కడప: గురువారం కడపలో జరిగిన వైకాపా జిల్లా సర్వసభ్య సమావేశానికి కొంతమంది నేతలు హాజరు కాలేదు. దీంతో ఆయా నేతలు వైకాపాకు దూరంగా జరుగుతున్నారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. రాజంపేట పార్లమెంటు సభ్యడు మిథున్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు కూడా హాజరు కాలేదు. ఇలా ముఖ్య నేతలు ముందస్తు సమాచారం […]పూర్తి వివరాలు ...
జిల్లా అభివృద్ధిపై ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో కడప : దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నాడని, కడప జిల్లాను పూర్తిగా మరిచారని శాసనమండలిలో ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లా అభివృద్ధిపై ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థంకాలేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కింద సుమారు రూ. 80వేల కోట్లు […]పూర్తి వివరాలు ...
రాజంపేట: జిల్లా ప్రజలు వైకాపాకు పట్టం కట్టారనే కక్షతో తెదేపా ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడంలేదని వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన రాజంపేటలో విలేకరులతో మాట్లాడుతూ… వైఎస్ పాలనలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అయితే ఇప్పుడు ఏ రంగంలోనూ అభివృద్ధి మచ్చుకైనా కానరావడంలేదన్నారు. కనీసం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తే వ్యాపారాలు పెరుగుతాయని, పరిశ్రమలు వస్తాయని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. ఈనెల 30న కడపలో నిర్వహించే వైకాపా జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో […]పూర్తి వివరాలు ...
డీజీపీ ఆదేశించడంతో శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి సహా దేవగుడి గ్రామంలో ఏకంగా 35 మందిపై జమ్మలమడుగు పోలీసులు రౌడీషీట్ తెరిచారు. వీరంతా వైకాపాకు చెందినవారు కావడం విశేషం. ఇదేవిధంగా మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డితోపాటు మరో అయిదుగురిపై రౌడీషీట్ తెరవాలని ఓ తెదేపా నేత నుంచి పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉన్నట్లు ఇవాళ ఒక దినపత్రిక పేర్కొంది. ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను ఆధారంగా చేసి వీరిపై రౌడీషీట్ తెరిచినట్లు సమాచారం. ఓ వ్యక్తిపై […]పూర్తి వివరాలు ...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కడప జిల్లా పర్యటన రద్దయింది. ఈనెల 14న రైల్వేకోడూరు, కమలాపురం నియోజకవర్గాల్లో జరిగే జన్మభూమి- మా ఊరు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సభాస్థలి, హెలిప్యాడ్ స్థలాలను ఖరారు చేశారు. జిల్లా అధికారులు, టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. బాబు పర్యటనలో జిల్లాపై వరాలజల్లులు కురిపిస్తారని మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. అయితే హుద్‌హుద్ తుఫాన్ కారణంగా వైజాగ్, […]పూర్తి వివరాలు ...
కడప: వైఎస్ఆర్ జిల్లాకు రావలసిన పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైకాపా శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాద్, కడప మేయర్ సురేష్ బాబులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కడప విమానాశ్రయ ప్రారంభోత్సవం ఎందుకు ఆపారో తక్షణమే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 1985లోనే కడప విమానాశ్రయంలో 20 సీట్లున్న వాయుదూత్ విమానం దిగేదని, ఇప్పుడు ఆ సీట్ల గల విమానం కూడా దిగేందుకు […]పూర్తి వివరాలు ...
కోడూరు: ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంగా ఉన్న విశాఖపట్టణంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంతో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు సాధించిందని అదేస్థాయిలో కడపలోనూ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి జిల్లా స్వరూపాన్నే మార్చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పథకరచన చేస్తున్నట్లు జిల్లాకు ఇంచార్జిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన గత పాలకులు కడప జిల్లాతో పాటు రాష్ట్రాన్ని కూడా భ్రష్టుపట్టించారన్నారు. […]పూర్తి వివరాలు ...
కడప: ఈనెల 14న కడపజిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు కడప విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పారు. నగరంలోని రాష్ట్ర అతిథి గృహంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత తిరుపతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి రైల్వేకోడూరుకు ఉదయం 10.30 గంటలకు చేరుతారన్నారు. ఓబన్నపల్లెలో ఏర్పాటు చేసిన జన్మభూమి-మావూరు, ఇతర కార్యక్రమాల్లో దాదాపు రెండున్నర గంటల పాటు చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో […]పూర్తి వివరాలు ...
రాజంపేట: కడప జిల్లాలో ప్రభుత్వం 30వేల పింఛన్లు తొలగించిందని వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆరోపించారు. రాజంపేటలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్ని మభ్య పెట్టేందుకే ప్రభుత్వం జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చిందని పేర్కొన్నారు. జన్మభూమికి కేటాయించిన నిధులు మంత్రులు, అధికారులు తిరిగేందుకే సరిపోతాయన్నారు. రుణమాఫీ అంటూ రైతులను, డ్వాక్రా మహిళలలను బురిడీ కొట్టించారన్నారు. ఎన్నో ఆశలతో అధికారంలో కూర్చోబెట్టిన జనాన్ని నట్టేట ముంచడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పని […]పూర్తి వివరాలు ...