॥పల్లవి॥సొరిది సంసారంబు సుఖమా యిందరికివెరవెఱంగక వగల వేఁగేరు గాక॥చ1॥దేహములు దలఁప సుస్థిరములా ప్రాణులకు-నూహింప లోభ మట్లుండుఁ గాకమోహంబుచే వెనకముందెఱుఁగలేక తమ-దేహసుఖములు మరిగి తిరిగేరుగాక॥చ2॥నెలకొన్నద్రవ్యములు నిలుచునా యెవ్వరికిఅలవి నిలుపఁగరాని యాస గాకబలువైన వట్టి విభ్రాంతిచే దగులువడితెలిసియును దెలియ కిటు తిరిగేరు గాక॥చ3॥నెఱయువిభవములెల్ల నిజములా యిందరికికొఱమాలినట్టి తమగుణముగాకయెఱుకతోఁ దిరువేంకటేశుఁ గొలువఁగలేకతెఱఁగుమాలిన బుద్ధిఁ దిరిగేరుగాక రాగము: ముఖారి రేకు: 0040-06 సంపుటము: 1-248 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥సకలశాస్త్రజ్ఞానసంపన్నుఁడట చిత్త-మొకటికినిఁ జొరదు విధియోగమౌఁగాదో॥చ1॥దొరతనంబట కలిమి దోడుగాదట మంచి-తరుణులట మోహమట దైన్యంబటవిరహమట దారిద్య్రవివశుఁడౌనట చూడనరయ నిది కర్మఫలమౌనో కాదో॥చ2॥రాజసన్మానమట రవణహీనత్వమటతేజమట నలువంకఁ దిరిపెంబటవాజివాహనములట వాఁడి లేదట తొంటి-పూజఫలమిది వెలితిభోగమౌఁగాదో॥చ3॥యిలయెల్ల నేలునట ఇంట లేదట మిగులబలిమిగలదట సదా పరిభవమటచెలువలర వేడుకల శ్రీవేంకటేశ్వరునిగొలువనేరనివెనకఁ గొరఁతలౌఁగాదో రాగము: శ్రీరాగం రేకు: 0040-05 సంపుటము: 1-247 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పాపినైననాపాలఁ గలిగి తోవచూపుమన్న నెందుఁ జూపరు॥చ1॥ధృతిదూలి జగమెల్లఁ దిరిగి వేసరితియితరాలయముల కేఁగియేఁగి వేసరితిగతమాలి పరులపైఁ గనలి వేసరితిమతిమాలి కులవిద్య మాని వేసరితి॥చ2॥విసిగి యాచారంబు విడిచి వేసరితిపసచెడి ప్రియములు పలికి వేసరితికొసరి ద్రవ్యముపైఁ గోరి వేసరితికసుగంది లోలోనె కాఁగి వేసరితి॥చ3॥కోవిదులగువారిఁ గొలిచి వేసరితిదైవములందరిఁ దడవి వేసరితిశ్రీవేంకటేశునిసేవ మాని వట్టి-సేవలన్నియు నేఁ జేసి వేసరితి రాగము: సామంతం రేకు: 0040-04 సంపుటము: 1-246 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నమో నారాయణాయ నమఃసమధికానందాయ సర్వేశ్వరాయ॥చ1॥ధరణీసతీఘనస్తనశైలపరిరంభ-పరిమళశ్రమజలప్రమదాయసరసిజనివాసినీసరసప్రణామయుత-చరణాయ తే నమో సకలాత్మకాయ॥చ2॥సత్యభామాముఖాంచనపత్రవల్లికా-నిత్యరచనక్రియానిపుణాయకాత్యాయనీస్తోత్రకామాయ తే నమోప్రత్యక్షనిజపరబ్రహ్మరూపాయ॥చ3॥దేవతాధిపమకుటదివ్యరత్నాంశుసం-భావితామలపాదపంకజాయకైవల్యకామినీకాంతాయ తే నమోశ్రీవేంకటాచల శ్రీనివాసాయ రాగము: శ్రీరాగం రేకు: 0040-03 సంపుటము: 1-245 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥తెల్లవారనియ్యరో తెరువు యీ-పల్లదపుదొంగలెల్లఁ బారాడుతెరువుis-aber.net॥చ1॥దొంతరపూవులతోఁట తూరుపుఁ దెరువుచింతపూవుఁ దేనెలచెమ్మ తెరువుసంతులేని సతియింటిచాయ తెరువుయింతలోనె చలిఁబడి యెండదాఁకే తెరువు॥చ2॥పాముపుట్ట గొంటిమీఁది పడుమటితెరువుచీమకదొంతరలోనిచిన్న తెరువుగాములుగాచుక యుండే గాలి తెరువుయేమిటా నెక్కడవుత నెరఁగనితెరువు॥చ3॥అన్ని దిక్కులునుఁ దానేయైవున్న తెరువుపన్నీటి కాలువలబాట తెరువుకన్నుల వేంకటపతిఁ గన్న తెరువుమిన్నునేలఁగూడినమీఁది తెరవు రాగము: కాంబోది రేకు: 0040-02 సంపుటము: 1-244 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నిగమనిగమాంత వర్ణిత మనోహర రూపనగరాజధరుఁడ శ్రీనారాయణా॥చ1॥దీపించు వైరాగ్య దివ్యసౌఖ్యం బియ్య-నోపకకదా నన్ను నొడఁబరుపుచుపైపైనె సంసారబంధములఁ గట్టేవునాపలుకు చెల్లునా నారయణా॥చ2॥చీకాకు పడిన నాచిత్తశాంతము సేయ-లేకకా నీవు బహులీల నన్నుకాకుసేసెదవు బహుకర్మములఁ బడువారునాకొలఁదివారలా నారాయణా॥చ3॥వివిదనిర్బంధముల వెడలఁద్రోయక నన్నుభవసాగరములఁ దడఁబడఁ జేతురాదివిజేంద్రవంద్య శ్రీతిరువేంకటాద్రీశనవనీతచోర శ్రీనారాయణా రాగము: సామంతం రేకు: 0040-01 సంపుటము: 1-243 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥సొగియునా మఱియు ముచ్చుకుఁ బండువెన్నెలలుపగవానివలెనె లోపల దాఁగుఁగాక॥చ1॥దక్కునా పేదకును తరముగానిధనంబుచిక్కి యెవ్వరికై నఁ జేరుఁగాకవెక్కసంబైన గోవిందునిఁ దలఁపు బుద్ధితక్కిన పరులకెల్లఁ దలఁపేల కలుగు॥చ2॥అరగునా దుర్భలున కరుదైన యన్నంబుకరుచబుద్ధులను నరమిగొనుఁగాకతొరలునా హరివినుతి దుష్టునకు నది నోరఁదొరలెనా యతనినే దూషించుఁగాక॥చ3॥చెల్లునా యమృతంబు సేవించ నధమునకువొల్లనని నేలపై నొలుకుఁగాకవెల్లి గొనుమందునకు వేంకటేశుస్మరణచల్లనౌనా మనసు శఠియించుఁగాక రాగము: బౌళి-జంపెతాళం రేకు: 0039-06 సంపుటము: 1-242 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥అంగడి నెవ్వరు నంటకురో యీ –దొంగలఁ గూడిన ద్రోహులను॥చ1॥దోసము దోసము తొలరో శ్రీహరి –దాసానదాసుల దగ్గరకఆసలనాసల హరినెఱఁగక చెడివీసర పోయిన వెఱ్ఱులను॥చ2॥పాపము పాపము పాయరో కర్మపుఁ-దాపపువారము దగ్గరకచేపట్టి వేదపు శ్రీహరికథలుయేపొద్దు వినని హీనులము॥చ3॥పంకము పంకము పైకొనిరాకురోకొంకుఁగొసరులకూళలమువేంకటగిరిపై విభునిపుణ్యకథలంకెల వినని యన్యులము రాగము: శ్రీరాగం రేకు: 0039-05 సంపుటము: 1-241 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ముచ్చుఁగన్న తల్లి చేరి మూలకు నొదిగినట్టుతెచ్చిన సంబళ మెల్లఁ దీరుఁబో లోలోనె॥చ1॥దప్పముచెడినవాని తరుణి కాఁగిటఁ జేరిఅప్పటప్పటికి నుస్సు రనినయట్టువొప్పయిన హరిభక్తి వొల్లనివాని యింటి-కుప్పలైన సంపదలు కుళ్లుఁబో లోలోనె॥చ2॥ఆఁకలి చెడినవాని అన్నము కంచములోనవోఁకిలింపుచు నేల నొలికినట్టుతేఁకువైన హరిభక్తి తెరువుగానని వాని-వేఁకపు సిరులు కొంపవెళ్లుఁబో లోలోనె॥చ3॥వొడలుమాసినవాని వొనరుఁజుట్టములెల్లబడిబడినే వుండి పాసినయట్టుయెడయక తిరువేంకటేశుఁ దలఁచనివాని-ఆడరుబుద్ధులు పగలౌఁబో లోలోననె రాగము: శ్రీరాగం రేకు: 0039-04 సంపుటము: 1-240 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, [&పూర్తి వివరాలు ...