18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ పంటకు అను వైన జూన్, జులై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు నెలల్లో 393.5 మిల్లి మీటర్ల వర్షపాతం జి ల్లాలో నమోదు కావాల్సి ఉండగా 180.6 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది. వాస్తవికంగా 54 […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు చెందిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం దక్కనుంది. డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ సతీష్ ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రాజకీయ సమీకరణల నేపధ్యంలో టీడీపీ నుంచి ఎన్నికైన అభ్యర్థిని రంగంలోకి దింపితే తాము పోటీలో ఉండమనే సంకేతాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లాయి. దీంతో అనూహ్యంగా ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమేరకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ […]పూర్తి వివరాలు ...
ఇప్పటికే అన్ని సాగునీటి ప్రాజెక్టులూ అందుబాటులో ఉండి దర్జాగా మూడు పంటలు పండించుకుంటున్న కృష్ణా డెల్టాకు సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణకు, అదునికీకరణకు ఎక్కువ కేటాయింపులు చేసిన ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో పూర్తి అశ్రద్ధను చూపింది. సీమ సాగునీటి ప్రాజెక్టులకు మొక్కుబడిగా శానా తక్కువ నిధులను కేటాయించి ఈ ప్రాంతంపైన తన నిబద్ధతను, నిర్లిప్తతను మరోసారి చాటుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రాయలసీమకు గుండెకాయ వంటి గాలేరు – నగరి పథకాన్ని పూర్తి చేయటానికి రూ.399.60 […]పూర్తి వివరాలు ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నేడు కడప జిల్లాలో పర్యటించనుంది. ఉదయం 10.30 గంటలకు కడపలోని సభా భవనంలో జిల్లా అధికారులతో కమిటీ సమావేశం కానుంది. కొత్త రాజధాని ఏర్పాటుపై అభిప్రాయాలు, వినతలు స్వీకరించనుంది. ఇప్పటికే ఒకసారి ఆయా ప్రాంతాలలో పర్యటించి పర్యటనలు పూర్తైనట్లు ప్రకటించిన శివరామకృష్ణన్ కమిటీ ఇప్పుడు మళ్ళీ పర్యటిస్తుండడం వెనుక మతలబు ఏమిటో? ఒక పక్క కమిటీ ఇలా పర్యటనలు చేస్తోంటే రాష్ట్ర మంత్రులూ, ముఖ్యమంత్రీ రాజధాని, […]పూర్తి వివరాలు ...
నగరంలోని సీపీ బ్రౌన్ లైబ్రరీలో జులై 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ‘కడప జిల్లా భవిష్యత్? ‘ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నామని జనవిజ్ఞానవేదిక (జవివే) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక సీపీ బ్రౌన్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, డాక్టర్ గేయానంద్‌లు సదస్సుకు ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు. ఉపన్యాసకులుగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గోపాల్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ […]పూర్తి వివరాలు ...
మా రాయలసీమ ముద్దు బిడ్డడు, మా భగీరధుడు, మా రాయలసీమ లో పుట్టి మా సీమ కరవుని తలచి, విచారించి మొత్తం తెలుగు నేల అంతా కరువు ఉండకూడదని కంకణం కట్టుకొని భగీరధ ప్రయత్నం చేసిన వాడు….మా సీమ నిండా సంతోషాలు సిరులు కురవాలని మనసార ప్రయత్నం చేసిన వాడు….మా రాజశేఖరుడు….మా గుండెల్లో సదా స్ఫూర్తి నింపుతూ మమ్ములను నడిపించే చుక్కాని……ఆచంద్ర తారార్కం కీర్తింపబడువాడు నేడు వైఎస్ జయంతి!… కడప జిల్లా ప్రజల తరపున ఆ మహనీయుడికిది […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమ భవితవ్యంపై కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఈ రోజు (ఆదివారం – 6వ తేదీన) నిర్వహించే సీమ స్థాయి కవుల, రచయితల , పాత్రికేయుల సమావేశానికి అందరూ తరలిరావాలని కుందూ సాహితి సంస్థ కన్వీనర్ లెక్కల వెంకటరెడ్డి తెలిపారు. స్థానిక సిపిబ్రౌన్ గ్రంధాలయంలో ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ సమావేశానికి కడప.ఇన్ఫో గౌరవ్సంపాదకులు, రచయిత తవ్వా ఓబులరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర విభజనానంతర పరిణామాలు రాయలసీమకు వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్నాయని […]పూర్తి వివరాలు ...
రైల్వేకోడూరు మండల పరిధిలోని ఆర్.రాచపల్లె తోటలలో శుక్రవారం తెల్లవారుజామున చిరుతపులి తిరగడంతో స్థానికులు బెంబేలెత్తారు. మూడు రోజులుగా ఈ ప్రాంతంలోని అరటితోటల్లో చిరుతపులి తిరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో నీటితడులు కట్టిన తర్వాత ఏదో అడవిజంతువు తిరుగుతుందని పాదాల గుర్తులు చూసి అనుకున్నామని , అయితే శుక్రవారం వేకువజామున తమ తోటలో నీరు తడి కట్టేందుకు వెళ్లానని భాస్కర్‌రాజు అనే రైతు పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని తన తోటలో నిలబడి ఉన్న చిరుతపులిని చూసి భయపడి […]పూర్తి వివరాలు ...
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటిస్తున్న ‘కత్తి’ సినిమా చిత్రీకరణ గురువారం చింతకొమ్మదిన్నెలో జరిగింది. స్థానిక అంగడివీధి సమీపంలోని తెలుగుగంగ కార్యాలయ ఆవరణలో షూటింగ్ నిర్వహించారు. తెలుగుగంగ కార్యాలయం ముందు తమిళంలో కలెక్టరేట్ బోర్డుతో చిత్రీకరణ జరిపారు. పేదలు తమ సమస్యల్ని చెప్పుకునేందుకు రావడం.. పోలీసులు వారితో చర్చించడం తదితర సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో హీరో విజయ్ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ షూటింగ్లో రెండో రోజున సమంత […]పూర్తి వివరాలు ...