కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ తిరిగి శ్రమకోర్చి సమాచారం సేకరించి ‘కడప జిల్లా సాహితీ మూర్తులు’ అనే పుస్తకం రాశారు. వేరొకరు ముందుకొచ్చి ఖర్చులు భరించి దాన్ని ప్రచురించారు. బహుశా అదే సమయంలో తెలంగాణకు చెందిన మౌనశ్రీ మల్లిక్ రాసిన ‘కడప జిల్లా చైతన్యమూర్తులు’ అనే పుస్తకం కూడా వచ్చింది. అది ఆంధ్రజ్యోతి అనే పత్రికకు ఎంత భరించరానిదైందంటే ఆ రెంటిని […]పూర్తి వివరాలు ...
మామూలుగా ఐతే ఒక ప్రాంతం/వర్గంమీద అక్కసుతో అపోహలు, అకారణ ద్వేషం కలిగేలా రాసే కథలను విజ్ఞతగల సంపాదకులు ప్రచురించరు. ఒకవేళ ప్రచురించినా ఇలాంటి కథలకు పాత పత్రికలకు ఉన్నదానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ఐతే ఈ కథ అలా మరుగున పడలేదు. 87 సంవత్సరాల తెలుగు కథాచరిత్రలో 87 మంది రచయితల అత్యుత్తమ కథలుగా ఎంపికచేసిన కథాసాగర్ సంకలనంలో చోటు సంపాదించుకుంది. కథ అక్కడితో ఆగలేదు – ఆ కథాసంకలనాన్ని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ […]పూర్తి వివరాలు ...
పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల విడుదల శభాష్, 15 సంవత్సరాల కల నెరవేరిన రోజు,పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిసామర్ధ్యం 44,000 క్యూసెక్కుల నీటిని విదుదల చేశారు. 2004 లో YSR 11,000 క్యూసెక్కుల సామర్ధ్యమున్న పోతిరెడ్డిపాడులో రెండవ రెగ్యులటర్ కట్టి 44,000 క్యూసెక్కులకు పెంచారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచటాన్ని నిరశిస్తు దేవినేని ఉమా నాయకత్వంలో ప్రకాశం బ్యారేజి కింద టెంట్లు వేసి మూడు రోజులపాటు ధర్నా చేశారు.ఒక్క బక్కెట్ నీళ్ళను తీసుకెళ్ళినా రక్తం చిందిస్తాం అని దేవినేని […]పూర్తి వివరాలు ...
ఆ బువ్వ అంటే తెలుసా మీకు? నా చిన్నప్పటి స్నేహితులు తెలీదు, మా వూరు తెలీదు, అవి ఏవీ తెలీనప్పుడు ఆబువ్వ అంటే ఎట్ట తెలుస్తుందిలెండి? ఆబువ్వ అంటే ఏ బువ్వో కాదండి, ఇప్పుడు మనందరం తింటున్న వరి బియ్యం బువ్వ. అందరం తినే అన్నానికి అంతగా చెప్పాల్నా అనొచ్చు. ఇప్పుడు అందరం తింటున్నాం కాని అప్పుడు మేం తినేవాళ్ళం కాదండి. తినేవాళ్ళం కాదంటే కొవ్వెక్కి తినేవాళ్ళంకాదని కాదు. అప్పుడు మాకు ఆబువ్వ అందుబాటులో వుండేది కాదు, […]పూర్తి వివరాలు ...
‘వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు..’ అన్న సామెత రాయలసీమకు మాత్రం వర్తించదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ‘సీమ’కు అన్యాయమే జరుగుతోంది. పాలకులు ఇక్కడి వారే అయినా.. ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏపీ నూతన రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసినా సమైక్యత కోణంలో సీమ ప్రజలు స్వాగతించారు. అమరావతి ప్రాంతం ఐశ్వర్యవంతులకు మాత్రమే పరిమితమైన రాజధాని. నూతన రాజధాని వద్ద 29 గ్రామాల్లో ఏ మూలకు వెళ్లిన గజం స్థలం ధరను […]పూర్తి వివరాలు ...
చౌదరి సార్ గా ప్రజలతో పిలువబడే డాక్టర్ పి.ఎ.కె .చౌదరి నిన్న కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లెలో మృతిచెందారు. అయన వయస్సు 70 సంవత్సరాలు.ఇటీవల కాలంలో శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఉండే వారు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా సిరిపురం గ్రామానికి చెందిన చౌదరి గారు ముప్పై ఏళ్లకిందట వంటరిగా కడప జిల్లా కు వచ్చి వనిపెంట కేంద్రంగా పరిసర గ్రామాల్లో ఆయుర్వేద, ఆర్.ఎం.పీ వైద్యునిగా ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈప్రాంత గ్రామీణులతో […]పూర్తి వివరాలు ...
జానమద్ది కుమారుడి ఆవేదన కడప కేంద్రంగా తెలుగు సాహిత్యానికి అరుదైన సేవ చేసి తెలుగు సూర్యుడిగా ప్రసిద్ధుడైన మహనీయుడు సీపీ బ్రౌన్ తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగి. విస్మృతి గర్భంలోకి వెళ్లిపోతున్న అలాంటి బ్రౌన్ సాహిత్య కృషిని మళ్లీ వెలుగులోకి తెచ్చిన అరుదైన వ్యక్తి జానమద్ది హనుమచ్ఛాస్త్రి సాహితీ సూర్యుడిగా ప్రసిద్ధి చెందారు. దాదాపు 190 ఏళ్లక్రితం బ్రౌన్ కడపలో నివసించిన స్థలం శిథిలావస్థలో ఉండగా గుర్తించిన జానమద్ది దాన్ని సీపీ బ్రౌన్ స్మారక గ్రంథాలయంగా, ఆపై […]పూర్తి వివరాలు ...
ఎందుకో ఈ రోజు మా వూరి చెట్లు గుర్తుకొస్తున్నాయి… బయట నుండి వచ్చేవాళ్ళకు మా వూరి గుమ్మం తొక్కకముందే రోడ్డుకు కుడివైపున పెద్ద పెద్ద చింతమాన్లు కనపడేవి. అవేవీ మేమో, మా నాన్నలో, వాళ్ళ నాన్నలో నాటినవి గాదు. ఆ చింత చెట్ల ప్రాంతాన్నంతా “పాతూరు” అనేవారు. మా వూరికి ముందున్న వూరు అదే. దాని అసలు పేరు అగ్రహారం. అగ్రహారానికి ఉత్తరంగా చెరువు. అదే కల్పనాయుని చెరువు. ఆ చెరువు గట్టున వున్న శివాలయం అప్పటి […]పూర్తి వివరాలు ...
రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా ఒకటే అనుకోవడం ఒక పద్ధతి (రాయలసీమలోనే జిల్లాల మధ్య అభివృద్ధిలో ఉన్న అంతరాల దృష్ట్యా, అలాగే విభజనానంతర అనుభవాల దృష్ట్యా కూడా నేను దీన్ని బలంగా వ్యతిరేకిస్తాను). అభివృద్ధిలో ఎక్కువ వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలనుకోవడం ఇంకొక పద్ధతి. రాయలసీమలో హైకోర్టు అంటే కర్నూల్లో హైకోర్టు అనే అభిప్రాయం ఒకటి బలంగానే వ్యాప్తిలో ఉంది. […]పూర్తి వివరాలు ...