రాయల సీమజనాల్లో రగత మురికిపారాల రాజకీయ రంకుల్ని ఈడ్చి ఈడ్చి తన్నాల. ఈపొద్దు ఇంటిలోన రేపేమో మంటిలోన ఏదొకటో కాకుంటే మనకింకా ముక్తి లేదు. ఒకకంటికి సున్నము వెన్న మరో కంటికి ఆదినుండి మనసీమకు అంతులేని అన్యాయం. ప్రాజెక్టును ఇస్తామని మదరాసునుండి పిల్చినారు చుక్క నీరు ఇవ్వకుండ కిందకు మళ్లించినారు . సీమ రైతు గుండెలన్ని ముళ్లచెట్ల కంపలాయె ఎన్నాళ్లీఅగచాట్లు అన్నన్నా తిరగబడు. రైతు కంటి నీళ్లతో పంటలెలా పండుతాయి మభ్య పెట్టు మాటలతో పరిపాలనెలా సాగుతుంది. […]పూర్తి వివరాలు ...
తోరణాలు దిగేయండి పావురాలు ఎగిరేయండి బారులుగా కూరండి మాలలుగా మారండి అడుగుల మడుగై అరవండి జోరుగా జై రాయలసీమ ( నేను అరుచ్చనా, అన్నా ఇనపచ్చాంది గదా? మళ్ళా అర్సాల్నా? ) జై జై రాయలసీమ ( ఇది మీరు -నాకినపల్యా, ఎది ఇంగోసారి, గా……ట్టిగ, గూబ పగల్లాల కొడుకులకు ) ఇంగా ఏముంది ఎదురుజూడ్దానికి? కొట్టం కాలిపాయ బతుకు బుగ్గైపాయ కరువు పుండాయ బతుకు ఎండిపాయ నిండా మునిగినాక సలేంది, గిలేంది! ఇంగ మన బాట […]పూర్తి వివరాలు ...
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయావా? గణనాయకా ఈ అభాగ్యుల క్షమించు..! ఉండ్రాళ్ళు తినే ఓ బొజ్జ గణపయ్యా..! గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? మా గుండె చప్పుళ్ళన్నీ ఆర్తనాదాలై అధికారాన్ని అంధత్వం ఆవరించినవేళ కన్నీళ్ళే ఇంకిపోయిన ఈ సీమలో నిమజ్జనానికి మాత్రం నీళ్ళీక్కడివి? ఆప్యాయతలకూ అనురాగాలకూ కొదువలేని ఈ రాయలసీమలో ఎండిన చెరువులూ, బావులూ గుండెలు బాదుకునే జీవులూ ఎడారిలో ఎండమావులై తడారిపోయిన గొంతులతో ఆకాశం దిక్కు ఆశగా చూస్తూ ఆశ సచ్చి అంతమై పోతున్నారెందరో! గుక్కెడు నీళ్ళకు […]పూర్తి వివరాలు ...
పరుగులపోటీలాగ కథల పోటీ ఏంటి? సృజనాత్మకతకు పోటీ ఉంటుందా? అసలు సృజన అనేదే పోటీ లేనిది. కాకపోతే ఎవరి సృజన వాళ్లది. ఒకటి తక్కువ కాదు. మరొకటి ఎక్కువా కాదు. కథల పోటీల గురించి తలచినప్పుడల్లా నాకు సొదుం జయరాం (చనిపోయి ఎక్కడున్నాడో మహానుభావుడు. ఊరిపక్కనే ఉన్నా ఒక్కసారి కూడా కలవలేకపోయాను) గుర్తుకొస్తాడు. అతను రాసిన “పుణ్యకాలం మించిపోయింది’ అనే కథ ఇలా ఉంటుంది : పోటీలకొచ్చే డబ్బు మీద ఆశతో ఒక మధ్యతరగతి పెళ్లాం రచయితను […]పూర్తి వివరాలు ...
జండా యెగరేసి పప్పూబెల్లాలు పంచిపోవడం కాదు వ్యధల సీమలో వెలుగుపూలు పూయించే అజండా యేమిటో విప్పి చెప్పు సమన్యాయం సమాధయి సమదూరం వెక్కిరిస్తోంది ….. రాజధానే కాదు అన్నిటి ప్రవాహమూ అటువైపే … వికేంద్రీకరణంటే …. ఖాళీ గిన్నెలో తలావొక మెదుకు విదిల్చడం కాదు అడుగుతున్నది భిక్ష అంతకంటే కాదు…. ఒప్పందాలకు నీళ్ళొదిలినందుకే కదా ఆత్మ ఒకటైనా దేహాలు విడివడింది ఆ గాయాల తడి ఇంకా ఆరనే లేదు మళ్ళా అదే పడగ నీడ అదే విక్రుత […]పూర్తి వివరాలు ...
వర్గం: హాస్య గీతాలు దాని సొమ్మేమైన తింటీనా దానెబ్బ గంటేమైన తింటీనా దీని సొమ్మేమైన తింటీనా ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా దాని సొమ్మేమైన తింటీనా దానెబ్బ గంటేమైన తింటీనా దీని సొమ్మేమైన తింటీనా ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా తెలిసీ తెలియక అమ్మ ఇల్లరికం నేనొస్తి(2) డబ్బాశ కోసమై అత్తింట్లో నేనుంటే ఆ..డబ్బాశ కోసమై అత్తింట్లో నేనుంటే కసువూలూడ్సమని బోకుల్దోమమనే ఆ..కసువూలూడ్సమనె బోకుల్దోమమనె వడ్లు దంచమనె మంట బెట్టమనె వంట సేయమనె ఆ..ఈ ఇంటి పనులంటే […]పూర్తి వివరాలు ...
మధ్య తరగతి ఆలోచనల్ని భూ మార్గం పట్టించిన కథాశిల్పి సొదుం జయరాం. వీరికి 2004లో రాచకొండ రచనా పురస్కారం శ్రీకాకుళంలోని కథానిలయం వార్షికోత్సవ సభలో ఫిబ్రవరి 15న అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి మిత్రుడు జయరాం గురించి అందిస్తున్న రచన… నాలుగైదు దశాబ్దాల కిందటి మాట. కడప జిల్లాలోని పల్లెటూళ్ళలో ఆధునిక సాహిత్య చైతన్యం అబ్బిన రైతు కుటుంబాలు చాలా తక్కువగా ఉండేవి. వీటిలో సొదుం జయరాం […]పూర్తి వివరాలు ...
కోడి పిల్లో… అబ్బో కోడి పిల్లా.. ఆ మాటలంటదే కోడిపిల్ల ఆ.. మాటలంటదే ఆ..లాగనంటదే ఆ..మైన అంటదే ఆ.. లయ్యబడ్తదే కోడిపిల్ల! కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి కైలాసం నేనూ పోయినానంటదే ఆ మాటలంటదే కోడిపిల్ల!! దిబ్బమీదికొంచబోయి … బొచ్చు గిచ్చు ఈకుతాంటే (౩) అహా.. సిలంకూరి సిన్నప్ప.. శవరం సేసినానంటదే (2) ఆ మాటలంటదే ఆ..లాగనంటదే ఆ మైన అంటదే ఆ లయబడ్తదే కోడిపిల్ల! కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి కైలాసం నేనూ పోయినానంటదే ఆ […]పూర్తి వివరాలు ...
ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. ఎత్తులపై గళమెత్తు జిత్తులపై కలమెత్తు పిడికిల్లే విచ్చు కత్తు ఎత్తూ..ఎత్తూ… ఎత్తూ..ఎత్తూ.. ఎత్తేత్తు…..ఎత్తేత్తు…..ఎత్తేత్తు….. రావాల్చిన రాజధాని.. రాకుండా పాయరా వచ్చాయన్న సాగునీరు మనది కాదు సోదరా నిధులు లేని గడ్డరా నిరుద్యోగ బిడ్డరా ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. నవ్యాంధ్ర ముసుగులో రాయలసీమ బుగ్గిరా వదిలావా పగ్గాలు ఎద్దు నీది కాదురా సేద్యం సెయ్యలేవురా సేను బీడు ఆయరా బతుకు మోయలేవురా.. ఓ అమ్మా ఓ అక్కా ఓ నాన్నా […]పూర్తి వివరాలు ...