జమ్మలమడుగు సంఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు సరిగాలేదని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. స్థానిక పురపాలిక ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా గురు, శుక్రవారం జరిగిన లాఠీఛార్జి, బాష్పవాయు ప్రయోగంలో గాయపడిన తెదేపా నాయకులు, కార్యకర్తలను పరామర్శించడానికి శనివారం జమ్మలమడుగుకు వచ్చిన రమేష్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పురపాలిక ఎన్నిక న్యాయబద్ధంగా జరపాలంటూ నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిని పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చారన్నారు. పోలీసు […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు: శుక్రవారం రాత్రి చైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతోందనుకున్న తరుణంలో ఆర్డీఓ రఘునాథరెడ్డి కర్ఛీఫ్తో ముఖం తుడుచుకుంటూ ప్రస్తుతం రక్తపోటు కారణంగా ఆరోగ్యం సహకరించడం లేదని ఎన్నికలు నిర్వహించలేనని చేతులెత్తేశారుశారు. రెండు గంటలు కథ నడించారు. రాత్రి 11 గంటల వరకు ఎన్నిక విషయంలో అధికారులు ఎటూ తేల్చలేదు. ఆలోగా శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని చైర్మన్ ఎన్నికల్ని వాయిదా వేయాలంటూ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఆర్డీవోకు లేఖ పంపారు. అంతవరకూ అనారోగ్యం నటించిన […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక పేర అధికార పార్టీ రేపుతున్న దుమారం ఉద్రిక్తతలకు దారితీసింది. జానీ అనే తెదేపా కౌన్సిలర్ నిన్న అజ్ఞాతంలోకి వెల్లిపోవడంతో మొదలైన రగడ ఇవాల్టికీ కొనసాగుతుండడం విచారకరం. ఘనత వహించిన మన ఏలికలు ఈ వివాదానికి ముగింపు పలుకపోగా వత్తాసు పలుకుతుండడమే విషాదకర పరిణామం. 22 మంది సభ్యులకు 21మంది హాజరైనప్పటికీ జానీ అపహరణకు గురైనందున గురువారం ఎన్నిక వాయిదా వేసినట్లు ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన జమ్మలమడుగు ఆర్డీవో రఘునాధరెడ్డి […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు పురపాలికలో ఓ కౌన్సిలర్ అపహరణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చినందున ఛైర్మన్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను, తమ వారు తెదేపా కౌన్సిలర్‌ను అపహరించినట్లు నిరూపిస్తే.. తనను ఉరితీయాలని సవాల్ విసిరారు. తనతోపాటు, ఎంపీ, తమ పార్టీ కౌన్సిలర్లకు బయటకు వెళితే రక్షణ ఉండదంటూ పురపాలిక కార్యాలయంలోనే నిరసన తెలుపుతూ ఉండిపోయారు. 144వ సెక్షన్ అమల్లో ఉండగా, తెదేపాకు చెందిన వందల మంది […]పూర్తి వివరాలు ...
కడప నగరపాలికతోపాటు, ఆరు పురపాలికల్లో పాలకవర్గాలు గురువారం కొలువు దీరాయి. జమ్మలమడుగులో మాత్రం ఓ కౌన్సిలర్ కనిపించకుండా పోవడంతో తెదేపా నేతలు వీరంగం చేశారు. దీంతో అక్కడ పాలకవర్గం ఎన్నికను ఈరోజుకు వాయిదా వేశారు. బద్వేలులో ఛైర్మన్‌గా తెదేపా కౌన్సిలర్ పార్థసారధిని ఎన్నుకోగా, వైస్ ఛైర్మన్ అభ్యర్థిపై స్పష్టత రాకపోవడంతో ఆ ఎన్నిక వాయిదా వేశారు. కడప నగరపాలికలోని మేయర్, డిప్యూటీ మేయర్, ఏడు పురపాలికల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు గురువారం ఎన్నిక నిర్వహించారు. అన్ని చోట్లా […]పూర్తి వివరాలు ...
ఈరోజు కడప కార్పొషన్‌తోపాటు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, రాయచోటి పురపాలికల పాలకవర్గం కొలువుదీరనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. కార్పొరేటర్లు/ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం కడపలో మేయర్, డిప్యూటీ మేయర్, ఆయా పురపాలక సంఘాలలో చైర్మన్, వైస్చైర్మన్ల ఎంపికకు ఎన్నికలు జరుగన్నాయి. కలెక్టర్ కోన శశిధర్ కడప కార్పొరేషన్ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. కొత్త పాలకవర్గాల ఎన్నికకు కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని మున్సిపాలిటీలు ముస్తాబయ్యాయి. ఎన్నికకు కేవలం […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు: తెదేపా ప్రభుత్వం చౌకదుకాణాల డీలర్లపై తప్పుడు కేసులు బనాయించిందని, ఎలాంటి విచారణ లేకుండానే ఏకపక్షంగా తొలగించిదంటూ జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం వైకాపా శాసనసభ్యులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ముద్దనూరు రోడ్డుపై రెండు గంటల పాటు భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రజలకు, వైకాపా కార్యకర్తలకు అన్యాయం జరిగితే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని శాసనసభ్య్లులు ఆదినారాయణరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జయరాముడు, అంజద్‌బాషా, ఎమ్మెల్సీ […]పూర్తి వివరాలు ...
కౌన్సిలర్లను దూషించిన కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డిని శనివారం సాయంత్రం ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్ లో లొంగిపోయినట్లు సీఐ కేశవరెడ్డి తెలిపారు. అనంతరం పూచీకత్తుపై స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో కౌన్సిలర్లను దూషిస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఐపీసీ సెక్షన్ 153, 504, 506ల క్రింద ఎర్రగుంట్ల పోలీసులు ఎమ్మెల్యే, మరో అయిదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని […]పూర్తి వివరాలు ...
వైకాపా అధినేత జగన్ ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లతో గురువారం నగరంలోని వైఎస్ గెస్ట్ హౌస్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి కార్పొరేటర్‌ను పరిచయం చేసుకున్నారు. సమావేశానికి వచ్చిన కార్యకర్తలను పలకరిస్తూ వారికి ధైర్యం చెపుతూ కన్పించారు. వచ్చిన వారందరితో బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసి, ఫొటోలు దిగారు. ప్రతి కార్యకర్త చెప్పే మాటలను వింటూ ఎంపీ అవినాష్ ఉన్నాడు… ఎమ్మెల్యేలు అంజాద్బాష, రవిరెడ్డి, సురేష్‌బాబులు ఉన్నారంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం […]పూర్తి వివరాలు ...