కడప విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి ఈనాడు దినపత్రిక ఇవాల్టి కడప టాబ్లాయిడ్లో ఒక కధనాన్ని ప్రచురించింది. ఆ కధనం ప్రకారం … జులై 2న కడప విమానాశ్రయంలో విమానాలు దిగనున్నాయి. ఢిల్లీ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. విమానాశ్రయ సంబంధిత ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రారంభ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఇదివరకు కూడా ఈనాడు, సాక్షి దినపత్రికలు ఇదే మాదిరి కధనాలను చాలా సార్లు ప్రచురించాయి. గత సంవత్సరం […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో సినిమా షూటింగ్ ల సందడి పెరుగుతోంది. ఇప్పటికే పలు తమిళ, కన్నడ చిత్రాలు గండికోట పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోగా తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గుర్రప్పనికొట్టాలలో (మైలవరం మండలంలోని లింగాపురం పంచాయతీ) తమిళ సినిమా ‘కత్తి’ చిత్రీకరణ జరుగుతుండడంతో సందడి నెలకొంది. తమిళంలో అగ్రకధానాయకుడు విజయ్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం హీరో విజయ్‌పై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రీకరణ కోసం పలు సెట్టింగులు వేశారు. కరవుతో అల్లాడుతున్న […]పూర్తి వివరాలు ...
22న అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో బహిరంగసభ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన రాయలసీమలో రాజధాని నిర్మించడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి అన్నారు. విజయవాడ, గుంటూరు ఇప్పటికే పెద్ద నగరాలని, అక్కడ రాజధానికి తగినవిధంగా మౌలిక సదుపాయాలు లేవని, ప్రజలు తిరిగి హైదరాబాద్ మాదిరి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రాజధాని నిర్మాణ ఖర్చును భరిస్తానని కేంద్రం హామీ ఇచ్చినందున సీమలో రాజధాని నిర్మిస్తే అక్కడ రైల్వే, విమానాశ్రయాలు అందుబాటులోకి […]పూర్తి వివరాలు ...
పులివెందులలో చోటా మోటా నాయకులు ఇళ్ళ ముందు చూడడానికి భయంకరంగా ఉండే మనుషులను పెట్టుకుని బాంబులు చుట్టిస్తూ.. కత్తులు పట్టుకుని తిరుగుతుంటారట – అంతే కాదండోయ్ పులివెందులలో కేవలం ఫ్యాక్షనిస్టులు, నేరస్తులు, రౌడీలు మాత్రమే ఉంటారుట – ఇదీ ‘జంపు జిలానీ’ అనే పేరుతో ఇటీవల విడుదలయిన ఒక సినిమాలో పైత్యం శ్రుతిమించి చూపించిన సన్నివేశం. అంతేనా సినిమాలో పలుచోట్ల పులివెందుల అనగానే అయ్యా బాబోయ్ అది ఫ్యాక్షనిస్టుల ఊరు నేను రాను అంటూ కథానాయకుడితో సంభాషణలు […]పూర్తి వివరాలు ...
కాచిగూడ – తిరుపతి రెండంతస్తుల రైలు పట్టాలెక్కింది. వారానికి రెండుసార్లు నడిచే ఏసీ డబుల్ డెక్కర్ సూపర్‌ఫాస్ట్ తొలి సర్వీసు బుధవారం కాచిగూడ నుంచి వయా ఎర్రగుంట్ల, కడప, రాజంపేట మీదుగా తిరుపతికి వెళ్లింది. కడప రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంది. ఈ డబుల్ డెక్కర్ రైలు వారానికి రెండుసార్లు జిల్లా మీదుగా తిరుపతి మరియు హైదరాబాదుకి వెళుతుంది. తిరుపతి వెళ్లే డబుల్ డెక్కర్ రైలు బుధ, శనివారాల్లో మధ్యాహ్నం 3.20 గంటలకు కడప చేరుకుని […]పూర్తి వివరాలు ...
నాపరాళ్లకు ‘కడప రాళ్లు’ అన్న పేరున్నట్లే కర్బూజా పండ్లకు ‘కడప దోసపండ్లు’ అన్న పేరు కూడా ఉంది. కడప జిల్లాలోని పెన్నానది ఒడ్డున – ఇసుక దిబ్బల్లో కర్బూజా పాదుల పెంపకం విస్తారంగా జరుగుతూంటుంది. వేసవి కాలం ప్రారంభం నుంచి వేసవి బాగా ముదిరే వరకూ ఈ పండ్లు లభ్యమవుతాయి. కడప జిల్లాలోనే కాకుండా కర్బూజా దోసపాదుల్ని కర్నూలు జిల్లాలోనూ, అనంతపురం జిల్లాలోనూ, అలాగే చిత్తూరు ప్రాంతాలలోనూ పెంచుతున్నారు. తీగపాదుల ద్వారా మనకు లభించే ఫలాల్లో కర్బూజ […]పూర్తి వివరాలు ...
భాజపా రాష్ట్ర నాయకుడు, సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు గురువారం ఒంటిమిట్ట కోదండరామాలయాన్నీ సతీసమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించారు. ఆలయ అధికారులు పూలమాల, దుశ్శాలువాలతో కృష్ణంరాజు దంపతులను సత్కరించారు. అనంతరం కడపలోని అమీన్‌పీర్ (పెద్ద ) దర్గాను దర్శించుకున్నారు. భార్య శ్యామలాదేవితో కలసి ఆయన దర్గాలోని ప్రధాన మజార్ వద్ద ప్రార్థనలు చేశారు. దర్గా ప్రాంగణంలోని ఇతర […]పూర్తి వివరాలు ...
లెజెండ్ సినిమా విజయ యాత్రలో భాగంగా బాలయ్య, చిత్ర యూనిట్ తో కలిసి గురువారం కడపకు వచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఆయన రవి థియేటర్ వద్దకు రాగానే అభిమానులు ఈలలు, కేకలు వస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. బాలయ్య కోసం ప్రత్యేక కథను రూపొందించి సినిమాను విడుదల చేసినట్లు దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు.థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బాలయ్య ప్రసంగిస్తున్నంత సేపు అభిమానుల ఈలలు, కేకలతో థియేటర్ ప్రతిధ్వనించింది. […]పూర్తి వివరాలు ...
చంద్రాబాబు నాయుడు – ఉమ్మడి ఆం.ప్ర రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా – పదేళ్లు ప్రతిపక్ష నేతగా వెలిగిన వ్యక్తి. తెదేపాను కనుసైగతో శాసించగలిగిన తిరుగులేని సారధి. ఈ పందొమ్మిదేళ్ళ బాబు గారి హయాంలో వారి సారధ్యంలోని తెదేపా ద్వారా కడప జిల్లాకు ఒనగూరిన గుర్తుంచుకోదగిన ప్రయోజనాలు ఇవీ. వీటిల్లో సిమెంటు రోడ్లు వెయ్యటం, ఇంకుడు గుంటలు తవ్వటం, నిధులివ్వకుండా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చెయ్యటం, కాలువలు ఆధునీకరించడం లాంటి పెద్ద పెద్ద పనులు గుర్తుకొస్తాయి – బహుశా ఇవన్నీ […]పూర్తి వివరాలు ...