కేటాయింపులున్న రాయలసీమ పరిస్థితి పట్టదా? పోలవరం ద్వారా ఆదా అయ్యే 45 టీయంసీల నీటిని, పులిచింతల నిర్మాణం ద్వారా ఆదా అయ్యే 54 టీయంసీల నీటిని, కృష్ణా డెల్టాలో పంటల మార్పిడి ద్వారా ఆదా అయ్యే నీటిని తక్షణమే గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నికర జలాలు పొందేలాగా బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు నివేదికలు ఇవ్వాలి. రాష్ట్ర విభజన బిల్లులో పూర్తిచేస్తామన్న పై ప్రాజెక్టులు అన్నింటికీ బడ్జెట్ కేటాయింపులు ఇచ్చి ఒకటి రెండేళ్ళలో పూర్తిచెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన […]పూర్తి వివరాలు ...
శుక్రవారం (18.07.2014) నాటి సాక్షి దినపత్రికలో ‘రాజధానిగా బెజవాడే బెస్ట్’ అన్న పేరుతో కొండలరావు గారు రాసిన వ్యాసం (లంకె: http://www.sakshi.com/news/opinion/vijayawada-can-be-the-best-capital-city-for-andhra-pradesh-149336) చదివాను. అందులో రావుగారు ఇలా చెబుతున్నారు ‘వెనక బడిన తమ ప్రాంతం రాజధాని అయితేనైనా అభివృద్ధి అవు తుందని కొందరు అంటున్నారు. విభజనను సెంటిమెంట్ గా చూసినవారు రాజధాని ఏర్పాటునూ అలాగే చూస్తు న్నారు. ఆచరణాత్మకంగా, వాస్తవికంగా, తమతో పాటు మిగతా ప్రాంతాల వారి ప్రయోజనాలపరంగా చూడటం లేదు’ అని. రాజధానిని రాయలసీమ వాసులు […]పూర్తి వివరాలు ...
నాకు సిపిఐ పార్టీ అంటే ఎప్పటినుంచో అభిమానం ఉంది కానీ ఈ మద్యన ఆ అభిమానాన్ని చంపుకోవాల్సి వస్తుంది… రాయలసీమ సిపిఐ నాయకులు రాయలసీమకు రాజధాని ,నీళ్ళు కావాలని అంటారు కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాయలసీమకు చెందినవాడే – కానీ ఆయన మాత్రం… రాజధాని గుంటూరు-విజయవాడ మద్య ఉండాలంటాడు ..!. కృష్ణా డెల్టాకునీళ్ళు కావాలంటాడు…! పోలవరాన్ని నిర్మించాలంటాడు…! కాకినాడ -వైజాగ్ కారిడార్ నిర్మించాలంటాడు! కానీ ఈయనకు రాయలసీమ లో కరువుకు నీళ్ళులేక అల్లాడుతున్న ప్రజల దుస్థితి పట్టదు పశువులకు […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు కలెక్టర్ గా నియమితులైన కే.వీ. రమణ గారిని ఒక పాత్రికేయ మిత్రుడు అడిగిన ప్రశ్న చూడండి. ప్ర: రాయలసీమలో తొలిసారిగా పనిచేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనగలరా? స: మొదటి నుంచి కోస్తా, తెలంగాణ జిల్లాల్లో నా సర్వీసు అంతా కొనసాగింది. 2000 సంవత్సరంలో సత్యసాయిబాబా 75వ జన్మదిన వేడుకల సమయంలో రెండున్నర నెలలపాటుఅనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓఎస్డీగా పనిచేశాను. అది మినహా రాయలసీమలో ఎక్కడా పని చేయలేదు. అధికారులు, ప్రజలతోపాటు, పార్టీలతో సంబంధం లేకుండా […]పూర్తి వివరాలు ...
శ్రీభాగ్ ఒప్పందం నేపధ్యం మరియు అందులోని అంశాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా వున్న తెలుగు వారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు, ఉద్యమించారు. రాయలసీమ వారికి సర్కార్ జిల్లాల వాళ్ళు భాషా సంస్కృతుల పరంగా తమను తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది. ఇందుకు ఒక ఉదాహరణ 1927లో జనమంచి శేషేంద్ర శర్మ గారు రాసిన ‘కడప మండల చరిత్రము’ అనే పుస్తకములో కూడా చూడవచ్చు. పాపం శర్మ గారు కడప జిల్లాలో […]పూర్తి వివరాలు ...
స్వార్థ ప్రయోజనాలతో, అధికార దాహంతో తెలుగుజాతిని చీల్చిన ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు రాజధాని కోసం ప్రజల ప్రయోజనాలు గాలికి వదిలి కోట్లకు పడగలెత్తిన రియల్ఎస్టేట్ వ్యాపారులకూ, వారి ప్రయోజనాలను కాపాడే అవినీతి రాజకీయ బేహారుల కోసం గాలింపులు సాగిస్తున్నారు. అశాతవాహన, కాకతీయ, రాయల విజయనగర యుగాలు తెలుగుజాతి సమైక్యతకూ, శతాబ్దాల తరబడి భాషా, సాంస్కృతిక వైభవ ప్రాభవాలకూ మూలవిరాట్టులుగా, కొండగుర్తులుగా నిలిచాయి. ఆనాటి సామంతరాజులైన మండల పాలకుల స్థానిక […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక పేర అధికార పార్టీ రేపుతున్న దుమారం ఉద్రిక్తతలకు దారితీసింది. జానీ అనే తెదేపా కౌన్సిలర్ నిన్న అజ్ఞాతంలోకి వెల్లిపోవడంతో మొదలైన రగడ ఇవాల్టికీ కొనసాగుతుండడం విచారకరం. ఘనత వహించిన మన ఏలికలు ఈ వివాదానికి ముగింపు పలుకపోగా వత్తాసు పలుకుతుండడమే విషాదకర పరిణామం. 22 మంది సభ్యులకు 21మంది హాజరైనప్పటికీ జానీ అపహరణకు గురైనందున గురువారం ఎన్నిక వాయిదా వేసినట్లు ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన జమ్మలమడుగు ఆర్డీవో రఘునాధరెడ్డి […]పూర్తి వివరాలు ...
ఏనాడు చేసుకున్న సుకతమో ఫలించి, ఊహాతీతమైన చారిత్రక మలుపుతో, ఇన్నేళ్లుగా మనల్ని ముంచిన విశాలాంధ్ర విచ్ఛిన్నమయింది. శ్రీబాగ్ ఒడంబడిక మూలం గా నాడు రాయలసీమ వాసులకు కోస్తాంధ్ర నాయకులు ఒట్టేసి రాయించిన హమీలకు ప్రాణమిచ్చే భౌగోళిక స్వరూపం తిరిగి తెలుగునాడుకు ఏర్పడింది. తొలి బస్సు మిస్సయ్యాం. మిగిలిపోయిన రెండో బస్సునైనా అందుకోకుంటే సర్కార్ జిల్లాల ఉక్కుపాదం కింద మన జీవితం నలిగిపోవడం ఖాయం. వాళ్ళ సహవాసం ఇదివరకే చవిచూసినవాళ్ళం. తాగునీటి కోసం, సాగునీటి కోసం, బడుగు జీవితాల […]పూర్తి వివరాలు ...
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా మూడు ట్రిపుల్ ఐటి లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఒకటి కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని నాటి ప్రతిపక్షమైన తెదేపా అసెంబ్లీ సాక్షిగా తీవ్రంగా తప్పుపట్టింది. ఆ సందర్భంలో వైఎస్ మాట్లాడుతూ ‘ఏం ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటి పెట్టకూడదా? అదేమన్నా పాకిస్తాన్లో ఉందా?’ అంటూ తెదేపా నేతలను ప్రశ్నించారు. అదే సందర్భంలో […]పూర్తి వివరాలు ...