రాయచోటి : మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా విప్ ధిక్కరించినందుకు ముగ్గురు కౌన్సిలర్లపై మంగళవారం అనర్హత వేటు పడింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నరసింహులునాయక్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. మునిసిపాలిటీలోని 4వ వార్డు కౌన్సిలర్ అనీఫా, 12వ వార్డు కౌన్సిలర్ మహబూబ్‌బాష, 21వ వార్డు కౌన్సిలర్ షాహిరున్నీసాలపైన ఈ వేటు పడింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి, ఛైర్మన్, వైస్ఛైర్మన్లుగా పార్టీ బలపరిచిన అభ్యర్ధికి ఓటు వేయలేదంటూ వైకాపా నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి […]పూర్తి వివరాలు ...
శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీరు 854 అడుగుల వరకు నిండినా రాయలసీమకు నీటిని విడుదల చేయకపోవడం అన్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్ బాషా విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్ట్‌లకు నీటి విడుదల చేసిన తర్వాతే కిందికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణాలను రీషెడ్యూల్ చేయడానికి ఆర్బీఐ, ఇతర బ్యాంక్‌లు కుదరదన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా పర్యాటక రంగానికి మరోసారి అన్యాయం జరిగింది. కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీవద్ యశో నారాయణ మంగళవారం పార్లమెంటులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యాటకాభివృద్ధికి చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను లిఖిత పూర్వకంగా వివరించారు. మన రాష్ట్రానికి సాధారణ సర్క్యూట్ విభాగంలో పది ప్రాజెక్టులను కేటాయించారు. సాధరణంగా రాష్ట్ర ప్రభుత్వం పంపే నివేదికలకు అనుగుణంగా కేంద్రం ఇటువంటి ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేస్తుంది.. అందులో గుంటూరుకు మూడు కేటాయించి పశ్చిమ గోదావరికి రెండు, చిత్తూరు (శ్రీకాళహస్తి)కు […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ గా తులశమ్మ(వైకాపా), వైస్ ఛైర్మన్‌గా ముల్లా జానీ (తెదేపా)ఎన్నికయ్యారు. జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. తెదేపా, వైకాపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీ ద్వారా ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎంపిక చేశారు. తెదేపా వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికలలో అధిక స్థానాలు పొందినప్పటికీ లాటరీలో చైర్ పర్సన్, పదవి వైకాపాకు దక్కడం విశేషంగా ఉంది. మే నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 9 […]పూర్తి వివరాలు ...
వాయిదా పడిన జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నిక ఏక్షణాన ఏ మలుపు తిరుగుతుందోనని ప్రతి ఒక్కరూఆసక్తిగా గమనిస్తున్నారు. మే నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 9 స్థానాల్లో, టీడీపీ 11స్థానాల్లో విజయం సాధించింది. అయితే స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా […]పూర్తి వివరాలు ...
ఎలాంటి వారంటూ లేకుండా వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గెస్ట్‌హౌస్‌లో శనివారం నెల్లూరు జిల్లాకు చెందిన పోలీసులు సోదా చేశారు. పోలీసులు అలా సోదాలు చేసింది ఆ పార్టీ జెడ్పీటీసీల కోసమట!! తమ వారు కిడ్నాపైనట్టు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు జెడ్పీటీసీల తరఫున ఫిర్యాదు దాఖలైందని, అందుకోసమే ఇడుపుల పాయలో వెదికామన్నది పోలీసుల వివరణ. ఈ నెల 5న తెదేపా వారి రభస కారణంగా నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన నేపధ్యంలో 8 నుంచీ […]పూర్తి వివరాలు ...
హైకోర్టు ఆదేశాలతో జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్ళీ ఉత్సుకతను పెంచేలా ఉంది. ఈ నెల 4న జరిగిన ఓటింగ్ కు ఇష్టపూర్వకంగానే గైర్హాజరైన జానీ ఓటును పరిగణలోకి తీసుకోరాదని ఆదివారం (13వ తేదీన) చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తూనే , ఎన్నికల వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా కోరం ఉన్నప్పటికీ ఎన్నికలను వాయిదా వేసిన ఆర్డీఓపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడంపై […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా పరిషత్ పీఠం ఏకగ్రీవమైంది. జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని తెదేపా నేతలుచేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకార అనంతరం ఓటింగ్ కన్నా ముందే సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో వైకాపా సభ్యులు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ఎర్రగుంట్ల జడ్పీటీసీ సభ్యుడు గూడూరు రవి, వైస్‌చైర్మన్‌గా ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన జడ్పీ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. […]పూర్తి వివరాలు ...
ఎవరి పేరు చెప్పి జమ్మలమడుగు పట్టణంలో తెదేపా వాళ్ళు పోలీసులతో తలపడ్డారో… ఎవరి పేరు చెబితే పోలీసులు, అధికారులు ఉలిక్కిపడతారో…. ఎవరి గురించి జమ్మలమడుగు మునిసిపల్ ఎన్నిక వాయిదా పడిందో… అతడే ఈ జానీ! – రెండు వేల మంది తెదేపా కార్యకర్తలు, పదుల సంఖ్యలో నాయకులను, వందలాదిమంది పోలీసులను రెండు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా జమ్మలమడుగు వీధులలో తన కోసం ఎదురుచేసేలా చేసిన ఘనాపాటి. జమ్మలమడుగు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక రోజున గోవా వెళ్ళిన […]పూర్తి వివరాలు ...