మాచనూరు చెన్నకేశవుని సంకీర్తనలు – 1 పదకవితా పితామహుడు దర్శించిన క్షేత్రాలు అనేకం కడప జిల్లాలో ఉన్నాయి. ఆయా వైష్ణవ క్షేత్రాలను దర్శించిన అన్నమయ్య అక్కడి క్షేత్రపాలకులను కీర్తిస్తూ సంకీర్తనా గానం చేసినాడు. అటువంటి క్షేత్రాలలో మాచనూరు చెన్నకేశవాలయం ఒకటి. మాచనూరు కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని ఒక గ్రామం. ఈ ఊరికి మాచనవోలు (మాచన అనే ఆయన కట్టించడం వలన ఈ ఊరు మాచనవోలు అయింది. ఆధారం: మెకంజీ కైఫీయత్తులు-1225-10) అనే పేరు కూడా కలదు. […]పూర్తి వివరాలు ...
సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- ఈ కవి చౌడప్ప పేరు వినని తెలుగు పద్య ప్రేమికుడు వుండడు!ఈ చౌడప్ప భాగమైన మట్ల/మట్లి రాజుల “అష్ట దిగ్గజాల” గురించి తెలిసింది మాత్రం తక్కువే! సామంతులకంటే చక్రవర్తి బలవంతుడు,విజయనగర సామంతులైన సిద్దవటం పాలకుడు మట్ల(/మట్లి ) “అనంతరాజు” పోషించిన అష్టదిగ్గజ కవుల గురించి మెకంజి కైఫియత్తులలో రాసిన కాలానికి (1810 – 1812) శ్రీకృష్ణ […]పూర్తి వివరాలు ...
ఎందుకో ఈ రోజు మా వూరి చెట్లు గుర్తుకొస్తున్నాయి… బయట నుండి వచ్చేవాళ్ళకు మా వూరి గుమ్మం తొక్కకముందే రోడ్డుకు కుడివైపున పెద్ద పెద్ద చింతమాన్లు కనపడేవి. అవేవీ మేమో, మా నాన్నలో, వాళ్ళ నాన్నలో నాటినవి గాదు. ఆ చింత చెట్ల ప్రాంతాన్నంతా “పాతూరు” అనేవారు. మా వూరికి ముందున్న వూరు అదే. దాని అసలు పేరు అగ్రహారం. అగ్రహారానికి ఉత్తరంగా చెరువు. అదే కల్పనాయుని చెరువు. ఆ చెరువు గట్టున వున్న శివాలయం అప్పటి […]పూర్తి వివరాలు ...
కడప నారాయణదాసు సంకీర్తనలు తాడిపత్రిలో పుట్టి, కడపలో నివసించి పండరి భజన కీర్తనలను రచించి, తానే గురువై బృందాలకు పండరి భజన నేర్పిస్తూ తమిళనాడు (చోళంగిపురం) చేరుకుని ప్రజాబాహుళ్యంలో చిరస్థాయిగా నిలిచి పోయిన వాగ్గేయకారులు కడప నారాయణదాసు అలియాస్ ఏ నారాయణదాసు గారు. వారు 1934లో కూర్చిన పండరి భజన సంకీర్తనల సమాహారమే ఈ పుస్తకం. పుస్తకం పేరు : ఘటికాద్రి హట యోగానంద భజన సంకీర్తనలు రచన : కడప నారాయణదాసు (ఎ నారాయణదాసు) ప్రచురణ […]పూర్తి వివరాలు ...
వర్గం : శృంగార సంకీర్తనలు ॥పల్లవి॥ సొంపుల నీ వదనపు సోమశిల కనుమ యింపులెల్లఁ జేకొనఁగ నిల్లు నీపతికి ॥చ1॥ కలికి నీ పిఱుఁదనే గద్దెరాతి కనుమ మొలనూళ్ళలతలనే ముంచుకొన్నది కలయఁ బోకముడినే కట్లువడ్డది అలరువిలుతుదాడికడ్డము నీ పతికి ||సొంపుల|| ॥చ2॥ ఇదివొ నీ కెమ్మోవి యెఱ్ఱశిల కనుమ కదిసి లేఁజిగురులఁ గప్పుకొన్నది వదలకింతకుఁ దలవాకిలైనది మదనుని బారికి మాఁటువో నీ పతికి ||సొంపుల|| ॥చ3॥ కాంత నీ చిత్తమే దొంగలసాని కనుమ యింతటి వేంకటపతికిరవైనది పంతపు […]పూర్తి వివరాలు ...
నీలవేణి కథల సంపుటి కడప జిల్లాలో మొదటి కథా రచయితగా భారతం నాదమునిరాజు గుర్తించబడ్డారు. 1930లో జన్మించిన నాదమునిరాజు గారి జన్మస్థలం వేంపల్లి.రాజు గారు 1956లో రాసిన ‘నీలవేణి’ కడప జిల్లా నుండి వెలువడిన మొదటి కథగా సాహితీకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాదమునిరాజు గారి కథలను వారి మొదటి కథ ‘నీలవేణి’ పేరుతో ఒక సంపుటిగా వెలువరించినారు.పూర్తి వివరాలు ...
మామరో కొండాలరెడ్డి మామిడీ పూవంటిదాన్ని పాయముంటే ఏలుకుంటావా కొండాలరెడ్డి-సేసుకొని సూసుకుంటావా అంతనైతి ఇంతనైతి సంతలో నెరవాజి నైతి తగులుకొని నీయంట నేనొత్తి కొండాలరెడ్డి ముగము సాటు సేయకోయబ్బి ||మామరో || సింతమాని ఇంటిదాన్ని సిలకలా కొమ్మాల దాన్ని సిలుకు సీరల వాలుజడదాన్ని కొండాలరెడ్డి కులుకు నడకల ఎర్రసినదాన్ని ||మామరో || కొత్తకుండల నీరుతీపి కోరిన మగవాడు తీపి వాడిన దంటెంతతీపబ్బి కొండాలరెడ్డి వాలలాడె బాలపాయము ||మామరో || బాయిగడ్డన బంగిసెట్టు ఎండితే ఒకదమ్ము పట్టు కోరేదాన్ని కొంగుపట్టబ్బి […]పూర్తి వివరాలు ...
దూరి సూడు దుర్గం సూడు మామా దున్నపోతుల జాడ జూడు మైలవరమూ కట్టా మీద మామా కన్నె పడుచుల బేరీ జూడు అంచుఅంచుల చీరగట్టి మామా సింతపూల రయికా తొడిగీ కులికి కులికీ నడుస్తుంటే మామా పడుసోల్ల గోడు జూడు ||దూరి|| కడవ సంకనబెట్టుకోని నేను ఊరబాయికి నీళ్ళకు పొతే కపెల దోలే సిన్నవాడు మామా కడవనెత్తి కన్నూ గొట్టే ||దూరి|| కండ్ల కాటుక పెట్టూకోని మామా కోమిటింటికి నేనే పొతే కోమిటింటి శెట్టీ కొడుకు మామా […]పూర్తి వివరాలు ...
76 సంవత్సరాల ముళ్లపూడి వెంకట రమణ ‘బుడుగు’ సృష్టికర్తగా తెలుగు పాఠకులందరికీ సుపరిచితులే. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన పాత్రికేయునిగా, రచయితగా, నిర్మాతగా బహుముఖ పాత్రలను పోషించారు. ‘నా రాత అతని గీత మా సినిమా తీతకు పునాదులు వేశాయి’ అంటూ బాపుతో కలిసి తన సినీరంగ ప్రవేశం గురించి చెప్పే రమణ ఆరుసార్లు సినీ రచయితగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. ఎస్ఎస్ఎల్సి వర కూ చదువుకున్న ఆయన, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ […]పూర్తి వివరాలు ...