॥పల్లవి॥పరులసేవలు చేసి బ్రదికేరటాసిరివరుదాసులు సిరులందు టరుదా॥చ1॥కోరి వొక నరునిఁ గొలిచిన వారలుదీరులై సలిగెలఁ దిరిగేరటకూరిమి బ్రహ్మండ కోటులేలెడివాని-వార లింతటఁ జనవరులౌ టరుదా॥చ2॥చేకొన్న తుమ్మిద చేపడ్డ కీటము –లాకడఁ దుమ్మిదలయ్యీనటశ్రీకాంతుని పాదసేవకులగు వార –లేకులజు లయినా నెక్కుడౌ టరుదా॥చ3॥ధరణీశు నాజ్ఞల తమదేశములందుసిరులనాణెపు ముద్ర చెల్లీనటతిరువేంకటాద్రి శ్రీదేవుని ముద్రలుధరియింపఁగా నింతటఁ జెల్లు టరుదా రాగము: దేసాళం రేకు: 0081-03 సంపుటము: 1-390 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య పాటలు
॥పల్లవి॥పనిమాలినట్టి వట్టి పఱఁదుగాక మాకుననిచి యిదియు నొక్కనగుఁబాట్లా॥చ1॥కన్నవారినెల్లా వేఁడేకష్టమే దక్కుటగాకపన్ని దైవమియ్యనిది పరులిచ్చేరాయెన్నికతోఁ దేహమిచ్చె నిహమెల్లాఁ జెందనిచ్చెవున్నవారింతటి పని కోపఁగలరా॥చ2॥బడలి తానెందైనాఁ బడ్డపాటే దక్కెఁగాకకడఁగి రానిది దే నొక్క రివసమాకడుపులో నుండఁగానే కలవి నుదుట వ్రాసెతడవి దైవముచేఁత దాఁట వసమా॥చ3॥దెప్పరపు సంపదకుఁ దిమ్మటలే దక్కెఁగాకయెప్పుడూ శ్రీవేంకటేశుఁడీక మానీనాచప్పుడుగా నతనికే శరణన్న జాలుఁగాకతప్పులును వొప్పులు నాతనివే కావా రాగము: సాళంగం రేకు: 0081-02 సంపుటము: 1-389 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥వీనిఁ జూచియైన నేము విరతిఁబొందగలేముపూని మాబ్రదు కిందుఁబోలదాయఁగా॥చ1॥పరుల వేడఁగబోవు పరనిందకుఁ జొరవుపరపురుషార్థమే ఫలవృక్షతతులెల్లనరులమై ఘనులమై నానాబుద్ధు లెఱిఁగిపొరి మాబ్రదుకు లిందుఁబోలదాయఁగా॥చ2॥కామక్రోధాదులు లేవు కామతత్వ మెఱఁగవుకామించినట్లవు నెక్కడనైనా శిల లివిదీమసము గలిగియుఁ దెలివి గలిగియునుభూమిలో మాబ్రదు కిందుఁబోలదాయఁగా॥చ3॥వొకరిఁ గొలువఁబోవు వొకపంట సేయఁబోవువొకమానిగడు చేరివుండు పక్షు లాడనాడవొక శ్రీ వేంకటపతి నమ్మియుండలేముమొకెమో మాబ్రదు కిందుఁబోలదాయఁగా రాగము: దేసాళం రేకు: 0081-01 సంపుటము: 1-388 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కోరు వంచరో కోటారుఆరసి మనసా అంతరాత్మకు॥చ1॥కొండలపొడవులు కోరికకుప్పలుపండినపంటలు భవము లివినిండినరాసులు నిజకర్మంబులుఅండనె యివె మాయారంభములు॥చ2॥వెలిధాన్యంబులు విషయపురాసులుపొలివారేటివూరుపుగములుకలుషపుమదమున కావుగప్పినవిఅలవిమీర మాయారంభములు॥చ3॥బడి నింద్రియములబంతులు నురిపికడురతుల దండగట్టలతోయెడనెడ శ్రీవేంకటేశుమహిమ లవేఆడియాలపుమాయారంభములు రాగము: ఆహిరి రేకు: 0080-06 సంపుటము: 1-387 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥అన్నిటా నీ వంతర్యామివి అవుట ధర్మమే అయినానుయెన్నఁగ నీవొక్కఁడవే గతియని యెంచికొలుచుటే ప్రపన్నసంగతి॥చ1॥యేకాంతంబున నుండినపతిని యెనసిరమించుటే సతిధర్మంబులోకమురచ్చలోనుండినపతి లోఁగొని పైకొని రానట్లుయీ కొలఁదులనే సర్వదేవతలయిన్ని రూపులై నీ వున్నప్పుడుకై కొని నిను బహుముఖములఁగొలుచుట గాదు పతివ్రత వ్రత ధర్మంబు॥చ2॥పూనిన బ్రాహ్మణుల లోపలనే నినుఁ బూజించుట వేదోక్తధర్మముశ్వానకుక్కుటాదులోపల నిను సరిఁ బూజించఁగరానట్లు,యీనియమములనె ప్రాకృతజనులను యీశ్వర నీశరణాగత జనులనుకానక, వొక్కట సరిగాఁజూచుట కాదఁ వివేకధర్మంబు॥చ3॥శ్రీ వేంకటపతిగురువనుమతినే నేవే నాకును శిష్యధర్మముఆవలనీవల నితరమార్గములు యాత్మలోన రుచిగానట్లుభావింపఁగ సకలప్రపంచమును బ్రహ్మం సత్యజ్ఞానమనంతముకైవశమై యిన్నిటా […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥అంతయు నీవే హరి పుండరీకాక్షచెంత నాకు నీవే శ్రీరఘురామా॥చ1॥కులమును నీవే గోవిందుఁడా నా-కలిమియు నీవే కరుణానిధీ,తలఁపును నీవే ధరణీధరా ,నా-నెలవును నీవే నీరజనాభా॥చ2॥తనువును నీవే దామోదరా, నా-మనికియు నీవే మధుసూధనావినికియు నీవే విట్ఠలుఁడా,నా-వెనకముందు నీవే విష్ణుదేవుఁడా॥చ3॥పుట్టుగు నీవే పురుషోత్తమా కొననట్ట నడుము నీవే నారాయణా,యిట్టె శ్రీవేంకటేశ్వరుఁడా నాకునెట్టన గతి యింక నీవే నీవే రాగము: పాడి రేకు: 0080-04 సంపుటము: 1-385 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావుయిందరిలోపల నీవెడమాయలు యేగతిఁ దెలిసే నేనయ్యా॥చ1॥దూరము కర్మమునకు జ్ఞానము తోడనే వొండకటికినిదూరము పరమునకు బ్రపంచము తొలుత విరుద్ధంబు;దూరము విరతికి సంసారము; తుదమొదలే లేదు;యీరీతుల నీ వెడమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా॥చ2॥కూడదు దేహమునకు నాత్మకు గోత్రవిరోధం; బెన్నఁడునుకూడదు కోపమునకు శాంతము గుణావగుణములను;కూడదు బంధమునకు మోక్షము కోరికలే కట్లుగాన;యేడ గొలఁదిగా శ్రీహరిమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా॥చ3॥శ్రీ వేంకటపతి నన్నీ గతిఁ జిక్కించితి వీజగమునను;భావింపఁగరాదు నీమహిమ బహుముఖములయర్ధముగాన;యేవిధమును నేఁటికి నాకిఁక యెందెందని తగిలెద నేనుదైవికమగు […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥అభయమభయమో హరి నీకువిభుఁడ వింతటికి వెర విఁక నేది॥చ1॥జడిగొని మదిలో శాంతము నిలువదుకడుఁగడు దుస్సంగతి వలనయిడుమలేని సుఖ మించుక గానముఅడియాసల నా యలమటవలన॥చ2॥తలఁపులోన నీతత్వము నిలువదుపలు లంపటముల భ్రమవలనకలిగిన విజ్ఞాన గతియును దాఁగెనువెలి విషయపు పిరివీకుల వలన॥చ3॥పక్కనఁ బాపపు బంధము లూడెనుచిక్కక నినుఁ దలఁచిన వలనచిక్కులు వాసెను శ్రీవేంకటపతినిక్కము నా కిదె నీకృప వలన రాగము: పాడి రేకు: 0080-02 సంపుటము: 1-383 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥దేవ నీమాయతిమిర మెట్టిదో నా-భావము చూచి గొబ్బనఁ గానవే॥చ1॥వెడదు:తడవి విరతిఁబొంది తలఁగలేనుఆడియాసలఁ దిరిగి అలుయుచుండుదుఁగానిమడి దొసకుల నివి మానలేను॥చ2॥హేయము స్త్రీసుఖమని యెఱుఁగుచుండుదుఁగానిపాయపుమదముచేతఁ బాయలేనుపాయనిపాపాలు చూచి భయమందుచుందుఁగానివోయయ్య యివి సేయకుండలేను॥చ3॥కలకాల మిన్నియును గందు విందుఁగాని మఱియెలమి నొక్కటనైన యెచ్చరలేనుబలిమి శ్రీవేంకటేశ బంధముక్తునిఁజేసితలఁపులో నెలకొని దయఁజూడవయ్యా రాగము: ఆహిరి రేకు: 0080-01 సంపుటము: 1-382 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరిపూర్తి వివరాలు ...