొల్లసతుల కింటిమగఁడాయఁగానితక్కక వెదకే పరతత్వ మితఁడేమిక్కిలి శ్రీవేంకటాద్రిమీఁద మమ్ము నేలెఁగానితక్కక వేదము చెప్పే దైవమీతఁడే రాగము: శంకరాభరణం రేకు: 0092-02 సంపుటము: 1-454 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నవనారసింహ నమో నమో – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నవనారసింహ నమో నమోభవనాశితీర యహోబలనారసింహ॥చ1॥సతతప్రతాపరౌద్రజ్వాలానారసింహవితతవీరసింహవిదారాణాఅతిశయకరుణ యోగానంద నరసింహమతి శాంతపు కానుగుమాని నారసింహ॥చ2॥మరలి బీభత్సపుమట్టెమళ్ల నరసింహనరహరి భార్గోటి నారసింహపరిపూర్ణ శృంగార ప్రహ్లద నరసింహసిరుల నద్భుతపు లక్ష్మీ నారసింహ॥చ3॥వదనభయానకపు వరాహ నరసింహచెదరని వైభవాల శ్రీనరసింహఅదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతిపదివేలురూపముల బహునారసింహ రాగము: నాట రేకు: 0092-01 సంపుటము: 1-453 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాటపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

రెండుమూలికలు రేయిఁబగలు నున్నవి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥రెండుమూలికలు రేయిఁబగలు నున్నవిఅండదేహమం దొకటి అతుమలో నొకటి॥చ1॥యిదివో రసబద్ధము యింద్రియములు మేనిలోపదిలముగా నిలిపి బంధించుటఅదివో వేధాముఖ, మంతరంగపుమనసుచెదరకుండాఁ జొనిపి శ్రీహరిఁదలఁచుట॥చ2॥తారవిద్య గంటిమి తగిలి నాసాగ్రమందుమేరతో ద్రిష్టినిలిపి మేలుఁబొందుటచేరువ సువర్ణవిద్య, చిత్తములోఁ బ్రణవముధీరత నాదము సేసిఁ దేవునిఁ బొగడుట॥చ3॥పుటజయమాయ నిట్టె పుణ్యపాపము లందులోకుటిలపుఁగోరికల కొన దుంచుటయిటులనే శ్రీవేంకటేశుఁ డిందిరయునుఅటు ప్రక్రృతిపురుషులనుటొరవచ్చుట రాగము: గౌళ రేకు: 0091-06 సంపుటము: 1-452 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

వెలుపలెల్ల తనలోనుగాక తను విడువదువెడమాయా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥వెలుపలెల్ల తనలోనుగాక తను విడువదువెడమాయానలువున యోగీంద్రులెల్ల మునునడచినమార్గంబు॥చ1॥జీవము నిర్జీవముగాక సిద్ధించదు పరమువావులెల్ల నొకవావిగాక మఱీ వదలదు ప్రపంచముభావంబెల్ల నభావముగాక పాయదు కర్మంబుదైవజ్ఞులు మును నడచి రిదియపో తప్పనిమార్గంబు॥చ2॥మాటలెల్లఁ గడమాటలుగాక మాయదు మలినంబుకూటంబులు కాలకూటంబుగాక కొనకెక్కదు భవముచాటుఁదృష్ణ లగచాటునఁబడక చాలదు సౌఖ్యంబుతేటగా మును పెద్ద లివియపో తేర్చినమార్గంబు॥చ3॥గుణములెల్ల నిర్గుణముగాక తలకూడదు శాంతంబుఅనువున కనువై అంతయుఁ దాగాక ఆనందము లేదుప్రణుతింపఁగ శ్రీవేంకటరమణుని బహుళమహిమెల్లాగణనకెక్కఁగా పురాతనులు మును కడకట్టినమతము రాగము: లలిత రేకు: 0091-05 సంపుటము: 1-451 Tags: Annamacharya Keerthanalu, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కలది గలట్టే కర్మఫలంబులు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥కలది గలట్టే కర్మఫలంబులునిలిపతిమా నేము నిమ్మకు బులుసు॥చ1॥యెంత సేసినా యిహమున జీవికిచెంత నజుఁడు వ్రాసిన కొలఁదేవంతల ముంటికి వాఁడి వెట్టితిమూకొంతతీపు చెఱకుకుఁ జల్లితిమా॥చ2॥ఘనముగ బుద్దులు గఱపిన దేహికిమును నోఁచిన నోముఫలంటేనినుపుఁ దెంకాయకు నీరు నించితిమావొనర వేమునఁ జేఁదు నిచితిమా॥చ3॥యిరవుగ శ్రీవేంకటేశుఁడే ప్రాణికికెరలి భాగ్య మొసఁగినయంతేమరువమునకు బరిమళము సేసితిమాపెరిగేటి యడవులు పెంచితిమా రాగము: లలిత రేకు: 0091-04 సంపుటము: 1-450 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చదువులోనే హరిని జట్టిగొనవలెఁగాక – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥చదువులోనే హరిని జట్టిగొనవలెఁగాకమదముగప్పినమీద మగుడ నది గలదా॥చ1॥జడమతికి సహజమే సంసాయాతన యిదికడు నిందులోఁ బరము గడియించవలెఁగాకతొడరి గాలప్పుడు తూర్పెత్తక తానువిడిచి మఱచిన వెనక వెదకితేఁ గలదా॥చ2॥భవబంధునకు విధిపాపపుణ్యపులంకెతివిరి యిందునే తెలివి తెలుసుకోవలెఁగాకఅవల వెన్నెలోనె అల్లు నేరేళ్లింతేనివిరి నిన్నటివునికి నేఁటికిఁ గలదా॥చ3॥దేహధారికిఁ గలదే తెగనియింద్రియబాధసాహసంబున భక్తి సాధించవలెఁగాకయీహలను శ్రీవేంకటేశుదాసులవలనవూహించి గతిగానక వొదిఁగితేఁ గలదా రాగము: మాళవిగౌళ రేకు: 0091-03 సంపుటము: 1-449 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

మరలి మరలి జయమంగళము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥మరలి మరలి జయమంగళముసొరిది నిచ్చలును శుభమంగళము॥చ1॥కమలారమణికి గమలాక్షునకునుమమతల జయజయమంగళముఅమరజననికిని అమరవంద్యునకుసుముహర్తముతో శుభమంగళము॥చ2॥జలధికన్యకును జలధిశాయికినిమలయుచును శుభంమంగళముకలిమికాంత కాకలికివిభునికినిసుళువులయారతి శుభమంగళము॥చ3॥చిత్త జుతల్లికి శ్రీవేంకటపతికిమత్తిల్లినజయం మంగళముయిత్తలనత్తల యిరువురకాఁగిటిజొత్తులరతులకు శుభమంగళము రాగము: రామక్రియ రేకు: 0091-02 సంపుటము: 1-448 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తప్పఁ దోయవే దైవశిఖామణి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥తప్పఁ దోయవే దైవశిఖామణియిప్పుడు నీకృప నెనసితి నేను॥చ1॥అనలముఁ బొడగని యటునిటు మిడుతలుకినిసి యందు మగ్గినయట్లుఅనువగువిజ్ఞాన మాత్మ వెలుఁగఁగమొనసి యింద్రియములు మూఁగీ నాకు॥చ2॥అఱిముఱిఁ గమలము లటు వికసించినమెఱసి తుమ్మిదలు మించుగతితఱి నాహృదయము తగవికసించినతఱమీ నజ్ఞానతమ మది నాకు॥చ3॥యీరీతి శ్రీవేంకటేశ్వర యిన్నియునూరకే యుండఁగా నొదిఁగియుండెనేరిచి నీభక్తి నిలుపఁగ మదిలోచేర గతిలేక చిమిడీ నదివో రాగము: శ్రీరాగం రేకు: 0091-01 సంపుటము: 1-447 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

మఱియు మఱియు నివె మాపనులు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥మఱియు మఱియు నివె మాపనులుమెఱసితి మిందే మిక్కిలిని॥చ1॥నారాయణునకు నమస్కారముధారుణీపతికిని దండముశ్రీరమణునకును జేరి శరణ్యమువారిధిశాయికి వరుస జోహారు॥చ2॥రామకృష్ణులకు రచనలబంటనుదామోదరునకు దాసుఁడనువామనమూర్తికి వాకిటిగొల్లనుసోమర్కనేత్రునిసొరిదిలెంకను॥చ3॥గోవిందునికే కొలువులు సేతుముదేవొ త్తముబడిఁ దిరుగుదుముభావజగురునకు పంపునడతుముశ్రీ వేంకటపతి సేవింతుము రాగము: పాడి రేకు: 0090-06 సంపుటము: 1-446 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడిపూర్తి వివరాలు ...

error: